S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/04/2016 - 08:32

నాగపూర్, జనవరి 3: అలనాటి ప్రముఖ హిందీ నటి ఆశాపరేఖ్ పద్మ భూషణ్ అవార్డుకోసం తహతహలాడుతున్నారా? ఈ అవార్డు కోసం పెద్దయెత్తున ఆమె లాబీయింగ్ చేస్తున్నారా? కేంద్ర రవాణా శాఖ మంత్రి, ప్రధాని మోదీకి కుడి భుజమూ అయిన నితిన్ గడ్కరీ మాటలను బట్టి ఇది నిజమే అనుకోవాలి. నాగపూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ అవార్డుల ఎంపికనేది తలనొప్పి వ్యవహారంగా మారిందన్నారు.

01/04/2016 - 08:03

పఠాన్‌కోట్, జనవరి 3: ఆర్నెల్లు తిరక్కుండానే పంజాబ్‌పై రెండో ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో మరింతగా భద్రతా దళాలను మోహరించాల్సిన అవసరం ఎంతో ఉందని ఉపముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్ బాదల్ ఉద్ఘాటించారు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఉన్న రాష్ట్ర సరిహద్దుల పొడవునా బిఎస్‌ఎఫ్ దళాలను మరింతగా మోహరించడం ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎంతో అవసరమని తెలిపారు.

01/04/2016 - 08:01

న్యూఢిల్లీ, జనవరి 3: పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు దేశ రాజధానిలోకి చొరబడ్డారని, ప్రజలను నిర్బంధించడం సహా భారీ దాడులకు పాల్పడేందుకు వీరు పథకం పన్నుతున్నారని హెచ్చరికలు రావడంతో ఢిల్లీలో ఆదివారం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై శనివారం దాడికి తెగబడిన విషయం తెలిసిందే.

01/04/2016 - 08:01

ముంబయి, జనవరి 3: మహోన్నతమైన భారతీయ సంస్కృతే దాని అంతర్గత శక్తి అని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. దేశంలోని ప్రతి మతం నిజమైన స్ఫూర్తితో ధర్మ, అహింసా పథాలను అనుసరించాలని ఆయన ఉద్బోధించారు.

01/04/2016 - 08:00

న్యూఢిల్లీ, జనవరి 3: భారత, పాకిస్తాన్ ప్రధాన మంత్రులు లాహోర్‌లో కలిసి చర్చలు జరిపినందుకు ఆగ్రహించిన పాకిస్తాన్ సైన్యం జైషే మహమ్మద్ ద్వారా పఠాన్‌కోట్ దాడి జరిపించినట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో శాంతి చర్చలు ప్రారంభించటం ఇష్టం లేని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు రాహీల్ షరీఫ్ జైషే మహమ్మద్‌ను ఉపయోగించుకున్నారని అంటున్నారు.

01/04/2016 - 07:59

న్యూఢిల్లీ, జనవరి 3: పాకిస్తాన్ సైన్యాన్ని, ఇస్లామిక్ ఉగ్రవాదులను అదుపు చేయలేని ప్రధాని నవాజ్ షరీఫ్‌తో శాంతి చర్చలు జరపకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై వత్తిడి పెరుగుతోంది.

01/04/2016 - 06:57

న్యూఢిల్లీ/పఠాన్‌కోట్ (పంజాబ్), జనవరి 3: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ రెండో రోజైన ఆదివారం కూడా కాల్పులతో హోరెత్తిపోయింది. రాత్రి పొద్దుపోయే వరకూ పేలుళ్లు, కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. సైనిక స్థావరంలో నక్కినట్లుగా భావిస్తున్న మిలిటెంట్లు తాజాగా కాల్పులకు ఒడిగట్టడంతో హోరాహోరీ వాతావరణం నెలకొంది. మరో ఇద్దరు మిలిటెంట్లు ఈ వైమానిక స్థావరంలోనే నక్కినట్లుగా గుర్తించిన సైనికులు వారిలో ఒకడిని అంతమొందించారు.

01/03/2016 - 06:47

జమ్ము, జనవరి 2: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులు దాడికి తెగబడిన నేపథ్యంలో జమ్ముకాశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ఎయిర్‌బేస్‌లు, ఎయిర్‌పోర్టులు, జమ్ము-పఠాన్‌కోట్ జాతీయ రహదారివెంట అధికంగా బలగాలను మోహరించారు. జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల నుంచి ఎటువంటి దాడుల ప్రమాదం లేకపోయినప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశామని డిజిపి రాజేంద్ర కుమార్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.

01/03/2016 - 06:46

పఠాన్‌కోట్ దాడిపై కాశ్మీర్ మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా

01/03/2016 - 06:45

పఠాన్‌కోట్, జనవరి 2: ఎయిర్‌ఫోర్స్ బేస్ స్టేషన్‌పై జరిగింది ముమ్మాటికీ పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదుల పనేనని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. ‘మన భూభాగంపై పాకిస్తాన్ ప్రత్యక్షంగా జరిపిన దాడి’ అని హోమ్‌శాఖ బాధ్యతలూ పర్యవేక్షిస్తున్న బాదల్ అన్నారు. ‘ఉగ్రవాదులను తిప్పికొట్టడం ద్వారా భద్రతా దళాలు మనలో ఆత్మస్థయిర్యాన్ని నింపారు’ అని ఆయన చెప్పారు.

Pages