S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితకాలం నిషేధించాలి!

ఇస్టాంబుల్: మాదక ద్రవ్యాలను ఉపయోగించి, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన షరపోవాను జీవితకాలం నిషేధించాలని కెనడా టెన్నిస్ స్టార్ యూగెనీ బుచార్డ్ డిమాండ్ చేసింది. మెల్డోనియం అనే నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని వాడినట్టు షరపోవా స్వయంగా అంగీకరించిన విషయాన్ని ఆమె గుర్తుచేస్తూ, ఇలాంటి చీటర్లకు మళ్లీ టెన్నిస్ ఆడే అవకాశం ఇవ్వకూడదని వ్యాఖ్యానించింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన షరపోవాను టెన్నిస్ నుంచి శాశ్వతంగా నిషేధించాలని, లేకపోతే, రాబోయే తరానికి తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరించింది.

క్వార్టర్స్‌కు సింధు

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 27: ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, తెలుగు తేజం పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. రెండో రౌండ్‌లో ఆమె జపాన్‌కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి అయా ఒహొరీని 21-14, 21-15 తేడాతో సులభంగా ఓడించి, టైటిల్ దిశగా ముందడుగు వేసింది. క్వార్టర్స్‌లో ఆమె చైనాకు చెందిన హి బింజియావోను ఢీ కొంటుంది. ఇలావుంటే, పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో చైనా ఐదో సీడ్ తియాన్ హౌవెయ్‌ని ఓడించి సంచలనం సృష్టించిన అజయ్ జయరామ్ రెండో రౌండ్‌లో సూ జెన్ హవో చేతిలో 19-21, 10-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.

మార్కెట్ల జోరుకు కళ్లెం

ముంబయి, ఏప్రిల్ 27: అంతార్జతీయ సానుకూల సంకేతాల కారణంగా గత మూడు రోజులుగా జోరు మీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం కళ్లెం పడింది. ఆసియా మార్కెట్లలో బలహీన ధోరణులు, అమెరికా పన్ను విధానాలపై డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనల ఫ్రానవంతో పాటుగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా గరిష్ఠస్థాయికి సూచీలు చేరుకున్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో రికార్డు స్థాయికి చేరిన బిఎస్‌ఇ సెనె్సక్స్ 104 పాయింట్లు కోల్పోయింది. నిన్నటి ముగింపుకన్నా పై స్థాయిలో మొదలై ఆ తర్వాత మరింత పుంజుకుని ఒక దశలో 30,184.22 పాయింట్లకు చేరిన సెనె్సక్స్ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో పడిపోవడం మొదలైంది.

కర్నూలు సిగలో కలికితురాయి

కర్నూలు, ఏప్రిల్ 27: ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్కు పనులు కర్నూలు జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు పనులు జరుగుతున్న తీరుపై రోజువారీ సమీక్ష నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లోని శకునాల, గని గ్రామాల పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్న సోలార్ పార్కు ప్రపంచంలోనే అతి పెద్దదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి పనులు ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడానికి అంగీకరించారని అధికారులు వెల్లడిస్తున్నారు.

విఫలమైతే జైలుకే

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: సహారా గ్రూపు సంస్థల అధినేత సుబ్రతా రాయ్ పెరోల్‌ను సుప్రీం కోర్టు జూన్ 19వ తేదీ వరకు పొడిగించింది. అయితే జూన్ 15వ తేదీలోగా డిపాజిటర్లకు 1,500 కోట్ల రూపాయలు చెల్లించకపోతే మరోసారి జైలుకు పంపుతామని సుప్రీం కోర్టు గురువారం హెచ్చరించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వు మేరకు సుబ్రతా రాయ్ గురువారం సుప్రీం కోర్టు ఎదుట హాజరయ్యారు. అయితే గతంలో తాము ఆమోదించిన రోడ్ మ్యాప్ (ప్రణాళిక) ప్రకారం డిపాజిటర్లకు తరచుగా చెల్లింపులు జరపాలని లేదంటే జైలు శిక్షను ఎదుర్కోవాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

