మెదక్

ముత్యం, రామలింగారెడ్డి కలయికతో దుబ్బాక అభివృద్ధి తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, నవంబర్ 18: దుబ్బాక నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో పయనింప చేసిన మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మాజీ మంత్రి చెరకు ముత్యంరెడ్డిల కలయికతో అభివృద్ధి తుపాన్ వస్తుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి నివాసంలో దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డితో కలిసి బేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ముత్యంరెడ్డిని టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించగా ఈ నెల 20న సీఎం కేసీఆర్ సమక్షంలోనే సభలో చేరుతానని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. రైతు హితునిగా ప్రజలతో మంచి సంబంధాలున్న ముత్యంరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి దుబ్బాక నియోజక వర్గాన్ని మరింత ముందుకు తీసుకవెళ్లేలా రామలింగారెడ్డితో కలిసి పనిచేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌లో ముత్యంరెడ్డికి సముచితమైన స్థానం కల్పిస్తామని, సీఎం కేసీఆర్‌కు ముత్యమన్న అంటే అభిమానం, గౌరవం అన్నారు. ముత్యంరెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఇతర జిల్లాల్లో సైతం అనుచరులున్నారని, ఆయనంటే అభిమానించేవారున్నారన్నారు. ముత్యంరెడ్డి చేరికతో టీఆర్‌ఎస్‌కు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు నచ్చి టీఆర్‌ఎస్‌లోకి వస్తానని ముత్యంరెడ్డి చెప్పారన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పోటిపడి పనిచేసే ముత్యంరెడ్డి, రామలింగారెడ్డి కలయికతో దుబ్బాక అభివృద్ది పథంలో దూసకపోతుందన్నారు. రైతు హితం కోసం టీఆర్‌ఎస్ సర్కార్ ఎన్నో పథకాలు అమలు చేసిందన్నారు. అందులో బాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీటిని అందించేందుకు చేస్తున్న కృషికి అందరు సహకరించాలన్నారు. పదవుల కోసం కాకుండా అభివృద్ది కోసం టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తానని ముత్యంరెడ్డి హామీనివ్వడం అభినందనీయమన్నారు. దుబ్బాక నియోజక వర్గ అభివృద్ది మాజీ మంత్రి చెరుకుముత్యంరెడ్డితో పాటు తన హయాంలోనే జరిగిందన్నారు. గతంలో పనిచేసిన వారు సరైన విధంగా పట్టించుకోలేదన్నారు. పెద్దన్నగా ఉన్న ముత్యంరెడ్డిని కలిసి పనిచేయాలని ఆహ్వానించగానే రావడానికి అంగీకరించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు మేమిద్దరం మాత్రమే ప్రజలకు ఏ కష్టమొచ్చిన అందుబాటులో వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. మేమంతా కలిసికట్టుగా ఉండి దుబ్బాకను అభివృద్ది చేసేందుకు కృషిచేస్తామన్నారు.
నమ్మిన కాంగ్రెస్ మోసగించింది
కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇస్తానని మోసం చేసిందని, దానికి ప్రతికారం కోసమే తాను టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ముత్యంరెడ్డి వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసానని, తనకు అవకాశం కల్పిస్తానని ఇచ్చిన హామీని విస్మరించి తనను ధగా చేసిందని విమర్శించారు. తనకు సరైన ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే బోరున విలపించారు. అక్కడే ఉన్న మంత్రి హరీష్‌రావు, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు ముత్యంరెడ్డిని ఓదార్చారు. ఈ నెల 20న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతానన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని అందరికి గతంలో మాదిరిగానే ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు రాజవౌళి పంతులు, చిలువేరు మల్లారెడ్డి, ఏల్పుల స్వామి, రాజాగౌడ్, స్వామి, జాకీర్, రమేశ్‌గౌడ్, బాకి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ ఇంటింటి ప్రచారం
సంగారెడ్డి టౌన్, నవంబర్ 18: సంగారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదివారం సంగారెడ్డిలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహరతులతో ఘన స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, నాయకులు ఆర్.వెంకటేశ్వర్లు, నర్సింలు, శ్రీహరి, రవి, ప్రభుగౌడ్, జలేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కే ఓట్లు వేయాలి
* నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి
శివ్వంపేట, నవంబర్ 18: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని డీసీసీ అధ్యక్షురాలు, నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం మండలంలోని చంది, నవాబ్‌పేట తండాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని ఆమె కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులే తనను గెలిపిస్తాయని ఆమె తెలిపారు. గ్రామాల్లో తెరాస పట్ల వ్యతిరేఖత ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని ఆమె తెలిపారు. ప్రజల మధ్య ఉంటూ సమస్యల సాధనకు కృషి చేస్తానని, చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాదాగౌడ్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, హరిశంకర్‌గౌడ్, సుదర్శన్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, నర్సింగరావు, నారాగౌడ్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.