కర్నూల్

ప్రభుత్వ పథకాలపై ప్రజలు వంద శాతం సంతృప్తి చెందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 17:జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలు వందశాతం సంతృప్తి చెందేలా జిల్లా ఉన్నతాధికారులు కృషి చేయాలని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టర్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల సంతృప్తి స్థాయిపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్‌కార్డులకు సంబంధించి ప్రతి నెల సరుకుల పంపిణీ విషయంలో సంతృప్తి శాతంలో రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లా 13వ స్థానంలో వుందన్నారు. పంచాయతీ రాజ్‌శాఖకు అప్పగించిన అంగన్‌వాడీ కేంద్రాల భవనాల్లో 432 మరుగుదొడ్లకు 68 పూర్తి చేశారని మిలిగినవి వివిధ దశల్లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మత్స్యశాఖ పరంగా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 8వ స్థానంలో వుందని, ఆ స్థానాన్ని అధిగమించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
కోసిగిలో వలస బాట
కోసిగి, జనవరి 17:ఉపాధి కోసం కోసిగి మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు గురువారం దాదాపుగా 200 కుటుంబాలకుపైగా కోసిగిలో రైల్వే స్టేషన్‌లో వలసబాట పట్టారు. గ్రామాల్లో ఉపాధి లేక గ్రామస్థులు గుంటూరు, బెంగుళూరు, విజయవాడ, తిరుపతి, తదితర పట్టణాల ప్రాంతాలకు వలసబాట పట్టారు. గ్రామాల్లో దేవర ఉత్సవాలు, సంక్రాంతి పండుగలు పూర్తి కావడంతోగ్రామాల్లోప్రజలు వలస బాటపట్టారు. ఆయాగ్రామాల నుంచి చిన్న పిల్లలు,తల్లిదండ్రులు కోసిగి రైల్వే స్టేషన్‌కు రావడంతో రైల్వే స్టేషన్ సందడిగా ఉంది.ఉపాధి కోసం వలస పోవడం జరిగిందని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో మిరప పంటలు ఎక్కువగా వేయడంతో అక్కడ ఉపాధి దొరుతుందని ప్రజలు తెలిపారు.ఉపాధి కోసం గ్రామాలు విడిచి పట్టణాలకు వెళ్ళడంతో ఆయా గ్రామాలు కళతప్పాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామాల్లో ఉపాధి కల్పిస్తే ఎక్కడికి వలస పోమని వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.