S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/10/2015 - 06:07

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రాష్ట్ర విభజన పర్యవసానంగా రెండు రాష్ట్రాల మధ్య దిగువ స్థాయి కోర్టులలో క్యాడర్ విభజనకు మార్గం సుగమమైంది. హైకోర్టు విభజన జరిగేంత వరకూ న్యాయాధికారులను విభజించరాదని కోరుతూ అదనపు మేజిస్ట్రేట్ దుంపల ధర్మారావు ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గత జూలై 7న యథాతథ స్థితిని కొనసాగించవలసిందిగా తీర్పునిచ్చింది.

12/10/2015 - 05:48

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సందర్భంలో పరస్పర నమస్కారాలతో పలకరించుకుంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కె చంద్రశేఖర్ రావు

12/10/2015 - 05:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, పౌర విమానయాన రంగాల అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు కేంద్రం ఉన్నతాధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రతి మూడు నెలలకూ అమరావతి లేదా ఢిల్లీలో ఈ టాస్క్ఫోర్స్ సమావేశమై ఆయా రంగాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేష్ వర్మ చెప్పారు.

12/09/2015 - 18:41

ఇస్లామాబాద్‌: ఆసియా దేశాల ప్రాంతీయ సదస్సు 'హార్ట్ ఆఫ్ ఆసియా' కారక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సుష్మాస్వరాజ్ ఇస్లామాబాద్‌ వెళ్లారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్‌ను కలిశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఆమె ఆయనతో భేటీ అయ్యారు.

12/09/2015 - 18:26

ఢిల్లీ :మావన వనరుల ఆధారంగా పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చెప్పారు. ఢిల్లీ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధి వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

12/09/2015 - 15:48

ముంబయి : అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ఆస్తులకు ముంబయిలో నేడు వేలంపాట నిర్వహించారు.సౌత్ ముంబయిలోని డిప్లమాట్ హోటల్‌లో వేలం ప్రక్రియ జరుగుతోంది. దావూద్‌కు ముంబయిలో కోట్లాది రూపాయల విలువైన ఏడు ఆస్తులున్నాయి. ఇందులో ముంబయిలో మూడు , నగర శివార్లలో నాలుగు రకాల ఆస్తులున్నాయి. భారత్ నుంచి దావూద్ పారిపోయిన తర్వాత అతని ఆస్తులు సీజ్ చేసిన అధికారులు ఇవాళ వేలం వేస్తున్నారు.

12/09/2015 - 15:34

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. చెన్నై వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని మోడీకి జయ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే చెన్నై కోలుకుంటుంది. రవాణాతో పాటు ఇతర వ్యవస్థలు మెరుగవుతున్నాయి.

12/09/2015 - 15:27

కాబుల్ : ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్ విమానాశ్రయ సమీపంలో దాడికి పాల్పడ్డ ముగ్గురు తాలిబన్ ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. ఈ దాడిలో ఎనిమిది మంది సాధారణ పౌరులు మృతిచెందగా మరో 10 మంది గాయపడ్డట్లు ఆఫ్ఘనిస్తాన్ అధికారులు తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు కాందహార్ గవర్నర్ సమీమ్ తెలిపారు.

12/09/2015 - 15:20

ఢిల్లీ : జూనియర్‌ సివిల్‌ జడ్జిల నియామకానికి మార్గం సుగమమైంది. గతంలో విధించిన యధాతథస్థితిని సుప్రీంకోర్టు బుధవారం ఎత్తి వేసింది.

12/09/2015 - 13:42

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి సంబంధం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన బుధవారంనాడు పార్లమెంటులో కాంగ్రెస్ పార్లమెంటరీ నేత ఖర్గే మాట్లాడిన దానికి సమాధానం ఇస్తూ.. మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం ఉన్నపుడు భాజాపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను అరెస్టు చేయలేదా అని ప్రశ్నించారు.

Pages