S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/03/2016 - 06:45

న్యూఢిల్లీ, జనవరి 2: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఐఏఎఫ్ స్థావరంపై దాడికి దిగిన అయిదుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు డిసెంబర్ 30-31 తేదీల మధ్య రాత్రి భారత్‌లోకి చొరబడినట్లు భావిస్తున్నారు. పఠాన్‌కోట్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో గల బమియాల్ గ్రామంలోకి వారు చొరబడినట్లు భావిస్తున్నారు. పాకిస్తాన్‌లోని శకర్‌గఢ్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటి బమియాల్ గ్రామంలోకి చొరబడ్డారని అధికార వర్గాలు తెలిపాయి.

01/03/2016 - 06:45

న్యూఢిల్లీ, జనవరి 2: పఠాన్‌కోట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని తమ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రతిస్తూనే ఉన్నారని, అంతేకాండా ఆ దేశపు మొబైల్ నంబరును ఉపయోగించి పఠాన్‌కోట్‌లో తమకోసం ఒక టాక్సీని సైతం ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది.

01/03/2016 - 06:44

పఠాన్‌కోట్, జనవరి 2: పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలోని ధకీ ప్రాంతవాసులకు శనివారం కాల్పుల మోతతో తెల్లవారింది. పాకిస్తాన్‌కు చెందినవారుగా అనుమానిస్తున్న ఉగ్రవాదులు పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి తెగబడటంతో అక్కడి స్థానికులంతా ఉలిక్కిపడి నిద్రలేచారు. ఈ దాడి సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందగా, నలుగురు ముష్కరులు హతమయ్యారు.

01/03/2016 - 06:44

ఎస్పీని రోడ్డుపై తోసేసి దుండగుల పరారీ
అదే ఫోన్‌నుంచే పాకిస్తాన్‌కు కాల్స్
సరిహద్దు వద్ద కనిపించిన వాహనం

01/03/2016 - 06:43

మీ పాకిస్తాన్ పర్యటన వల్ల ఫలితం శూన్యం పఠాన్‌కోట్ ఘటనపై ప్రధానిని నిలదీసిన కాంగ్రెస్

01/03/2016 - 06:19

విద్యార్థుల తల్లిదండ్రులకు అందించాలని హిమాచల్ హైకోర్టు ఆదేశం

01/03/2016 - 06:00

న్యూఢిల్లీ, జనవరి 2: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సీనియర్ నాయకుడు ఎబి.బర్దన్ శనివారం న్యూఢిల్లీలోని జిబి.పంత్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. బర్దన్ గత నెల 7వ తేదీన పక్షవాతానికి గురవడంతో ఆయనను జిబి.పంత్ ఆసుపత్రిలో చేర్చారు.

01/03/2016 - 05:52

ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడిన ముష్కర మూక తిప్పికొట్టిన భద్రతా దళాలు
పఠాన్‌కోట్‌లో 16 గంటల హోరాహోరీ ఐదుగురు పాక్ ఉగ్రవాదులు హతం
ముగ్గురు జవాన్లు మృతి జైషే మహమ్మద్‌పై అనుమానం: రాజ్‌నాథ్
సైన్యం తెగువకు హ్యాట్సాఫ్: ప్రధాని త్రివిధ దళాధిపతులతో పారికర్ అత్యవసర భేటీ

01/02/2016 - 15:17

విజయనగరం : ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని బొండాపల్లి గ్రామంలో 'జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా తమ గ్రామంలో భూముల రికార్డులు అస్తవ్యస్ధంగా ఉన్నాయంటూ గ్రామస్తులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

01/02/2016 - 13:59

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని బల్‌రాంపూర్‌లో జీపు, విదేశీ పర్యాటకులతో వెళ్తున్న బస్సు ఒకదానినొకటి ఢీకొనడంతో 12 మంది పర్యాటకులు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తులసిపూర్‌లోని దేవి పటాన్‌ ఆలయం నుంచి కొందరు పర్యాటకులు తిరిగి వస్తుండగా వారి జీపు .. బెల్హా నుంచి విదేశీ పర్యాటకులతో వస్తున్న బస్సు మీదికి దూసుకెళ్లింది.

Pages