కర్నూల్

పులికనుమ ప్రాజెక్టు కోసం పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్,అక్టోబర్ 17:గత 10 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న పులికనుమ ప్రాజెక్టును ఇప్పటికైనా పూర్తి చేయాలని ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికే తాము పాదయాత్ర చేస్తున్నామని ఇందులో ఎలాం టి రాజకీయం లేదని ప్రాజెక్టు సాధన సమితి నాయకులు ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, విరుపాక్షప్ప, రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎల్లెల్సీ ఇఇ కార్యాలయం వద్ద ఏర్పా టు చేసిన సమావేశంలోవారు మాట్లాడుతూ రూ.265 కోట్లుతో పులికనుమ ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయని అయితే కేవలం లక్షలతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించకపోవడంతో గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోసం కృష్ణాడెల్టా కోసం పట్టిసీమ ప్రాజెక్టును రూ.1600కోట్లతో పూర్తి చేసిందని అయితే రాయలసీమలోని ప్రాజెక్టు విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. గురురాఘవేంద్ర పథ కం కింద 7 ఎత్తిపోతల పథకాల ని ర్మాణం పూర్తి అయినా చిన్న చిన్న పనుల వల్ల ప్రాజెక్టు అమలుల్లోకి రాలేదన్నారు. ప్రస్థుతం తుంగభద్ర దిగువ కాలువ నుంచి రావాల్సిన నీటి వాటా రాని పరిస్థితి ఉందని గురురాఘవేంద్ర, పులికనుమ ప్రాజెక్టుల ని ర్మాణం పూర్తి అయి ఉంటే ప్రస్థుతం ఎల్లెల్సీలోని పంటలు ఎండిపోకుండా చివరి ఆయకట్టుకు సాగునీరు అందిం చే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. పులికనుమప్రాజెక్టు ద్వారా ఎల్లెల్సీకి 300క్యూసెక్కులు గురురాఘవేంద్ర ప్రాజెక్టు మరో 300 క్యూసెక్కులు అందుతాయని పేర్కొన్నారు. అలాగే వేదావతి నదిపై ఎత్తిపోతల పథకం రూ.100కోట్లతో నిర్మిస్తే అక్కడ కూడా మరో 300 క్యూసెక్కుల నీరు ఎల్లెల్సీకి వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. రాయలసీమలో సాగునీటి ప్రా జెక్టుల నిర్మాణం, రైతులకు న్యా యం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 19న జరిగే పాదయాత్రకు ఎల్లెల్సీ ఆయాకట్టుదారుల సంఘం రాయలసీమ సాధన సమితి, ఆఖిల భారత రైతు సంఘాల కూటమితోపాటు బిజెపి, వామ పక్ష పార్టీల రైతు సంఘాలు పాల్గొంటున్నాయని రైతులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

ఆటో బోల్తా.. ఒకరి మృతి
* మరొకరి పరిస్థితి విషమం
నందికొట్కూరు, అక్టోబర్ 17:పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఎదురుగా కర్నూలు-గుంటూరు రహదారిపై సోమవారం సాయంత్రం ఆటో బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా వుంది. ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపిన వివరాలు.. కర్నూలు నుంచి నందికొట్కూరుకు వస్తున్న అప్పీ ఆటోలో అల్లూరు గ్రామానికి చెందిన అనీల్‌గౌడ్(35), బేతంచెర్లకు చెందిన సాధిక్ ఎక్కారు. అయితే ఆటో వేగంగా వెళ్తూ మార్కెట్‌యార్డు ఎదుట అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో అనీల్‌గౌడ్ అక్కడికక్కడే మృతిచెందగా, సాధిక్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సాధిక్‌ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వడ్డెమాను గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా ఆటో నడిపాడని, సంఘటన అనంతరం అతడు పరారయ్యాడని ఎస్‌ఐ తెలిపారు. అనీల్‌గౌడ్ అల్లూరు గ్రామంలో వాటర్‌షెడ్ పథకంలో పని చేస్తున్నాడని, ఇతడికి భార్య, ఇద్దరు కుమారులు వున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐలు లక్ష్మినారాయణ, జాన్ తెలిపారు.