మెదక్

డయాలసిస్ కేంద్రం సిద్దిపేట ప్రజలకు వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలోనే తొలి డయాలసిస్ సెంటర్ సిద్దిపేటలో ఏర్పాటు చేయటంతో ఈప్రాంత ప్రజలకు ఏంతో ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కిడ్ని వ్యాధి గ్రస్తులకు ఉచిత డయాలసిస్ కేంద్రం వరం అన్నారు. కిడ్ని వ్యాధి గ్రస్తుల బాధలు వర్ణణాతీరమని, ప్రైవేటు ఆసుపత్రులకు డయాలసిస్‌కు వెళ్లి అప్పుల పాలవుతు మానసికంగా కుంగిపోతున్నారన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట కేంద్రాన్ని మొట్టమొదగా ప్రారంభించగా, మిగత 39 కేంద్రాల్లో నెలరోజుల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కోసం సంవత్సర కాలంగా ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు సాధ్యమైందన్నారు. ఐదు బెడ్స్‌తో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, నిత్యం 20 మందికి ఉచితంగా డయాలసిస్ చేయనున్నట్లు పేర్కొన్నారు. పెషేంట్లు అధికంగా వస్తే మరిన్ని బెడ్స్‌లు పెంచి కేంద్రాన్ని విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. డయాలసిస్‌కు ప్రతి పెషేంట్‌కు కొత్త కిట్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆత్యాదునికమైన జపాన్ మిషన్లు, జర్మని ఫిల్టర్లు వినియోగిస్తు కార్పొరేట్‌కు దీటుగా సేవలు అందించేనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ అసుపత్రులను పూర్తిగా నిర్విర్యం చేయగా తెలంగాణ సర్కార్ వాటిని బలోపేతం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గొప్ప మార్పు ప్రజల్లో వచ్చిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల నుండి ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరుతున్నారని మంచి పరిణామమన్నారు. సిద్దిపేట మాత శిశుసంక్షేమ కేంద్రంలోని ఎన్‌ఎన్‌సియు కేంద్రంలో నిత్యం ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీ అయిన పిల్లలు చికిత్సకు వస్తున్నారన్నారు. అలాగే ఇందిరానగర్ ఉన్నత పాఠశాలల్లో పెద్ద ఎత్తున ప్రైవేటు పాఠశాలలు చేరటంతో అడ్మిషన్లు లేవని బోర్టు పెట్టారని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా డెలివరీల్లో 80 శాతం నార్మల్ కాగా, 20 శస్త్ర చికిత్సలు అవుతాయని, తెలంగాణలో 20 నార్మల్ అయితే 80 శాతం ఆపరేషన్లు అవుతున్నాయని, ఈ పరిస్థితి మారాలన్నారు. ఆపరేషన్ల వల్ల తల్లి, పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. నార్మల్ డెలివరీల కోసం ప్రజల మధ్య అవగాహన కల్పించాలన్నారు. కెసిఆర్ కిట్ పుణ్యమా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికంగా డెలివరీలు అవుతున్నాయన్నారు. తెలంగాణ సర్కార్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమన్నారు. అంగన్‌వాటీలు గ్రామాల్లో డెలివరీలకు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మానవ సేవయే మాధవ సేవ పేద ప్రజలకు సేవ చేయటంతో ఏంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ కంకణ బద్దులై పనిచేస్తున్నారన్నారు. సిద్దిపేటకు మెడికల్ కళాశాలకు ప్రజలకు మరింత మెరుగైన వైద్యం
