మెదక్

రోగులకు తక్కువ ధరకే పోషకాలతో కూడిన ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు: ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం వచ్చే రోగులకు అతి తక్కువ ధరకే పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సూచించారు. వివిధ రోగాలతో తీవ్ర వ్యధను అనుభవిస్తున్న భాదితులతో పాటు వారి మంచిచెడులు చూడడానికి వారి వెన్నంటి ఉండే కుటంబ సభ్యులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని క్యాంటీన్ నిర్వాహకులకు తెలియచేసారు. పట్టణంలోని దివంగత ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య స్మారక వంద పడకల ఆసుపత్రిలో శుక్రవారం ఆయన క్యాంటీన్‌ను ప్రారంభించారు. క్యాంటీన్‌లోని ఆహారాన్ని రుచి చూసిన అనంతరము మాట్లాడుతూ మరింత రుచికరంగా వండడానికి ప్రయత్నించాలని కోరారు. ఇంతకాలం రోగులకు అందుబాటులో క్యాంటీన్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారన్నారు. వారి ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన క్యాంటీన్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. నిరుపేదల కళ్లల్లో వెలుగు నింపాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులలో ఖరీదైన వైద్యం చేయించుకోలేక పేదలు అకారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికే ప్రభుత్వం ఆసుపత్రులను ఆధునీకరించడానికి ప్రభుత్వం పూనుకుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పొగాకు భసవేశ్వర్, ఆసుపత్రి సూపరిండెంట్ వసుంధర దేవి, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బాయికాడి విజయ్‌కుమార్, వంద పడకల ఆసుపత్రి సలహా కమిటీ అధ్యక్షుడు కంకర శ్రీనివాస్, మైనారిటి నాయకులు షకీల్ తదితరులు పాల్గొన్నారు.