కర్నూల్

ప్రజాస్వామ్యానికి తూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, మే 24:టిడిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుందని ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల కంటే వార్డు సభ్యులుగా కూడా పనిచేయని వారిని ఇన్‌చార్జిలుగా నియమించి వారికి నిధులు మంజూరు చేయడం శోచనీయమని, ఇన్‌చార్జిలకు వున్న విలువ ఎమ్మెల్యేకు లేదా అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ఐజయ్య మంగళవారం తన ఇంటిలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను పక్కనబెట్టి ఇన్‌చార్జిల పేరుతో పాలన కొనసాగించడం దారుణమన్నారు. ఈ విషయాన్ని తాను అసెంబ్లీలో కూడా ప్రస్తావించానన్నారు. జన్మభూమి కమిటీల వల్ల పచ్చ చొక్కాల వారికే పథకాలు అమలు చేస్తున్నారన్నారు. టిడిపి ప్రభుత్వం రూ. 1600 కోట్ల వ్యయంతో చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టులో చుక్క నీరు లేకపోవడమేగాక దాని వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. దానికి బదులుగా రూ. 600 కోట్ల వ్యయంతో సిద్దేశ్వరం ఆనకట్టను పూర్తి చేసి వుంటే రాయలసీమకు 50 టిఎంసిల నీరు అందుబాటులో వుండేదన్నారు. సీమ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం సిద్దేశ్వరం ప్రాజెక్టును విస్మరిస్తుందని ఆరోపించారు. పార్టీలకతీతంగా సిద్దేశ్వరం ప్రాజెక్టును సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు నాటికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేయకపోతే ప్రాజెక్టు వద్ద నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. జగన్ జలదీక్షకు నందికొట్కూరు నియోజకవర్గం నుంచి భారీఎత్తున కార్యకర్తలు తరలివచ్చి జలదీక్షను విజయవంతం చేశారన్నారు. సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బిజెపి నాయకులు సిద్ధం కావడం అభినందనీయమని, సీమకు ప్రాజెక్టు ముఖ్యమని అది ఎవరు చేసినా మంచిదే అన్నారు. ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి, నాయకులు కోకిల రమణారెడ్డి, అబూబకర్, నూర్‌అహ్మద్ పాల్గొన్నారు.