సిద్దిపేటకు మెడికల్ కళాశాల మంజూరు కావటంతో ఈప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కొత్తగా మెడికల్ కళాశాల ఏర్పాటుతో జిల్లా ఆసుపత్రిలో 20 మంది వైద్యులు ఉండగా, కొత్తగా 81 డాక్టర్లు రానున్నారని, పేదలకు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందన్నారు. 20 కోట్లతో 300 బెడ్స్ ఆసుపత్రి నిర్మాణం జరగుతందన్నారు. ఎంసిహెచ్ ఆసుపత్రిని ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తారన్నారు. డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆనంతరం మంత్రులు హరీష్‌రావు, లక్ష్మారెడ్డిలు పరిశీలించారు. వైద్యబృందంతో చర్చించారు. ఆనంతరం కిడ్ని వ్యాధిగ్రస్తులతో మంత్రులు ముచ్చటించారు. ఈకార్యక్రమంలో ఎంపి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, జెసి పద్మాకర్, తహశీల్దార్ పరమేశం, కౌన్సిలర్లు వేణుగోపాల్‌రెడ్డి, ప్రవీణ్, నాయకులు వెంకటేశ్వర్‌రావు, శ్రీకాంత్, సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఎస్‌ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం
నారాయణఖేడ్: కంగ్టి మండలం చాప్టా(బి)గ్రామానికి చెందిన మాదవిగాలప్ప రైతు తన భూమి సర్వే నెంబర్ 12లో 1.30 గంటలు పత్తి పంటనువేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన సిద్దమ్మసంగ్రాం వారితోపాటు మరోకరు కలిసి 30 గంటల పత్తిని పికేశారని కంగ్టి ఎస్ ఐ గత మూడు రోజులు క్రితం ఫిర్యాదు చేసిన అసలే పట్టించుకోకుండా వారితో మాట్లాడుతున్నారని బాధితురాలు మాదవిగాలప్ప ఎస్పీకి ఫిర్యాదు చేస్తునట్లు శుక్రవారండు ఖేడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ అరోపించింది. తహశీల్దార్ రాజయ్య, ముందు తానే పత్తిని ఫికేశాను అంటు ఒప్పుకుంటున్న పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ రెవెన్యూ కార్యదర్శి కిష్టయ్య శుక్రవారంనాడు గ్రామానికి వెళ్లి పత్తి పంటను చూసి గ్రామస్ధులతో పంచనామా చేయగా 30 గుంటల పత్తి పంటను ఫికేసినట్లు తెలిందని ఈవిషయం తహశీల్దార్‌కు నివేదిక ఇచ్చినట్లు కిష్టయ్య తెలిపారని పోలీసులకు చెబుతున్న సిద్దమ్మ సంగ్రామాలతో కుమ్మక్కైరని అరోపించారు. జిల్లా ఎస్పీ వెంటనే విచారణ జరిపి మాకు న్యాయం చేస్తూ కంగ్టిలో ఇలాంటి ఎస్‌ఐని ఉంచరాదని మాదవిగాలప్ప విజ్ఞపి చేశారు.
ములుగు మండలంలో మంత్రి పోచారం పర్యటన
ములుగు : ములుగులో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ములుగులో నిర్మిస్తున్న ఆర్టికల్ఛర్ యూనివర్సిటి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యత ప్రామాణాలు పాటించాలని కాంట్రక్టర్‌కు సూచించారు. వచ్చె విద్యా సంవత్సరం వరకు పూర్తి చేసే విదంగా పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం ప్రాతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ఈ యూనివర్సిటి రాష్టన్రికే తల మానికం కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలోఅర్టీకల్చర్ యూనివర్సిటీ రిజిస్టార్ రాజగోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, ఆర్డీఓ విజేయందర్‌రెడ్డి, ఎఓ నర్సింహారావు పాల్గొన్నారు.

ఆసరా పింఛన్‌ల కోసం మహిళల ఆందోళన
నర్సాపూర్: ఆసర పింఛన్‌లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఆందోళన చేపట్టారు. శుక్రవారంనాడు నర్సాపూర్‌లోని సబ్ పోస్ట్ఫాస్ కార్యాలయం ఎదుట పెద్ధ ఎత్తున మహిళలు పింఛన్‌లు ఇప్పించాలని ఆందోళనకు దిగారు. తపాల ఉద్యోగుల సమ్మే నెపద్యంలో తమకు పింఛన్‌లు ఇవ్వడం లేదని అన్నారు. పింఛన్‌లు వచ్చి వారం రోజులు గడిచిపోతున్నా తమకు పింఛన్‌లు ఇచ్చేవారే కరువయ్యారని వాపోయారు. నెల నెలకు ఇచ్చే పింఛన్‌లు రాకపోవడం వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని వెంటనే పింఛన్ డబ్బులు ఇప్పించే చర్యలు తీసుకోవాలని ఎస్‌పిఎంకు విజ్ఞప్తి చేశారు.

నర్సాపూర్ ఎస్.ఓ పరిధిలో నిలిచిపోయిన తపాల సేవలు..
