S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుదూరపు బాటసారి

అతని జేబులో ఒక్క రూపాయి లేదు. అయినా దేశాన్ని చుట్టిరావాలనే సంకల్పం గుండెనిండా ఉంది. ఉప్పొంగే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలనుకున్నాడు. సమాజంలో విభిన్న ప్రాంతాలను, సంస్కృతులను చూసి రావాలనుకున్నాడు. ఆ అనుభవాలతో జీవితాన్ని, నడత ఉత్తమంగా ఉండేలా నేర్చుకోవాలని బయలుదేరాడు. అతడే ఢిల్లీకి చెందిన రవీందర్ సింగ్. 29 ఏళ్ల ఈ లాయర్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఈ వయసులో కొందరికి షాపింగ్ చేయాలని, వ్యాయామం చేయాలని ముచ్చటపడతారు. కాని రవీందర్ సింగ్‌కి దేశంలోని ఇష్టమైన ప్రదేశాలను చుట్టి రావడం అంటే ఇష్టం. ఇందులో లభించే సంతోషం మరెందులోనూ దొరకదని అనుకున్నాడు. ఈ అభిలాష అతనికి చిన్నప్పటి నుంచి ఉండేది.

పనికొచ్చే చెత్త

ఐస్ బక్కెట్ సవాల్ పాతదై పోయింది. ఇపుడు సరికొత్త సవాల్ హైదరాబాద్ నగర వాసుల ముందుకు వచ్చింది. అదేమిటంటే ఇంట్లో పనికిరాని బక్కెట్ ఏర్పాటు చేసి అందులో పనికిరాని వ్యర్థాలను నిల్వచేసి కంపోస్ట్ ఎరువుగా తయారుచేయటం. ఇలా కంపోస్ట్ ఎరువును తయారు చేస్తానని ముందుకు వచ్చేవారికి వెన్నుతట్టి ప్రోత్సహించే సంస్థ కూడా ఉంది. అదే ‘స్వచ్ఛగృహ బృందం’. ఏడుగురు సభ్యులున్న ఈ స్వచ్ఛగృహ బృందం హైదరాబాద్ నగరంలో రోజుకు రోజుకు పేరకుపోతున్న చెత్త సేకరణకు సరికొత్త పరిష్కారాన్ని కనిపెట్టింది. ఇంట్లో అవసరం లేని వ్యర్థాలను ఏదో రకంగా వదిలించుకోవాలని చూస్తుంటాం.

వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

- ఉల్లిపాయ రసాన్ని ఒళ్ళంతా పట్టిస్తే వడదెబ్బ నివారణ అవుతుంది.
- ఎండలో నడవాల్సి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపీలోగాని, రుమాలులోగాని నడినెత్తిన ఉండేటట్లు కట్టి నడిస్తే వడదెబ్బ తగలదు. జేబులోనైనా ఉంచుకోవచ్చు.
- నీరుల్లిపాయ రసం రెండు కణతలకు, గుండెకు పూసినా వడదెబ్బ వల్ల కలిగే బాధకు ఉపశమనం.
- వడదెబ్బ తగిలిన ముఖంపైన, శరీరంపైన నీళ్లు చల్లుతూ, తలపైన మంచు ముక్కలను ఉంచి.. తాగేందుకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వాలి.
- కుమ్మున మామడికాయ ఉడికించి రసంలో ఉప్పు, జీలకర్ర కలిపి భోజనం నందు తాగితే వడదెబ్బ తగలదు.
- విశ్రాంతిగా పడుకోబెట్టి కాఫీ ఇచ్చినా వడదెబ్బనుండి తట్టుకోగలరు.

