S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/16/2017 - 03:50

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 15: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (షార్)లో బుధవారం పిఎస్‌ఎల్‌వి సి- 37 రాకెట్ ప్రయోగం ఆద్యంతం ఒక విధమైన ఉద్వేగంతో సాగింది. ఇస్రో ఎంతోప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగం ఇస్రోను రోదసిలో అగ్రరాజ్యాలకు దీటుగా నిలిపింది. పిఎస్‌ఎల్‌వి రాకెట్ ప్రయోగం వివిధ దశల్లో 104 ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో విడిచిపెట్టింది.

02/16/2017 - 03:48

నెల్లూరు, ఫిబ్రవరి 15: అత్యధిక సంఖ్యలో 104 ఉపగ్రహాల ప్రయోగంతో భారత్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిందని ఇస్రో సంస్థ చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. బుధవారం పిఎస్‌ఎల్‌వి-సి 37 ప్రయోగ విజయం అనంతరం షార్‌లోని మీడియా సెంటర్‌లో శాస్తవ్రేత్తలతో కలసి ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

02/16/2017 - 03:43

నెల్లూరు, ఫిబ్రవరి 15: భారతదేశం ఒకప్పుడు తన మేధోసంపదతో యావత్ప్రపంచాన్ని తనవైపు ఆకర్షించింది. ఇప్పుడు మళ్లీ తన విజ్ఞాన నిధి ద్వారా సమస్త దేశాలను తన వైపు తిప్పుకుంటోంది. అందులో ప్రముఖ భూమిక ఇస్రోది.

02/16/2017 - 03:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించే అంశం బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం పరిశీలనకు రాలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడుతుందని వార్తలు రావటం తెలిసిందే.

02/16/2017 - 02:52

లక్నో/డెహ్రాడూన్, ఫిబ్రవరి 15: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో బుధవారం జరిగిన పోలింగ్‌లో భారీగానే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 65 శాతం, ఉత్తరాఖండ్‌లో 68 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ రాత్రి పొద్దుపోయిన తర్వాత స్పష్టం చేసింది. యుపిలో మొత్తం 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిందని, ఇవన్నీ కూడా అత్యంత సునిశితమైన స్థానాలేనని స్పష్టం చేసింది.

02/16/2017 - 02:49

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశ వ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల ఆరోగ్య ఉప కేంద్రాలను ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలుగా మార్చేందుకు కేంద్రం నిర్ణయించింది.

02/16/2017 - 02:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళకు సుమారు 2.51 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు సుప్రీం కోర్టు తన తీర్పులో వెలువరించింది. వీటితో పాటు, 15.9లక్షల రూపాయల విలువైన చేతి గడియారాలు ఉన్నాయని పేర్కొంది.

02/16/2017 - 02:31

చెన్నై, ఫిబ్రవరి 15: కోర్టుకు లొంగిపోయేందుకు బెంగళూరు వెళ్లే ముందు అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి, పార్టీ వ్యవస్థాపకుడు రామాపురంలోని ఎంజి రామచంద్రన్ ఇంటిని సందర్శించిన సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లిన శశికళ సమాధిపై మూడు సార్లు గట్టిగా కొట్టి మనసులో ఏదో స్మరించుకున్నట్లుగా కనిపించింది.

02/16/2017 - 02:29

చెన్నై, ఫిబ్రవరి 15: దివంగత అన్నాడి ఎంకె అధినేత్రి జయలలిత పార్టీ నుంచి బహిష్కరించిన ఇద్దరు కుటుంబ సభ్యులను ప్రధాన కార్యదర్శి వికె శశికళ మళ్లీ అందలమెక్కించారు.

02/16/2017 - 02:26

కనౌజ్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 15: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న అధికార సమాజ్‌వాదీ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. సినిమాలో శత్రువులు ఇద్దరు విరామం (ఇంటర్వల్) తరువాత స్నేహితులు అవుతారని, ఎస్‌పి, కాంగ్రెస్‌ల తీరు కూడా అలాగే ఉందని ఆయన విమర్శించారు.

Pages