నర్సాపూర్ సబ్ పోస్ట్ఫాస్ పరిధిలోని 16బ్రాంచ్ పోస్ట్ఫాస్‌లకు చెందిన బిపిఎంలు సమ్మే చేస్తుండటం వల్ల తపాల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. నర్సాపూర్ ఎస్.ఓ పరిధిలోని రుస్తుంపేట, రత్నాపూర్, పిలుట్ల, లింగాపూర్, మూసాపేట, నాగులపల్లి, కాగజ్‌మద్దూర్, పెద్ధ చింతకుంట, నల్లవల్లి, గుమ్మడిదల, అన్నారం, కానుకుంట, బొంతపల్లి, గోమారం, పెద్ధ గొట్టిముక్కుల, చిన్నగొట్టిముక్కుల బ్రాంచ్ కార్యాలయాలు గత మూడు రోజులుగా మూతపడ్డాయి. దేశవ్యాప్త సమ్మేలో భాగంగా తపాల సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. తపాల ఈడి ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలని, ఈఎస్‌ఐ, పిఫ్ వంటి సౌకర్యాలు కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌లతో ఏఐజిడిఎస్‌యూ సమ్మేను ప్రారంభించింది. కాగా తపాల ఈడీ ఉద్యోగులు ఆసర పింఛన్‌లు, ఉపాధిహామీ పథకం పేమెంట్లు, ఆర్‌డి, ఎస్‌బి, ఆర్‌పిఎల్‌ఐ, పలు భీమా సౌకర్యాలను, పార్శిల్స్, ఉత్తరాల బట్వాడ వంటివి తమ బ్రాంచ్ కార్యాలయాల్లో ప్రజలకు సేవలందిస్తుంది. కేవలం 3గంటల పని సమయంతో ఇలాంటి పనులు చేస్తు శ్రమ దోపిడికి గురౌతున్న ఈడీ ఉద్యోగులు సమ్మేకు వెళ్లారు. దాంతో ఆసర పింఛన్‌దారులు అనేక ఇబ్బందులకు గురౌన్నారు. తమకు సకాలంలో ఏలాంటి ఇబ్బందులు పెట్టకుంట ఫించన్‌లు అందించేవారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈడీ ఉద్యోగుల సమ్మే వల్ల సూమారు 8వేల పింఛన్‌లు నిలిచిపోయినట్లు తెలిసింది. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

రైతులకు రుణాలు ఇప్పించే బాధ్యత తహశీల్దార్లదే
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి: రైతులు పంట రుణాల కోసం బ్యాంకులు, తహశీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మండల తహశీల్దార్లదేనని కలెక్టర్ మానిక్కరాజ్ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సమస్యలు లేని గ్రామాల పురోగతి, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, కోర్టు కేసులు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంట రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న బ్యాంకు బ్రాంచి మేనేజర్లతో తహశీల్దార్లు మాట్లాడాలన్నారు. రైతులు బ్యాంకుల నుండి తహశీల్దార్ కార్యాలయానికి రావడం మానివేయాలని, అందుకు సంబంధిత డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా జిల్లాలో ఇప్పటి వరకు 304 గ్రామాలు పూర్తయ్యాయని, మిగిలిన గ్రామాలను సెప్టెంబర్ మాసాంతంలోగా పూర్తి చేయాలని సూచించారు. ముందస్తు ప్రణాళికతో పూర్తి చేయాలన్నారు. సర్వే పూర్తి చేసి, గ్రామ సభల ద్వారా ప్రొసిడింగ్స్ ఇవ్వాలని సూచించారు. మండల తహశీల్దార్ల కార్యాలయాల్లో నిర్వహించాల్సిన రికార్డులను ఆప్‌డేట్ చేయాలని, బేసిక్ రికార్డులన్ని ప్రతి కార్యాలయంలో నిర్వహించాలని ఆదేశించారు. కోర్టు కేసులను ఆప్‌డేట్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఒకటవ తరగతి విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాలను ఇవ్వాలని అదే విధంగా ఏప్రిల్, మే మాసాలలో పదవ తరగతి విద్యార్థులకు ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని తెలిపారు. ఈ ప్రక్రయ ప్రతి సంవత్సరం యధావిధిగా కొనసాగించాలని తహశీల్దార్లకు సూచించారు.
తహశీల్దార్ల కార్యాలయాలకు అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్లు, ప్రింటర్లు తదితర సామాగ్రిని అందజేస్తామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి రఘురాంశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి క్రిష్ణారెడ్డి, తహశీల్దార్లు పాల్గొన్నారు.

