S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/26/2016 - 00:33

79 రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న కాశ్మీర్‌లో మెల్లగా శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయ. వేర్పాటువాదులు నిర్వహిస్తున్న బంద్‌కు ఆదివారం మధ్యాహ్నం
2 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు విరామం ప్రకటించడంతో శ్రీనగర్‌లో కళకళలాడుతున్న రోడ్లు, మార్కెట్లు.

09/26/2016 - 00:24

కోజికోడ్, సెప్టెంబర్ 25: పాకిస్తాన్.. భారత్‌ను బలవంతంగా దీర్ఘకాలిక యుద్ధంలోకి దింపిందని, ఈ యుద్ధంలో ఇటీవల ఉరీ సెక్టార్‌లో మన సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడి ఒక భాగం మాత్రమేనని, అదే చివరి అంకం కాదని, ఈ యుద్ధంలో అంతిమ విజయం మనదేనని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.

09/26/2016 - 00:22

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఉరీ ఉగ్రదాడి పట్ల దేశ ప్రజల్లో వ్యక్తమయిన ఆగ్రహం 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధ సమయంలో భారతీయుల్లో పెల్లుబుకిన ఆగ్రహాన్ని గుర్తు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఉగ్రదాడికి కారకులైన వారిని శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. అంతేకాదు సైన్యం మాటలు మాట్లాడదని, పరాక్రమాన్ని మాత్రమే ప్రదర్శిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు.

09/26/2016 - 00:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: వివాదాస్పద ఇషత్ జహాన్ ‘బూటకపు ఎన్‌కౌంటర్’ కేసుకు సంబంధించిన పత్రాలు అదృశ్యం కావడంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య ఈ అంశంపై చోటు చేసుకుంటున్న పరస్పర విమర్శలు తాజా చర్యతో మరింత పెరగనున్నాయి.

09/26/2016 - 00:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనతోపాటుగా, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను కూడా పరిశీలించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. రైల్వే శాఖకు విడిగా బడ్జెట్‌ను సమర్పించే సంప్రదాయం 92 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.

09/25/2016 - 16:57

న్యూఢిల్లి:కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లను దేశం మరచిపోదని, దాడులకు పాల్పడినవారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం మన్‌కీబాత్‌లో భాగంగా రేడియోలో ఆయన ఉరీ సంఘటనపై మాట్లాడారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నవారిపై సైన్యం తగిన సమయంలో జవాబు చెబుతుందని, సత్తా చాటుతుందని, మన సైన్యం తెగువపై అందరూ నమ్మకముంచాలని ఆయన పిలుపునిచ్చారు.

09/25/2016 - 16:54

న్యూఢిల్లి:హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూను 79 రోజుల అనంతరం పూర్తిగా ఎత్తివేశారు. అయితే గుంపులుగా ఎవరూ తిరగకుండా ఉండేందుకు, పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. రెండు రోజులుగా ప్రశాంత పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

09/25/2016 - 04:30

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: ఇరాక్‌లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించి, వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ‘గల్ఫ్ తెలంగాణ సంస్థ’ప్రతినిధి బసంతరెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం నాడు ఢిల్లీలో బంసంతరెడ్డి విలేఖరులతో మాట్లాడారు. ఏజెంట్ల మోసాలతో, వీసా సమస్యలతో ఇరాక్‌లోని ఏరిబిల్ ప్రాంతంలో రెండు రాష్ట్రాలకు చెందినవారు చిక్కుకున్నారని చెప్పారు.

09/25/2016 - 03:30

భద్రాచలం, సెప్టెంబర్ 24: చత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. జగదల్‌పూర్ జిల్లాలోని బుర్గుం పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఐజి కల్లూరి ఆదేశాల మేరకు బస్తర్ ఎస్పీ ఆర్‌ఎన్ దాస్ ఆధ్వర్యంలో డిఆర్‌జి, డిఏఎఫ్, సిఏఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.

09/25/2016 - 03:17

పనాజి, సెప్టెంబర్ 24: రెండు దేశాలూ అణ్వస్త్రాలను కలిగి ఉన్నందున భారత్‌కు పాకిస్తాన్‌తో యుద్ధం అనేది చివరి ప్రత్యామ్నాయం కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సూచించారు. కాశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడానికి భారత్ అన్ని రకాలుగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.

Pages