S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బండెనక..బండి కట్టి

కరీంనగర్, ఏప్రిల్ 27: సైకిల్ నుంచి బైక్ వరకు .. ఎడ్ల బండి నుంచి ఆటో వరకు.. టాటా ఎసి నుంచి కారు వరకు ..ట్రాక్టర్ నుంచి డిసిఎం వరకు..స్కూల్ బస్సుల నుంచి ఆర్టీసీ బస్సు వరకు ఇలా అన్ని రకాల వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఓరుగల్లు బాట పట్టాయి. టిఆర్‌ఎస్ 16వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లాలో నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ భారీ బహిరంగ సభకు గురువారం ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు ఉమ్మడి జిల్లా నుంచి 3లక్షల పైచిలుకు జనం వందలాది వాహనాల్లో వరంగల్‌కు తరలివెళ్లారు.

మోసం చేస్తున్న రైస్‌మిల్స్

మానకొండూర్, ఏప్రిల్ 27: రైతులు పండించిన వరి పంటను తాలు వడ్ల పేరుతో రైస్ మిల్స్ ఓనర్స్ మోసం చేస్తున్నారు అని గురువారం మండల పరిధిలోని వెల్ది గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం రైతులు ఆగ్రహానికి గురై ధాన్యం బస్తాలకు నిప్పుపేట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిజెపిదే హవా

సంగారెడ్డి, ఏప్రిల్ 27: వరస విజయ పరంపరలతో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ఒంటరి పోరాటం చేస్తూ, ఒంటరిగానే బలపడటానికి ప్రతి కార్యకర్త శాయశక్తుల కృషి చేయాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరుగుతున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో గురువారం లక్ష్మణ్ అధ్యక్ష ఉపన్యాసం చేసారు. 40 శాతం మైనార్టీలు ఉన్న అస్సాంలో ఓటర్లు బిజెపికి పట్టం కట్టారన్నారు.

కెసిఆర్ లక్ష ఉద్యోగాలిచ్చేదేంది..

సంగారెడ్డి, ఏప్రిల్ 27: క్రమ శిక్షణ, అంకిత భావంతో పని చేసే కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ బిజెపియేనని, 2019 ఎన్నికల్లో నిశ్చబ్ద విప్లవంతో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడతామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలోని ఓ పంక్షన్ హాలో రెండు రోజుల పాటు జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ముగింపు రోజు ఆయన పాల్గొన్నారు.

రెవెన్యూ సమస్యలకు ఇక చెల్లుచీటీ

పటన్‌చెరు, ఏప్రిల్ 27: గ్రామాలలో రెవెన్యూ సమస్యలకు ఇక స్థానం ఉండదని, సమగ్ర సర్వే పేరిట ఇంటింటికి తిరిగిన అధికారులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తారని జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్ అన్నారు. తమ తమ గ్రామాలలో నెలకొన్న భూ సమస్యల పరిష్కరించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అధికారుల కోసం ప్రజలు ఇక నుండి తిరగాల్సిన పని లేదన్నారు. గురువారం పటన్‌చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ ఎర్రర్ ఫ్రీ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

వివాహ చట్టం అన్నివర్గాలకు వర్తిస్తుంది

మెదక్, ఏప్రిల్ 27: సమాజంలో అన్ని కులాలు, మతాలు, వర్గాలలో వివాహ చట్టాన్ని ప్రజల్లో అవగాహణ కల్పించాలని జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో మహిళా శిశు వికలాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శులు, సబ్ రిజిస్టార్‌లకు నిర్వహించిన అవగాహణ సదస్సులో వివాహ నమోదు చట్టంపై కలెక్టర్ భారతి హొళ్లికేరి మాట్లాడారు. 2002లో రాష్ట్ర ప్రభుత్వం వివాహానికి చట్టబద్దత కల్పించడానికి ఒక ప్రత్యేక చట్టం తెచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ చట్టం ద్వారా బాల్య వివాహాలను అరికట్టవచ్చని, రెండవ వివాహం అడ్డుకోవచ్చని, రహస్య పెళ్లిలు వంటివి అరికట్టవచ్చని ఆమె తెలిపారు.

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

నర్సాపూర్,ఏప్రిల్ 27: మారుతున్న టెక్నాలజిని ఉపయోగించుకొంటూ ప్రజలకు జవాబిదారిగా వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబు విఆర్‌ఓలకు సూచించారు. గురువారంనాడు నర్సాపూర్‌లోని ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి విఆర్‌ఓల శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన ఆర్డీఓ వెంకటేశ్వర్లుతో కలిసి మాట్లాడుతూ రోజు రోజుకు మారుతున్న టెక్నాలజి ప్రకారం మనం మారాలని అన్నారు. విఆర్‌ఓలకు అందిస్తున్న ట్యాబ్‌ల వల్ల పనులు సులభతరం కానున్నాయని అన్నారు. 15రోజులలోగా గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం ట్యాబ్‌లలో నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు.

దారులన్నీ వరంగల్ వైపే

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26: టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభకు జిల్లా నుండి గులాబీ శ్రేణులు బయలుదేరడంతో రహదారులన్నీ వరంగల్ వైపు పయనిస్తున్నాయి. రోడ్లన్ని గులాబీమయంగా మారాయి. బుధవారం జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన గులాబీ శ్రేణుల ట్రాక్టర్లు సాయంత్రం షాద్‌నగర్ సమీపంలోని రింగ్‌రోడ్డుకు చేరుకున్నాయి. అంతకుముందు ఉదయం మహబూబ్‌నగర్‌లో వందలాది ట్రాక్టర్లతో భారీ ఊరేగింపు నిర్వహించారు. జడ్చర్లలో కూడా వందలాది ట్రాక్టర్లతో ఊరేగింపు నిర్వహించడంతో జడ్చర్ల పట్టణమంతా గులాబీమయంగా మారింది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆద్వర్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు.

రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా..

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26: రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా మహబూబ్‌నగర్‌ను తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్ వెల్లడించారు. బుధవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అధికారుల పనితీరు పట్ల కొందరు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు అధికారులు మరోసారి అలాంటి తప్పు జరగకుండా సరిచేసుకుంటామని హామీ ఇవ్వడంతో కౌన్సిలర్లు శాంతించారు. సమావేశంలో చైర్ పర్సన్ రాధ ఆమర్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణాభివృద్ధికి అడుగులు పడుతున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులతో పాటు ప్రజలు చెల్లించిన పనులతో కూడా పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు.

ఫాలమూరు ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలి

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26: జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ప్రధాన సమస్య అయిన భూసేకరణలో వచ్చే సమస్యలను అధిగమించి అనుకున్న సమయానికి భూసేకరణ పనులు పూర్తి చేయాలని జిల్లా ప్రజలకు తాగు,సాగునీరు సకాలంలో అందుతాయని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి, రైల్వే, ఫారెస్టు భూములలో ఉన్న సమస్యలను యుద్ధ ప్రతిపాదికన ప్రణాళికలు సిద్ధం చేసి అనుకున్న సమయానికి భూసేకరణ జరపాలని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల, కర్వెన, ఉదండాపూర్ ప్రాజెక్టులకు సంబందించిన భూసేకరణకు కావల్సిన భూములకు అవార్డు ఇవ్వాలని అన్నారు.

Pages