కర్నూల్

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 19:పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ సూచించారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తర్వాత తరాల వారికి కాలుష్య రహిత సమాజం అందించాలన్నారు. మానవాళి మనుగడకు దోహదపడే మొక్కలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నాటి వాటిని సంరక్షించాలన్నారు. జీవకోటికి ప్రాణవాయువునిచ్చే మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలీసు సిబ్బంది కూడా ఆయా పోలీస్‌స్టేషన్లలో విరివిగా మొక్కలు నాటాలన్నారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు
* ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్
గూడూరు, జూలై 19:రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని బూడిదపాడు గ్రామంలో గురువారం గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించగా కేఈతో పాటు ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తొలుత రూ. 21 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కేఈ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే సీఎం చంద్రబాబు ధ్యేయమన్నారు. సోమిశెట్టి మాట్లాడుతూ కుడా కింద ప్రతి గ్రామంలో ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మణిగాంధీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారన్నారు.