కర్నూల్

జూలైలో ప్రధాని రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 9 : ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జాతికి అంకితం ఇచ్చేందుకు జూలై నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలుకు రానున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఆయన పర్యటనకు సంబంధించిన తేదీలు ఖరారు కానప్పటికీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలని సచివాలయం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో సుమారు 5వేల ఎకరాల్లో నిర్మిస్తున్న సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా మొదటి దశలో 950 మెగా వాట్లను ఉత్పత్తి చేయనున్నారు. ఈ కేంద్రం నిర్మాణ పనులు దాదాపు పూర్తవుతున్న దశలో గత నెలలో వీచిన పెనుగాలుల ధాటికి అనేక సౌర ఫలకాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రస్తుతం వాటిని పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను పూర్తి చేసి ఉత్పత్తికి సిద్ధం చేస్తే ప్రధాని కార్యాలయం నుంచి తేదీలను ఖరారు చేయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరిలో సిఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా సౌర విద్యుత్ కేంద్రం ఘనతను, నిర్మాణ పనులపై వివరాలను వెల్లడించి ప్రారంభానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి తేదీలు ఖరారు కాగానే ఆయన రాకకు సంబంధించిన పనులు చేపడతామని తెలిపారు.