S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/02/2016 - 13:36

పంజాబ్‌ ‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పఠాన్‌కోట్‌ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. కూంబింగ్‌ సందర్భంగా మరోసారి కాల్పుల శబ్ధం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు పంజాబ్‌ అంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

01/02/2016 - 13:28

పంజాబ్ : పంజాబ్‌లోని పఠాన్‌కోట ఎయిర్‌బేస్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన వారి సంఖ్య ఎనిమిది మందికి చేరింది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు, నలుగురు జవాన్లు మృతిచెందారు.

01/02/2016 - 13:27

బీహార్ : వైశాలి జిల్లా రమాంత్‌పూర్‌లోని రామాలయంలో సీతారాముల విగ్రహాలతో పాటు లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు చోరీకి గురయ్యాయి. అష్ణ్ధాతులతో తయారైన ఈ విగ్రహాల ఎంతో విలువైనవని స్థానికులు చెబుతున్నారు. గతంలో మహావీర, బౌద్ధ విగ్రహాలను చోరీ చేసిన అంతరాష్ట్ర ముఠానే ఈ విగ్రహాలను చోరీ చేసినట్లు భావిస్తున్నారు.

01/02/2016 - 13:26

న్యూఢిల్లీ : పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో శనివారం తెల్లవారుజామున కొందరు ఉగ్రవాదులు భారత్‌లోకి జొరబడేందుకు ప్రయత్నించగా ఈ సందర్భంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రధాని కార్యాలయంలో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ దేశంలో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా ఉపేక్షించబోమని, ధీటైనా సమాధానం ఇస్తామని అన్నారు.

01/02/2016 - 11:56

చెన్నై: భారీ వర్షాల తాకిడి నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న తమిళనాడులో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం నుంచి మూడు రోజులపాటు రామనాథపురం, తిరునల్వేలి, టుటికొరిన్, కన్యాకుమారి జిల్లాల్లో మోస్తరు లేదా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐతే చెన్నైలో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.

01/02/2016 - 11:54

దిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి అనంతరం దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. దీని కోసం ప్రత్యేక భద్రతా సిబ్బందిని నియమించారు.

01/02/2016 - 11:53

చండీగఢ్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో శనివారం తెల్లవారుజామున చొరబడేందుకు కొందరు ఉగ్రవాదులు ప్రయత్నించగా, భారత సైనికులు ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు, ఇద్దరు సైనికులు మరణించారు. వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసేందుకు తాము ఈ దాడికి పాల్పడినట్లు ‘జైష్-ఎ-మహమ్మద్’ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

01/02/2016 - 06:35

న్యూఢిల్లీ, జనవరి 1: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలను రాహుల్ గాంధీ త్వరలోనే చేపట్టే అవకాశం ఉన్నట్టు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న రాహుల్ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు ఊతం లభిస్తుంది.

01/02/2016 - 06:25

న్యూఢిల్లీ, జనవరి 1: వంటగ్యాస్ వినియోగదారులకు సబ్సిడీని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే పద్ధతిని విజయవంతంగా అమలు చేసిన కేంద్రం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అదే పద్ధతిని కిరోసిన్ వినియోగదారులకు అమలు చేయనుంది. అంటే ఏప్రిల్ ఒకటి నుంచి కిరోసిన్ వినియోగదారులు కూడా మార్కెట్ ధరపై కిరోసిన్‌ను కొనాల్సి ఉంటుంది. వారు పొందాల్సిన సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం తరువాత వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.

01/02/2016 - 06:02

న్యూఢిల్లీ, జనవరి 1: జాతీయ ఫిల్మ్ సెన్సార్ బోర్డు(సిబిఎఫ్‌సి) ప్రక్షాళనకు ప్రభుత్వం నడుంబిగించింది. బోర్డు పనితీరుపై ఇటీవల వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్‌బెనెగల్ సారధ్యంలో ఓ ప్యానెల్ కమిటీ ఏర్పాటైంది. అలాగే సినీ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, పియూష్ నంది, సినీ విమర్శకుడు భవనా సోమాయలను కమిటీ సభ్యులుగా నియమించారు.

Pages