S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరితహారం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26: జిల్లాలో గత సంవత్సరం హరితహారంలో నాటిన మొక్కలు వివిధ శాఖల వారిగా పూర్తి వివరాలతో పాటు బతికున్న మొక్కలను ఈ వేసివిలో నీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ఏ ప్రదేశాలలో ఎన్ని మొక్కలు నాటారో మొక్కల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు. వచ్చే జూన్,జూలై నాటికి హరితహారం యాక్షన్ ప్లాన్‌ను తయారుచేసుకోవాలని తెలిపారు.

వరంగల్ సభకు తరలిన ఎమ్మెల్యే చిట్టెం, నాయకులు

మక్తల్, ఏప్రిల్ 26: ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరుపతలపెట్టిన టిఆర్‌ఎస్ 16వ ఆవీర్భావ సభకు మంగళవారం రాత్రి మక్తల్ కేంద్రంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి సారథ్యంలో కార్యకర్తలు ట్రాక్టర్లపై బయలు దేరారు. ఈనేపథ్యంలో భాగంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి రైతుబిడ్డగా ట్రాక్టర్ నడుపుతుండగా, ఆయన సతీమణీ చిట్టెం సుచరిత టిఆర్‌ఎస్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు ఎమ్మెల్యే దంపతులిద్దరు స్థానిక శ్రీపడమటి ఆంజనేయస్వామి దేవాలయంతోపాటు శ్రీనల్లజానమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వరంగల్ ట్రాక్టర్ యాత్ర ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా విజయవంతంగా కొనసాగాలని వేడుకున్నారు.

రైతు సంక్షేమమే కెసిఆర్ ధ్యేయం

మందమర్రి, ఏప్రిల్ 27: రైతు సంక్షేమమే కెసిఆర్ ధ్యేయంగా పని చేస్తున్నాడని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు పేర్కొన్నారు. గురువారం తన ఇంటి వద్ద తెలంగాణ శ్రేణులు వరంగల్ బహిరంగ సభకు తరలివెళ్తున్న సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోని పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అని రైతుల సంక్షేమాన్ని విస్మరించడం జరిగిందని ఆయన తెలిపారు. వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో కెసిఆర్ రైతుల మరియు ప్రజలకు సంబంధించిన పలు సంక్షేమ పథకాలు పలు తీర్మాణాలు చేసే అవకాశం ఉందని వారు తెలిపారు.

ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు

మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 27: టిఆర్‌ఎస్ వరంగల్‌లో తలపెట్టిన 16వ వార్షికోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులులేక పోవడంతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులకు గురవతూ గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దూర ప్రాంతాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, బాసర, కరీంనగర్ ప్రయాణికులు ఉదయం నుంచి నానా ఇబ్బందులు ఇక్కట్లు పడుతూ బస్టాండ్‌లోనే బస్సుల కోసం పడిగాపులు కాస్తు ఓపిక నశించి వందల రూపాయలు ఖర్చు చేస్తు ప్రాణాలు గుపెట్లో పెట్టుకోని ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది.

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజాసమస్యల పరిష్కారం

ఆసిఫాబాద్, ఏప్రిల్ 27: ప్రజా సమస్యల పరిష్కారంకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కుమ్రంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ సూచించారు. గురువారం డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జిల్లాలోని విఆర్‌ఓలకు ట్యాబ్‌లను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ట్యాబ్‌లు ఎంతగానో ఉపయోగ పడతాయని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇంటర్నెట్ సహాయంతో ఉన్నతాధికారులకు క్షణాల్లో చేరవేసి పరిష్కారానికి కృషి చేయాలని విఆర్‌ఓలకు కలెక్టర్ చంపాలాల్ సూచించారు. ముఖ్యంగా రైతుల భూములు, పంటసాగు వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచ వచ్చన్నారు.

కదిలింది.. గులాబి దండు

ఆదిలాబాద్, ఏప్రిల్ 27: వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ఆవిర్భావ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుండి సుమారు 40వేల మంది గులాబి శ్రేణులు తరలివెళ్ళాయి. గురువారం ఉదయం నుండే పల్లెలు, పట్టణాల్లో కార్యకర్తల కొలాహలం, నేతల సందడి కనిపించింది. బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరావాలని పార్టీ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల నుండి వేలాది మంది పార్టీ శ్రేణులు గులాబి కండువాలు కప్పుకొని జై తెలంగాణ నినాదాలతో ర్యాలీగా బయల్దేరారు.

5 నుండి మన తెలంగాణ - మన వ్యవసాయ సదస్సులు

కామారెడ్డి, ఏప్రిల్ 27: వ్యవసాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు మే 5నుండి 16వ తేది వరకు మన తెలంగాణ - మన వ్యవసాయ సదస్సులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం జనహిత భవనంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ప్రగతి నివేదికలతో హాజరై అభివృద్ధి అంశాలపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి పర్చి రైతులకు అండగా నిలవడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దీంట్లో భాగంగానే మన వ్యవసాయం అనే అంశంపై అందరికి అవగాహన కోసం సదస్సులను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గంజాయి కింగ్‌పై ‘పిడి’కిలి బిగించేనా?

నిజామాబాద్, ఏప్రిల్ 27: మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో సుదీర్ఘ అనుభవం గడించి గంజాయి కింగ్‌గా పేరుగాంచిన మునావర్‌అలీపై పిడి యాక్టును ప్రయోగించే విషయంలో పోలీసు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు తెర వెనుకే ఉంటూ మునావర్‌అలీ తన దందాను సాఫీగా కొనసాగిస్తూ వచ్చాడు. అయితే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ప్రత్యేక చొరవతో మునావర్‌కు గంజాయి స్మగ్లింగ్‌తో ఉన్న సంబంధాల గుట్టు రట్టయ్యింది.

దారులన్నీ ‘ఓరుగల్లు’ వైపే

నిజామాబాద్, ఏప్రిల్ 27: అధిష్ఠానం ఇచ్చిన పిలుపును అందుకుని తెరాస శ్రేణులు పార్టీ ఆవిర్భావ సభకు భారీగా తరలివెళ్లారు. దారి పొడుగునా గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ వివిధ వాహనాల్లో బహిరంగ సభకు తరలివెళ్తున్న వారే కనిపించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి లక్ష మందికి పైగా సభకు బయలుదేరి వెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. సుమారు 300పైచిలుకు ఆర్టీసీ బస్సులతో పాటు వందలాది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, కార్లు, సుమోలు, ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన వాహనాల్లో తెరాస కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు బయలుదేరి వెళ్లారు.

నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు

డిచ్‌పల్లి, ఏప్రిల్ 27: దర్పల్లి మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో గడిచిన రెండు రోజుల నుండి ధాన్యం సేకరణను నిలిపివేశారు. ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి ఆకస్మికంగా ఈ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ పనితీరును తప్పుబడుతూ, సొసైటీ కార్యదర్శి దయానంద్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయించారు. ధాన్యం క్వింటాలుకు 2కిలోల చొప్పున తరుగుగా లెక్కిస్తుండడాన్ని చూసి జె.సి ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ పాలకవర్గం, అధికారులు మాత్రం ఈ చర్యను సమర్ధించుకుంటున్నారు.

Pages