S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/01/2017 - 03:24

బక్సర్, డిసెంబర్ 31: పంజాబ్‌లోని నభా సెంట్రల్ జైల్ నుంచి ఐదుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు పరారైన ఘటన మరచిపోకముందే బిహార్‌లోని బక్సర్‌లో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. బక్సర్ కేంద్ర కారాగారం నుంచి ఐదుగురు ఖైదీలు శుక్రవారం రాత్రి తప్పించుకున్నారు. జీవితఖైదు అనుభవిస్తున్న నలుగురు, మరో ఖైదీ గోడదూకి పారిపోయారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు.

12/31/2016 - 05:29

రాయదుర్గం రూరల్, డిసెంబర్ 30: అనంతపురం జిల్లా రాయదుర్గం-కళ్యాణదుర్గం మధ్య ప్యాసింజర్ రైలు శుక్రవారం ప్రారంభమైంది. రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా కొత్తరైలును ప్రారంభించారు. రాయదుర్గంలో జరిగిన కార్యక్రమంలో ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, విప్ కాలవ శ్రీనివాసులు తదితరులు పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు.

12/31/2016 - 02:19

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: మార్చి 31 తర్వాత కూడా రద్దయిన పెద్ద నోట్లను కలిగి ఉంటే క్రిమినల్ నేరంగా పరిగణిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించింది. పాత కరెన్సీ చెల్లుబాటును పూర్తి స్థాయిలో నిరోధించేందుకు ఈ ఆర్డినెన్స్ అవసరమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

12/31/2016 - 01:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పెద్దనోట్ల రద్దు తరువాత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. 500, 1000 నోట్ల రద్దు తరువాత నల్లధనం అదుపులోకి వచ్చిందన్న అంశం ప్రధాని ప్రసంగంలో ఉంటుందా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. నవంబర్ 8 రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ పెద్ద నోట్ల రద్దు ప్రకటించటం తెలిసిందే.

12/31/2016 - 02:02

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: నగదు రహిత లావాదేవీలను మరింత సరళం చేసే దిశలో ప్రధాని నరేంద్రమోదీ కొత్త మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. శుక్రవారం ప్రారంభించిన యాప్ భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (బిహెచ్‌ఐఎం) పేరిట అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అందుబాటులోకి వచ్చింది. భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతిగా విడుదలైన యాప్ పేదల్లో కెల్లా పేదలకు సాధికారత కల్పిస్తుందని మోదీ అన్నారు.

12/31/2016 - 01:13

లక్నో, డిసెంబర్ 30:ఉత్తర ప్రదేశ్ అధికార సమాజ్‌వాది పార్టీలో రాజకీయ సంక్షోభం పరాకాష్ఠకు చేరుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అభ్యర్థులపై సొంత అభ్యర్థులను ప్రకటించినందుకు ముఖ్యమంత్రి, తన కుమారుడైన అఖిలేష్ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్‌లపై అధినేత ములాయం సింగ్ యాదవ్ బహిష్కరణ వేటు వేశారు. వీరిద్దరినీ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెంట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

12/31/2016 - 01:04

కోల్‌కతా, డిసెంబర్ 30: నగదు రద్దు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ 50లోజులుగా పెద్దనోట్ల రద్దు కారణంగా ప్రజలకు కలిగించిన ఇబ్బందులు ఆయన క్షమాపణ కూడా చెప్పాలని అన్నారు. కేంద్రంలో బిజెపికి చెందిన సీనియర్ నేత ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టాలని లేదా ఓ జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.

12/31/2016 - 01:02

కోల్‌కతా, డిసెంబర్ 30: రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్‌ను శుక్రవారం సిబిఐ అరెస్టు చేసింది. శుక్రవారం సిబిఐ ఎదుట హాజరయిన తపస్‌పాల్‌ను నాలుగు గంటల పాటు సిబిఐ అదికారులు ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

12/31/2016 - 01:01

బెంగళూరు, డిసెంబర్ 30: దేశంలో ఒకరికొకరు సహకరించుకునే స్ఫూర్తి ఉంటే దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధం అవుతుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రభుత్వం, ప్రజా సంఘాలు గనుక ఒకదానితో ఒకటి సహకరించుకున్నట్లయితే దేశ అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని కూడా ఆయన అన్నారు. ‘బెంగళూరు నగరం మిగతా దేశానికి విద్యా కేంద్రం, ఆరోగ్యం కేంద్రంగా మారుతోంది.

12/31/2016 - 00:59

చెన్నై, డిసెంబర్ 30: తమిళనాడులో అధికార అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన వి.కె.శశికళ శనివారం పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఇందుకు వీలుగా రోయపేటలోని అన్నాడిఎంకె ప్రధాన కార్యాలయం ముస్తాబవుతోంది. ముందుగా పార్టీ సంస్థాపకుడు ఎం.జి.ఆర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం పార్టీ అధినేత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది.

Pages