ఆలయాలకు శ్రావణ శోభ
* ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళా భక్తులు
కొల్చారం: మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో చివరి శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు ఉదయానే్న దేవాలయాలు వెళ్లి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. శ్రావణ మాసం ముగుస్తున్నందున మండలంలోని అంసాన్‌పల్లి వెంకటేశ్వర దేవాలయం, కొల్చారం వీరభద్ర ఆలయం, రంగాయిపేట దుర్గ్భావాని ఆలయం, రంగంపేట రంగనాయక స్వామి దేవాలయం, ఎనగండ్ల మల్లిఖార్జునస్వామి తదితర దేవాలయాల్లో భక్తులు భారీయేత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొన్నారు.

గ్రేటర్ హైద్రాబాద్‌లోకి అమీన్‌పూర్ ఓఆర్‌ఆర్ లోపలి గ్రామాలన్నీ విలీనం
పటన్‌చెరు: పటన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ గ్రేటర్ హైద్రాబాద్‌లో కలపడానికి ముమ్మరంగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అమీన్‌పూర్ గ్రామ పంచాయతితో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలను జిహెచ్‌ఎంసిలో విలీనం చేయడానికి అధికారులు అవసరమైన కార్యచరణ రూపొందిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ మహానగరం చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న అన్ని గ్రామాలను గ్రేటర్ హైద్రాబాద్‌లోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్, నాగులపల్లి, కొల్లూరు, వెలిమెల, ఉస్మాన్‌నగర్, బండలగూడ తదితర గ్రామాలతో పాటు అమీన్‌పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గుడా, సుల్తాన్‌పూర్, ఐలాపూర్ తదితర గ్రామ పంచాయతీలను సాధ్యమైనంత తొందరగా మహానగరంలో విలీనం చేయడానికి కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. భాగ్యనగరానికి అతి చేరువలో ఉండే ఈ గ్రామాలు ఇప్పటికే గ్రేటర్‌లో కలవాల్సి ఉండగా ప్రభుత్వాలు మారడంతో ప్రక్రియ ఆలస్యమైంది. గత జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు ఓఆర్‌ఆర్ లోపలి గ్రామాలన్నీ గ్రేటర్‌లో కలుస్తాయని ప్రచారం జరిగింది. 150 కార్పోరేట్ సీట్లున్న గ్రేటర్ హైద్రాబాద్ మహానగర మున్సిపాలిటీని 200 సీట్ల వరకు పెంచాలని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికి ఆచరణలో సాధ్యం కాలేదు.
జలమండలి పరిధిలోకి మంజీరా నీటి సరఫరా
అమీన్‌పూర్ మండల పరిధిలోని గ్రామాలకు, రామచంద్రాపురం మండల పరిధిలోని గ్రామాలకు మంచినీటి సరఫరా మంజీరా వాటర్‌వర్క్స్ ద్వార జరుగుతోంది. ఇక నుండి పద్ధతి మారుతోంది. గ్రేటర్ హైద్రాబాద్ మహానగర మున్సిపాలిటీకి మంచినీటిని సరఫరాను పర్యవేక్షిస్తున్న జలమండలి పరిధిలోకి పై గ్రామాలను తీసుకొస్తున్నారు. ఇక నుండి ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా కాకుండా జలమండలి ద్వారా మాత్రమే ప్రజలకు అవసరమైన త్రాగునీటిని అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అమీన్‌పూర్ గ్రామ పంచాయతి పరిధిలోని భీరంగూడ కమ్యూనిటి హాలులో జలమండలి కార్యాలయాన్ని ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా నల్లా కనెక్షన్‌లు తీసుకునే వారు జిహెచ్‌ఎంసి పరిధిలోని జలమండలి కార్యాలయంలో సంప్రదించాలని గ్రామ పంచాయతి సిబ్బంది ప్రజలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో అమీన్‌పూర్ గ్రామమే కాకుండా మండల పరిధిలోని అన్ని గ్రామాలు గ్రేటర్ కలుస్తున్నాయని ప్రచారం ఊపందుకుంది. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించగా కొంత మేరకు నిజమని అనిపిస్తోంది. వారి నుండి సూటిగా అవునని సమాధానం రానప్పటికి జరగబోయె పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నాయి.
