S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/30/2016 - 01:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేసింది? రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 50 రోజుల తరువాత కూడా ఆకస్మికంగా ఈ ప్రకటన చేయటం వెనుక కారణాలు వెల్లడించటం సరికాదని భారత రిజర్వ్ బ్యాంకు భావించింది. మానిటరీ పాలసీ రెగ్యులేటర్ కూడా ఇందుకు గల కారణాలను వెల్లడించటానికి నిరాకరించింది.

12/30/2016 - 01:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: రెండున్నరేళ్ల ఎన్‌డిఏ పాలనలో కేంద్రంలోని అన్ని శాఖలూ పారదర్శకంగా, జవాబుదారీ తనంతో పనిచేస్తున్నాయని పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గురువారం ఇక్కడ వివరించారు. దేశానికి సమర్థ నాయకత్వం, సుస్థిర పాలన అందించడం, జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం కోసమే కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ప్రజలు తీసుకొచ్చారని అన్నారు.

12/30/2016 - 01:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలులోకి తేవటం అన్నది అధికార బిజెపి రాజకీయ అజెండాలో భాగమేనని ప్రధాన విపక్షాలు ఆరోపించాయి. ఉమ్మడి పౌరస్మృతిపై కేంద్ర న్యాయ కమిషన్ ప్రజాభిప్రాయం కోరుతూ రూపొందించిన పదహారు ప్రశ్నలకు దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాయి. దేశంలో మూడు తలాఖ్‌ల విధానాన్ని రద్దు చేయాలా వద్దా? దేశంలో ప్రజలందరికీ ఒకే పౌరస్మృతి ఉండాలా వద్దా?

12/30/2016 - 00:59

తిరుపతి, డిసెంబర్ 29: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు డాక్టర్ గుణశేఖర్ యాదవ్, అయన సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటి అధికారులు జరిపిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఐటి అధికారులు ఇప్పటివరకు బయటపెట్టలేదు.

12/29/2016 - 07:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: పెద్దనోట్లు రద్దు చేసిన తరవాత నల్లధనం ఏ మేరకు బయటకు వచ్చింది, ఎంత నల్లధనం ప్రభుత్వం చేతికి వచ్చింది? అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై ఆయన ప్రధాన మంత్రికి ఐదు ప్రశ్నలు వేశారు. బుధవారం ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ సంస్థాగత దినోత్సవం సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు.

12/29/2016 - 07:46

కాన్పూర్, డిసెంబర్ 28: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో అజ్మీర్ షెల్దా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో కనీసం 62 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరు చనిపోయారని ఉత్తర మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ సక్సేనా బుధవారం తెలిపారు.

12/29/2016 - 07:45

లక్నో, డిసెంబర్ 28: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు గట్టి షాకిచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయడానికి 325 మంది అభ్యర్థుల పేర్లను బుధవారం హడావుడిగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ఏ పార్టీతోనూ ఎన్నికల పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు.

12/29/2016 - 07:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అనిల్ బైజాల్‌ను ఢిల్లీ కొత్త లెఫ్టెనెంట్ గవర్నర్‌గా రాష్టప్రతి నియమించారు. లెఫ్టెనెంట్ గవర్నర్‌గా బైజాల్ నియామకాన్ని సిఫార్సు చేస్తూ కేంద్రం బుధవారం శీతాకాల విడిది అయిన హైదరాబాద్‌లో ఉన్న రాష్టప్రతికి పంపించగా, దానికి ఆయన ఆమోదం తెలియజేశారు. కాగా, ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ రాజీనామాను అంతకుముందే రాష్టప్రతి ఆమోదించారు.

12/29/2016 - 07:43

సర్కారుకు సుప్రీం షాకులు

12/29/2016 - 07:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఈదులూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో వేడి సాంబరు పాత్రలో పడి బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘాటనపై జాతీయ మానవహక్కుల సంఘం స్పందించింది.

Pages