మెదక్

జగ్గారెడ్డికి బెయిల్‌తో కాంగ్రెస్ నేతల సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపూర్, సెప్టెంబర్ 24: మనుషుల అక్రమ రవాణా అభియోగంపై అరెస్టై జైల్లో ఉన్న సంగారెడ్డి మాజీ ఏమ్మెల్యే జగ్గారెడ్డికి సోమవారం సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరిసింది. పటన్‌చెరులో ఓ వేడుకలో ఉన్న జగ్గారెడ్డిని ఈ నెల 10వ తేదీన పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 14 రోజులు రిమాండ్‌లో ఉన్న జగ్గారెడ్డికి సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు నాగేష్ ముదిరాజ్, జిల్లా పార్టీ రైతు సంఘం అధ్యక్షులు రామక్రిష్ణారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ నాయకులను జైళ్లకు పంపి ఎన్నికలకు వెళ్లేందుకు పథకం ప్రకారం అరెస్టులు చేయిస్తుందని విమర్శించారు. ప్రజాదరణ గల నాయకుడు జగ్గారెడ్డిని అరెస్టు చేయడం వచ్చే ఎనికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నిదర్శనమేనని జోష్యం చేప్పారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి ఎమెల్యే జగ్గారెడ్డియేనని రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు వై.ప్రభు, రాజేంద్రప్రసాద్, ప్రభు, సునీల్, రత్నం, మల్లారెడ్డి, డేవిడ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

దేశానికే ఆదర్శం... తెలంగాణ అభివృద్ధి
* అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల కుట్ర
* మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 24: దేశంలో ఏక్కడా లేని పథకాలతో ముందుకు పోతున్న అభివృద్ధికి అడ్డుకట్ట వేసేందుకే ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని, ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకేనని మంత్రి హరీష్‌రావు అన్నారు. కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో సోమవారం నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గోని ప్రసంగించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు గెలువడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రం ఎక్కడ లేని విధంగా పథకాలను అమలు చేస్తు ముందుకు వెళ్లి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరునెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి మండలంలోని ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు తెచ్చి రైతన్నలను ఆశలను నెరవేర్చుతానని హామినిచ్చారు. 2009 నుండి 13వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేయలేని పనులను ఇప్పుడు ఏమి చేస్తుందని విమర్శించారు. కాంగ్రెసోళ్లకు ఓటు వేస్తే బోటు ఎక్కెదాకా ఓడమల్లన్నా, బోటు దిగాక బోడమల్లన్నా అన్న చందంగా కాంగ్రెస్ నాయకుల మాటలు తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సమావేశంలో ఎంపి ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్ ఇన్‌చార్జి, టూరిజం బోర్డు చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, రాష్ట్ర పుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర రైతుసమన్వయ సమితి కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్, రాగల దుర్గయ్య, ఎంపిపి రాధకిషన్‌రెడ్డి, జెడ్పిటిసి చిట్టి మాధురి, గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలే తెరాస అభ్యర్థిని గెలిపిస్తాయి
* జహీరాబాద్ ఎంపీ బీబీ.పాటిల్
అల్లాదుర్గం, సెప్టెంబర్ 24: కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అందోల్ తెరాస అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌ను గెలిపిస్తాయని జహీరాబాద్ ఎంపీ బీబీ.పాటిల్ అన్నారు. సోమవారం అల్లాదుర్గంలో నిర్వహించిన తెరాస బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదలను ఆదుకోడానికే కేసీఆర్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలో ముందుకు వెళ్తుందన్నారు. నిరుపేదల అభివృద్ధే ధ్యేయంగా కొరుకుంటూ వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అందోల్ నియోజకవర్గం నుండి స్థానికుడైన క్రాంతికిరణ్‌కు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం అందోల్ అభ్యర్థి క్రాంతికిరణ్ మాట్లాడుతూ తాను లోకల్ నినాదంతో వచ్చాడని, తాను స్థానికుడినని, ఇక్కడి ప్రజలతో సత్‌సంబంధాలు కలిగి ఉన్నానన్నారు. అందోల్ నియోజకవర్గం నుండి తనను ఆదరించి గెలిపించాలన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల ఉత్సహాలు చూస్తుంటే తనకు భారీ మెజార్టీ దక్కుతుందన్నారు. గత నాయకులు హైదరాబాద్‌కే పరిమితమై అభివృద్దిని విస్మరించారన్నారు. తనకు ఈ ఎన్నికల్లో అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే బాగ్యం దక్కుతుందున్నారు.