మెదక్

శాసనసభ్యుల సభ్యత్వ రద్దును పునరాలోచించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, మార్చి 15: శాసనసభలో జరిగిన సంఘటనలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయడంలో ముఖ్యమంత్రి పునరాలోచించాలని ప్రజా గాయకుడు గద్దర్ పేర్కొన్నారు. తూఫ్రాన్‌లో మిత్రుడు పసుల కిష్టయ్య సమాధిని సందర్శించిన అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రజాప్రతినిదులు ప్రజల సమస్యలను శాసనసభ సమావేశ మందిరంలో కూర్చొని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. మైకులు, కుర్చీలు, ఫర్నీచర్‌ను ద్వంసం చేయడం మంచి పద్దతి కాదని గద్దర్ పేర్కొన్నారు. పసుల కిష్టయ్య కృషి వల్లనే తూఫ్రాన్‌కు ఎత్తిపోతల పథకం తీసుకువచ్చారని, ఆయన చేసిన సేవలు మరువలేమన్నారు. అనంతరం కుటుంబసభ్యులను గద్దర్ పరామర్శించారు.

చిరుతపులిని పట్టుకొని
రక్షణ కల్పించాలని ధర్నా
రామాయంపేట, మార్చి 15: గత కొద్ది రోజులుగా చిరుతపులి దాడిలో మూగజీవాలు మృత్యువాత పడుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామస్థులు గురువారం రామాయంపేట-మెదక్ రహదారిపై రాస్తారోకో, ధర్నాకు దిగారు. అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరుతపులిని పట్టుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని వెంటనే చిరుతను పట్టుకొని సమీప గ్రామాల ప్రజలను రక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రామాయంపేట సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ మహేందర్‌లు సిబ్బందితో కలిసి సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులకు నచ్చజెప్పడంతో శాంతించారు. మెదక్ జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులతో మాట్లాడారు. తాము చిరుతను పట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కొద్ది రోజుల పాటు పశువులను కొట్టాల వద్ద కాకుండా ఇళ్ల వద్ద ఉంచుకోవాలన్నారు. సిబ్బంది కొరత వల్ల ఇతర రేంజర్ పరిధిలో గల సిబ్బందితో క్యాం పులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చిరుత దాడిలో నష్టపోయిన బాధి తులకు ప్రభుత్వం తరుఫున నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.
బాధితులకు చెక్కుల పంపిణీ
రామాయంపేట మండలంలోని తొనిగండ్ల గ్రామానికి చెందిన రైతుల పశువులను చిరుతపులి దాడిచేసి చంపివేసిన ఘటనలో గ్రామానికి చెందిన సిద్దయ్యకు 16వేలు, కుమ్మరి రాజయ్యకు 8వేల నష్టపరిహారం చెక్కులను అటవీశాఖ రేంజర్ అందజేశారు.