S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/02/2017 - 00:52

న్యూఢిల్లీ, జనవరి 1: నోట్ల మార్పిడి వల్ల అనేక ప్రయోజనాలు జరిగాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయడు అన్నారు. ముఖ్యంగా మహిళలు, గ్రామీణులు, పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతులకు శనివారంనాడు ప్రధాని ప్రకటించిన ప్రోత్సాహకాలన్నీ సంక్షేమ పథకాలేనని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనను దేశం మొత్తం స్వాగతిస్తూంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

01/02/2017 - 00:51

అహ్మదాబాద్, జనవరి 1: ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడానికే నానా తంతాలు పడుతున్న ఈ రోజుల్లో గుజరాత్‌లోని ఓ గిరిజన జంట ఏకంగా 17 మంది పిల్లల్ని కనేశారు. అందుకు కారణం- 17 కాన్పుల్లో 16 మంది ఆడపిల్లలు పుట్టారట. అయతే 2013లో మాత్రం ఒక మగబడ్డ జన్మించాడు. అయతే ఇంతమందిని సాకాలంటే మరో మగబిడ్డ ఉండాలని ఆ ఇంటాయన కోరుకున్నాడట.

01/01/2017 - 05:09

ఇటానగర్, డిసెంబర్ 31: వేగంగా మారుతున్న అరుణాచల్‌ప్రదేశ్ రాజకీయాల్లో శనివారం మరోసారి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్ (పిపిఎ)కి చెందిన మొత్తం 43 మంది ఎమ్మెల్యేల్లో 33 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ నేతృత్వంలో శనివారం బిజెపిలో చేరారు. దీంతో ఆ రాష్ట్రంలో బిజెపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

01/01/2017 - 04:51

కొత్త ఏడాదిలో అన్ని వర్గాలకు ఊరట
గృహ రుణాలపై వడ్డీ రాయితీ
సీనియర్లకు మరింత బాసట
వ్యాపారస్తులకు రుణ ధీమా
కిసాన్ కార్డులు ఇక రూపే కార్డులే
జాతికి ప్రధాని నరేంద్ర మోదీ భరోసా

హైలైట్స్

01/01/2017 - 04:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 31:ప్రధాని మోదీ ప్రసంగం ప్రజల ఆశలను నీరుగార్చిందని విపక్షాలు విరుచుకు పడ్డాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల గత 50రోజులుగా ప్రజలు ఎదుర్కొన్న కష్టనష్టాలను పట్టనట్టుగానే మోదీ ప్రసంగం సాగిందని దుయ్యబట్టాయి.

01/01/2017 - 04:34

న్యూఢిల్లీ / విజయవాడ, డిసెంబర్ 31: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందా అంటే ఉందనే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. మావోయిస్టుల నుంచి ఆయనకు ప్రాణహాని ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనపై దాడి చేసేందుకు మావోయిస్టులు రాష్ట్రంలో కాకుండా.. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

01/01/2017 - 03:50

చెన్నై, డిసెంబర్ 31: ఎఐఎడిఎంకె అధినేత్రిగా వికె.శశికళ శనివారం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె చెన్నైలో తొలిసారి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేశారు.

01/01/2017 - 03:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: భారత సైనికదళాల నూతన ప్రధానాధికారిగా లెఫ్టెనెంట్ జనరల్ బిపిన్ రావత్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 42 ఏళ్లపాటు సైన్యానికి సేవలందించిన తర్వాత ఈ రోజు రిటైరయిన దల్బీర్ సింగ్ సుహాగ్‌నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటుగా ఎయిర్‌మార్షల్ బీరేంద్ర సింగ్ ధనోవా వైమానిక దళాల ప్రధానాధికారిగా అనూప్ రాహా స్థానంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

01/01/2017 - 03:33

లక్నో, డిసెంబర్ 31: గంటల వ్యవధిలోనే కొడుకుపై తండ్రి ఆగ్రహం చల్లారిపోయింది. ఉత్తరప్రదేశ్‌కు కొత్త సిఎంను ఎంచుకుని కొడుకును పదవీచ్యుతుణ్ణి చేస్తానన్న ములాయం ప్రతిజ్ఞ నీరుగారిపోయింది. కొడుకును, తమ్ముణ్ణి పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేసి హడావిడి చేసిన సమాజ్‌వాది చీఫ్ ములాయంసింగ్ ఇరవైనాలుగు గంటలు తిరక్కుండానే తన నిర్ణయాన్ని వాపస్ తీసేసుకున్నారు.

01/01/2017 - 03:27

అగర్తల, డిసెంబర్ 31: ఉగ్రవాదం, సాయుధ వేర్పాటువాదులపై భారత్, బంగ్లాదేశ్ కలిసికట్టుగా పోరాడుతాయని, బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ మంత్రి, విదేశీ వ్యవహారాల పార్లమెంటు బోర్డు అధ్యక్షురాలయిన దీపు మోనీ అన్నారు.

Pages