ఇదిలా ఉండగా అమీన్‌పూర్ సర్పంచ్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు కాట శ్రీనివాస్‌గౌడ్‌ను పదవి నుండి భర్తరఫ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మానిక్‌రాజ్ ఖన్నన్ ఉత్తర్వులు జారీ చేసారు. గత వారం రోజుల క్రితం జరిగిన ఈ పరిణామం మరింత ఉఠ్కంటకు దారి తీసింది. సర్పంచ్ సస్పండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఇది రెండవ సారి. గతంలో రెండు మాసాల క్రితం ఇదే మాదిరిగా సర్పంచ్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనితో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఉత్తర్వులను నిలిపి వేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. పంచాయతి రాజ్ శాఖ ఉన్నత అధికారికి అప్పీలు చేసుకోవాల్సిందిగా న్యాయస్థానం సదరు ఫిర్యాదుదారు కాట శ్రీనివాస్‌గౌడ్‌కు సూచించింది. పంచాయతిరాజ్ శాఖ కార్యదర్శి సైతం జిల్లా కలెక్టర్ మానిక్‌రాజ్ ఖన్నన్ ఉత్తర్వులనే సమర్థించడంతో మరోసారి భర్తరఫ్ ఉత్తర్వులు వచ్చాయి. అమీన్‌పూర్ సర్పంచ్ పదవి కాలం వచ్చే సంవత్సరము జూన్ మాసంతో ముగుస్తుంది. దానితో పాటు రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్, కొల్లూర్, నాగులపల్లి, బండలగూడ, ఉస్మాన్‌నగర్ పంచాయతీల కాలపరిమితి జూన్‌తో ముగుస్తుంది. ఈ నేపధ్యంలో కాలపరిమితి ముగిసిన తరువాత ఆయన స్థానాలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీలు కల్పించకుండా గ్రేటర్ విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసియు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు
సిద్దిపేట: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసియు కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మంత్రి హరీష్‌రావులు శుక్రవారం పరిశీలించారు. వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రులు లక్ష్మారెడ్డి, హరీష్‌రావు పరిశీలించారు. నాణ్యణ ప్రమాణాలకు అనుగుణంగా ఆసుపత్రిని నిర్మించాలన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను
పరామర్శించిన మంత్రులు
చిన్నకోడూరు మండలం రామునిపట్ల వద్ద ఆటో- బైక్ ఢీకొన్న సంఘటలో తీవ్ర గాయాలకు గురైన జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ విద్యార్థులను మంత్రులు హరీష్‌రావు, లక్ష్మారెడ్డిలు శుక్రవారం పరామర్శించారు. విద్యార్థులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, చైర్మన్ రాజనర్సు వైద్యులు పాల్గొన్నారు.
రంగనాయకసాగర్ కుడికాల్వ భూనిర్వాసితులకు ప్రభుత్వ అండ
* 2.25కోట్ల పరిహారం చెక్‌లను పంపిణీ
* ఆర్ అండ్‌బి గెస్ట్ హౌజ్‌కు శంకుస్థాపన
* మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట అర్బన్: రంగనాయక సాగర్ కుడికాలువలో భూములు కొల్పొతున్న భూనిర్వాసిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక ఆర్‌డిఓ కార్యాలయంలో రంగనాయకసాగర్‌కుడి కాలువలో భూములుకొల్పొతున్న నిర్వాసితులకు 2.25 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మట్లాడుతూ రంగనాయకసాగర్ కుడికాలువలో భూములు కోల్పొతున్న వెల్కటూర్ రైతులకు ప్రభుత్వం అన్ని విధానల ఆదుకుంటుందన్నారు. గ్రామానికి చెందిన 36మంది రైతులు 29 ఏకరాల భూమిని కోల్పోతున్నారన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉండి 2.25కోట్ల రూ.లు అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా కోనాయిపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాల రైతులకు కూడ త్వరితగతిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు రోజుల్లో తానే స్వయంగా రైతులకు చెక్కులు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి పద్మాకర్, ఆర్డీఓ ముత్యరెడ్డి, జడ్పివైస్ చైర్మన్ సారయ్య, ఎంపిపి శ్రీకాంత్‌రెడ్డి, ఓఎస్డీ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబానికి ఆర్థిక సాయం
కాళ్ళకుంట కాలనీలో మృతి చెందిన చిన్నారుల కుటుంబానికి మంత్రి హరీష్‌రాలు 2లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇటివల కాలనీలో మిషన్ భగీరధ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతుల కుంటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన మంత్రి హరీష్‌రావు పార్టీ పరంగా లక్ష, ప్రభుత్వ పరంగా లక్ష రూ.లు అందించారు.