-కురువ శ్రీనివాసులు

భూమికకు రచనలు పంపాలనుకునే వారు

రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

mataata

బడబాగ్ని-40

మొదటినుంచీ జరుగుతున్న హత్యల పరంపర.. విధానం జాగ్రత్తగా పరిశీలిస్తున్న రాహుల్‌కి అన్వర్ మాటల వలన అర్థం అయిన విషయం.. ప్రణవ్ బిజినెస్ పనిమీద హైదరాబాద్ రావడం తెలుసుకుని అది అవకాశంగా తీసుకుని హతుని కారు పార్కింగ్‌లో వుండగా, డ్రైవర్ అన్వర్ ఏమరుపాటుగా ఉన్న అదను చూసుకుని.. దొంతనంగా ఆ కారులో పెట్రోల్ ఖాళీచేసి.. వాళ్ళు బయలుదేరే సమయంలో కారు డిక్కీలో చేరి.. పెట్రోల్ అయిపోయి... కారు అర్థరాత్రివేళ, నడిరోడ్డుమీద అర్థాంతరంగా ఆగిపోయి, డ్రైవర్ పెట్రోల్ కోసం వెళ్లిన సమయంలో హత్య చేసి.. ఆ శవాన్ని కారులో కూలేసి.. ఆ చీకటిరాత్రి.. ఆ హంతకుడు కూల్‌గా ఆ హైవే దిగి వెళ్లిపోయి ఉంటాడు..

- మీనాక్షి శ్రీనివాస్

నేర్చుకుందాం

హాలికునకున్ హలాగ్రమున నర్ధము చేకురు భంగి, దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జలమబ్బినట్లు, దు
ర్మలిన మనో వికారినగు మర్త్యుని నన్నొడ గూర్చి నీపయిన్
దలపు ఘటింప జేసితిని దాశరథీ కరుణాపయోనిధీ

భావం: ఓ దయాసముద్రుడవైన దశరథరామా! మడి దున్నుకొని జీవితము గడిపే కర్షకునికి, నాగలి కొర్రకు ధనరాశి తగిలి లభించిన విధంగాను, దాహంతో అలసట చెంది బాధలో ఉన్నవానికి గంగానదిలోని నీరు దొరికినట్లుగాను , మాలిన్యము కలిగి దోషభూయిష్టమైన మనస్సు కలిగిన మానవుడనైన నన్ను చక్కచేసి, నీపయి మనస్సు కలిగించి భక్తి కలిగించి ధన్యుని చేసితివి కదా.

దాశరథీ శతకములోని పద్యము

స్వామియే శరణం అయ్యప్పా -16

‘‘మహారాజా! మీరీ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారా అని ఎదురుచూస్తున్నాం అందరం! మణికంఠుని చల్లని పాలనలో సుఖశాంతులతో జీవించాలన్నదే అందరి ఆశయం’’ అంటూ సభలోని ప్రజాప్రతినిధులు కూడా చెప్పడంతో రాజు తృప్తిగా నిట్టూర్చాడు!
‘‘మణికంఠుని పట్ట్భాషేకం! హూ! ఎట్లా జరుగుతుందో అదీ చూస్తాను!’’ పళ్లు పటపటలాడిస్తూ లేచాడు మంత్రి వీరబాహు!మహారాజు ఇతరులతో చర్చలో వుండటం గమనించి ఎవరూ గమనించకుండా మెల్లగా లేచి బయటకు వచ్చి రాణీదేవి భవనంవైపు సాగిపోయేడు!
****

-డా. టి. కళ్యాణీ సచ్చిదానందం

పరశురామజయంతి

దశరథ రాముడు కల్యాణరాముడై సీతారామునిగా తన బంధు మిత్రసమేతంగా అయోధ్యకు తరలి వస్తుండగా భయోత్పాతం కలిగించేవిధంగా పరశురాముడు ప్రత్యక్షమవుతాడు. పరశురాముడిని చూచి దశరథుడు భయపడి ఆర్ఘ్యపాద్యాదులు సమర్పించి భక్తిని ప్రకటించాడు. ఇపుడు తన కుమారులకు వివాహం చేసుకొని కొత్త కోడళ్ళతో నగర ప్రవేశం చేస్తున్నామని తమను ఆశీర్వదించమని కోరుతాడు. అన్నీ విన్న పరశురాముడు శివుని విల్లు విరిచిన రాముడిని విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టవలసిందిగా కోరుతాడు.

చివుకుల రామమోహన్

Pages