S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/11/2015 - 05:55

విద్యుత్ ఉద్యోగుల వివాదంపై హైకోర్టుకు సుప్రీం ఆదేశం

12/11/2015 - 06:05

హిట్ అండ్ రన్ కేసులో అభియోగాలు కొట్టివేసిన ముంబయి హైకోర్టు
ప్రాసిక్యూషన్ వాదనలో పసలేదన్న న్యాయమూర్తి

12/10/2015 - 16:50

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరవు, వరదల వల్ల జరిగిన నష్టంపై రాజ్‌నాథ్‌కు ఆయన నివేదిక అందజేశారు.

12/10/2015 - 16:43

సూరత్: దేశద్రోహం కేసులో పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన సూరత్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఆయన బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. పటేళ్లకు ఓబీసీ కోటాలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని గుజరాత్ లో ఉద్యమాన్ని లేవదీసిన విషయం తెలిసిందే. ఉద్యమం ఆందోళన కరంగా మారి ఘర్షణలకు తావిచ్చింది.

12/10/2015 - 16:31

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 2012లో జరిగిన పార్క్‌స్ట్రీట్‌ అత్యాచార ఘటనలో ఈరోజు న్యాయస్థానం ముగ్గుర్ని దోషులుగా నిర్ధారించింది. రేపు కోర్టు వీరికి శిక్ష ఖరారు చేయనుంది. 2012 ఫిబ్రవరి 6న పార్క్‌స్ట్రీట్‌ ప్రాంతంలో ఓ మహిళను కారులో ఎక్కించుకొని తుపాకీతో బెదిరించి అయిదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. కేసులో అయిదుగురు వ్యక్తులపై ఛార్జిషీటు దాఖలైంది.

12/10/2015 - 16:30

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణకు గృహ నిర్మాణ పథకం కింద రావాల్సిన నిధుల అంశంతోపాటు పలు అంశాలపై చర్చించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

12/10/2015 - 16:29

ముంబయి : హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా తేలిన సల్మాన్ ఖాన్‌కు పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వనున్నారు. త్వరలోనే ఆయనకు పాస్‌పోర్టును అందచేస్తారని సల్మాన్ తరుపున లాయర్ అమిత్ దేశాయి తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ నిర్ధోషిగా తేలడంతో ఆయన ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. బాలీవుడ్ స్టార్ ఇంటి దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

12/10/2015 - 13:23

ముంబయి : ముంబయి హైకోర్టులో సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఉత్కంఠ రేపుతున్న 2002నాటి హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను దోషిగా నిర్ధారించలేమని పేర్కొంది. సల్మాన్ అనుమానితుడే కానీ దోషి కాదని కోర్టు పేర్కొంది. ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన ఆధారాల ద్వారా సల్మాన్‌ను దోషిగా తేల్చలేమని కోర్టు స్పష్టం చేసింది.

12/10/2015 - 12:46

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు రగడ గురువారం కూడా పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. ఈ విషయమై లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో గందరగోళం నెలకొనటంతో ఉభయసభలను వాయిదా వేశారు. పార్లమెంటు పనిచేయకపోవడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్కరి ఇష్టాయిష్టాల మేరకు ప్రజాస్వామ్యం పనిచేయబోదని ఆయన కాంగ్రెస్‌ పార్టీపై మండిపడ్డారు.

12/10/2015 - 08:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రధాన మంత్రి కార్యాలయం రాజకీయ ప్రతీకార చర్యల మూలంగానే తమపై నేషనల్ హెరాల్డ్ కేసులు పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంటు ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు నూటికి నూరు శాతం ప్రధాన మంత్రి రాజకీయ ప్రతీకారమేనని ఆరోపించారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉన్నదని ఆయన ఆ వెంటనే ప్రకటించారు.

Pages