తెలంగాణలో ఖాయిలా పడిన పరిశ్రమలకు శుభవార్త

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఖాయిలా పడిన పరిశ్రమలకు శుభవార్త. రాష్ట్రంలో అనేక కారణాల వల్ల ఖాయిలాపడిన పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామిక హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ జీవో 26ను జారీ చేసింది. ఈ క్లినిక్‌ను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్ధగా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్ధ ద్వారా హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి వంద కోట్ల నిధులను కేటాయించారు. రాష్ట్రంలో మూత పడిన చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమలకు ఆర్ధికంగా చేయూత ఇస్తారు.

యూనివర్సిటీల్లో అరకు కాఫీ

విశాఖపట్నం, ఏప్రిల్ 27: అరకు కాఫీ రుచులు విశ్వవిద్యాలయాల విద్యార్థులకూ అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జిసిసి బ్రాండ్‌తో కూడిన అరకు కాఫీ ప్రత్యేక స్టాళ్లను యూనివర్సిటీల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే గీతం యూనివర్సిటీ, మిలీనియం సాఫ్ట్‌వేర్ సంస్థ ద్వారా ఎయులోనూ, మరికొన్ని విద్యాసంస్థలకు అందుబాటులో ఉండేలా విశాఖ ఉషోదయ జంక్షన్ వద్ద అరకు కాఫీ ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటయ్యాయి. ఇదే తరహాలో ఎపి, తెలంగాణా రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో జిసిసి బ్రాండ్ అరకు కాఫీ ప్రత్యేక స్టాళ్ళను ఏర్పాటు చేయాలని గిరిజన సహకార సంస్థ (జిసిసి) నిర్ణయించింది.

మారుతి సుజుకి లాభాలు అదుర్స్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆటో దిగ్గజం మారుతి సుజుకి గత ఆర్థిక సంవత్సరం నికర లాభాలు ఏకంగా 36.6 శాతం పెరిగి రూ. 7,511 కోట్లకు చేరుకున్నాయి. కాగా, నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు 15.8 శాతం పెరిగాయి. మారుతి సుజుకి గురువారం తన చివరి త్రైమాసికం ఫలితాలతో పాటుగా వార్షిక ఫలితాలను ప్రకటించింది. 2015-16లో కంపెనీ నికర లాభం రూ.5,497.2 కోట్లుగా ఉంది. కాగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ అమ్మకాలు రూ. 66,909.4 కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 18.5 శాతం ఎక్కువ.

సెల్ఫ్ డిక్లరేషన్ చాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఉద్యోగ భవిష్య నిధి(ఇపిఎఫ్) నుంచి చందాదారులు మరింత సులభంగా సొమ్ములు విత్‌డ్రా చేసుకునేలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఆసుపత్రి బిల్లులు చెల్లింపు కోసం ఇపిఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకునే చందాదారులు సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. దాన్ని కార్యాలయంలో అందచేసి విత్‌డ్రా చేసుకోవచ్చని ఇపిఎఫ్‌ఓ వెల్లడించింది. దీనికి సంబంధించి ఈనెల 25న కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం.. ఇపిఎఫ్ చందాదారుడు పనిచేస్తున్న సంస్థ యజమాని సంతకం గానీ, డాక్టర్ సర్ట్ఫికెట్లు గానీ ఇవ్వనక్కర్లేదు.

రూపాయకే బంగారం!

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ పేటియం తమ ఖాతాదారుల కోసం ‘డిజిటల్ గోల్డ్’ పేరుతో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా బంగారం క్రయ విక్రయాలు జరిపేలా ఖాతాదారులకు వీలు కల్పించే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఎంఎంటిసి-పిఎఎంపితో పేటియం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ పథకం ద్వారా ఖాతాదారులు అతితక్కువగా కేవలం ఒక్క రూపాయితో కూడా 999.9 స్వచ్ఛతతో కూడిన 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు.

Pages