నేటి నుంచి సిద్దేశ్వరాలయంలో జలాభిషేకం
మెదక్ రూరల్: వర్షాలు సమృద్దిగా కురవాలని ఆకాంక్షిస్తు ప్రసిద్ద ముత్తాయికోట శ్రీ సిద్దేశ్వరాలయంలో ఈ నెల 19 ఉదయం 6 గంటల నుండి 20న ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు జలాభిషేకం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన పూజారి గోవింద్ మహారాజ్ తెలిపారు. లోకకళ్యాణార్దం జరిపే జలాభిషేకంలోభక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా రాత్రి అంతయు భజన కార్యక్రమాలుంటాయన్నారు. ఆదివారం రోజున మాసశివరాత్రిని పురస్కరించుకొని సాయంత్రం 7 గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించబడుతుందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. 21న శ్రావణమాసం చివరిరోజు, అమావాస్య సోమవారం కలిసి రావడంతో తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేక, అలంకార పూజలు, అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు.

కల్యాణలక్ష్మి కోసం ఒక్క రూపాయా లంచంగా ఇవ్వొద్దు
* మంత్రులు హరీష్‌రావు, లక్ష్మారెడ్డి
సిద్దిపేట : పేద యువతుల వివాహానికి తెలంగాణ సర్కార్ కల్యాణ లక్ష్మి పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు అన్నారు. శుక్రవారం కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం కింద 75,116 రూపాయలు పెళ్లి కూతురు తల్లిపేరిట అందచేస్తున్నట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం కోసం పేద ప్రజలు ఏవ్వరు ఒక్క రూపాయలు లంచంగా ఇవ్వద్దన్నారు. ప్రభుత్వమే అర్హులందరికి కల్యాణ లక్ష్మి చెక్కులను అందచేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, చైర్మన్ రాజనర్సు, జెసి పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
* నాటిన మొక్కలను సంరక్షించాలి
* ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
సంగారెడ్డి టౌన్: హరితహార కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విరివిరిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో సరిపోదని వాటిని సంరక్షించినప్పుడే కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి పట్టణం రాజంపేట పోలీస్ క్వాటర్స్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిధిగా హాజరై మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలోప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలన్నారు. పోలీస్ శాఖ తరపున ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 62,501 మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. వర్షాకాలం ముగిసే లోపు మరిన్ని మొక్కలు నాటేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతన్న, సంగారెడ్డి, కొండాపూర్ సిఐలు రామకృష్ణారెడ్డి, రఘు, ఆర్‌ఐ హరిలాల్, ఆర్‌ఎస్‌ఐ కృష్ణతో పాటు సిబ్బంది పాల్గొని సుమారు 500 మొక్కలను నాటారు.

సాగుభూమిని పూర్వ వైభవంలోకి తెచ్చాం
* మెదక్ జిల్లా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసయ్య
మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏకైక ఘణపురం ప్రాజెక్ట్ క్రింద సాగుభూమిని పూర్వ వైభవంలోకి తెస్తున్నట్లు జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసయ్య తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా నీరందని చివరి ఆయకట్టు భూములకు ఈ ఖరీప్ సీజన్‌లో అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో నక్కవాగు వరకే ఘణపురం ప్రాజెక్ట్ నీళ్లు అందేవన్నారు. ఇప్పుడు నాగిరెడ్డిపేట చివరి ఆయకట్టు భూములకు కూడా నీళ్లు అందిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి కృషి ఫలితంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నిధులు ఇవ్వడం వలన ఘణపురం ప్రాజెక్ట్ పురోగతి ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. ఎఫ్‌ఎన్ కెనాల్ క్రింద 31 ట్యాంక్‌లు ఉన్నట్లు ఆయన తెలిపారు. పాపన్నపేట మండలంలో కాలువ క్రింద 18 ట్యాంక్‌లు ఉండగా 13 ట్యాంక్‌లు నిండాయని తెలిపారు. మిగిలిన ట్యాంక్‌లలో 40 శాతం నీళ్లు ఉన్నాయన్నారు. ఎంఎన్ కెనాల్ క్రింద 13 ట్యాంక్‌లు ఉండగా అందులో 10 ట్యాంక్‌లు పూర్తిగా నిండాయని తెలిపారు. చివరి ట్యాంక్ జక్కన్నపేట చెరువు కూడా 65 శాతం నీళ్లు నిండాయని తెలిపారు. కుర్తివాడ ట్యాంక్ అలుగు పారుతుందన్నారు. కానీ రాయిన్‌పల్లి, కొంటూర్ చెరువుల్లో పూర్తిగా నీళ్లు రాలేదని, కేవలం 40 శాతం మాత్రమే నీళ్లు ఉన్నట్లు తెలిపారు.