S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అథ్లెటిక్స్ పోటీలకు ఏర్పాట్లు

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 22: ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు కల్నల్ సికే నాయుడు స్టేడియంలో జరగనున్న జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ (నిడ్‌జామ్) ఏర్పాట్లను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ అధికారులతో మాట్లాడుతూ క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఇతర జిల్లాలకు తరలిపోతున్న చెరకు

చోడవరం, నవంబర్ 22: గోవాడ షుగర్స్ పరిధిలోని చెరకును లారీలపై ఇతర జిల్లాలకు తీసుకెళుతుండగా ఫ్యాక్టరీ సిబ్బంది ఆ లారీలను అడ్డుకున్న సంఘటన మంగళవారం స్థానిక గోవాడ షుగర్స్ కేన్‌యార్డు వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. గోవాడ సహకార చక్కెర కర్మాగారం పరిధిలోని చెరకు గత కొన్నిరోజులుగా శ్రీకాకుళం జిల్లా పాలకొండకు తరలిపోతున్న సంగతి తెలిసిందే. దీనిపై యాజమాన్య సిబ్బంది స్పందించి మంగళవారం లక్కవరం గ్రామం నుండి రెండు లారీలతో పాలకొండకు రవాణాచేస్తున్న చెరకు లారీలను అడ్డుకుని నిలుపుదల చేసారు.

‘పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి’

కొయ్యూరు,నవంబర్ 22: దశాబ్దాల కాలంగా సాగులో ఉన్న పోడు, బంజరు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని సి.పి. ఐ. జిల్లా కార్యదర్శి ఎ.జె.స్టాలిన్ డిమాండ్ చేసారు. మంగళవారం సి.పి. ఐ. ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ రాజేంద్రపాలెం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆక్కడ కొద్ది సేపు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి స్టాలిన్ మాట్లాడుతూ గిరిజనులు ఏళ్ళ తరబడి సాగు చేసుకుంటున్న కొండపోడు, బంజరు భూములకు నేటికీ పట్టాలివ్వకపోవడం అన్యాయమన్నారు. దీంతో వారికి ఆభూములపై హక్కు లేకుండా ఎటువంటి లబ్దిపొంద లేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

గ్రామాల్లో వౌలిక వసతుల మెరుగుకు పుష్కలంగా నిధులు

అనకాపల్లి, నవంబర్ 22: గ్రామాల్లో వౌలిక వసతుల మెరుగుకు పుష్కలంగా నిధులు సమకూర్చనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. జనచైతన్య యాత్రలో భాగంగా మండలంలోని సుందరయ్యపేట, వెంకుపాలెం, సీతానగరం, రొంగలివానిపాలెం, మొండిపాలెం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే మంగళవారం విస్తృతంగా పర్యటించి ఆయా ప్రాంతాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి తాగునీటిని సేవిస్తే కిడ్నీవ్యాధులు ప్రబలుతున్నాయని, తమను వేరే ప్రాంతానికి తరలించాలని మొండిపాలెం గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఏకరవుపెట్టారు. అచ్చియ్యపేట నుండి తాగునీటిని సరఫరా చేస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదన్నారు.

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

గూడెంకొత్తవీధి, నవంబర్ 22: విశాఖ మన్యంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడు రోజుల నుండి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. చలితో కూడిన గాలులు , పొగ మంచు దట్టంగా ఉండడంతో ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్ళేందుకు ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్ళేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే కాని పొగ మంచు వీడడం లేదు. పాఠశాలకు వెళ్ళే విద్యార్థులయితే సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు పట్టపగలు కూడా లైట్లు వేసుకుని ప్రయాణాలు చేస్తున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న కరెన్సీ కష్టాలు

అనకాపల్లి, నవంబర్ 22: పెద్దనోట్లు రద్దయి పక్షం రోజులు గడుస్తున్నా కరెన్సీ కష్టాలు తీరకపోగా నానాటికీ మరింత తీవ్రతరమవుతున్నాయి. అరకొరగా పట్టణంలోని పలు బ్యాంక్‌లకు కొత్త కరెన్సీ అందుతుండగా మరికొన్ని బ్యాంక్‌లు అసలు తమవద్ద కొత్త కరెన్సీ లేదని చేతులెత్తేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్ణణాల్లో సైతం పలు ఏటిఎంల్లో నగదు లేక అలంకార ప్రాయంగా మిగిలాయి. చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయా అని ఏటిఎంల వద్ద పగలనక రేయనక నిరీక్షించక తప్పని పరిస్థితి పేద , మధ్య తరగతి వర్గాల వారికి ఏర్పడింది.

పెద్దనోట్ల రద్దుపై సిపిఎం ఆందోళన

సబ్బవరం, నవంబర్ 22: పెద్దనోట్లతోనే నల్లధనం ఉంటే 2000 రూపాయల నోట్లను ఎందుకు అమలులోకి తెచ్చారంటూ సిపిఎం పార్టీ చోడవరం డివిజిన్ పరిధిలోని సబ్బవరం మండలంలోని అన్ని బ్యాంకుల వద్ద మంగళవారం పార్టీనేతలు ఆందోళన చేపట్టారు. అందులోభాగంగా స్థానిక వాణిజ్యబ్యాంకుల ముందుకు వెళ్ళి అక్కడ వినియోగదారులతో మాట్లాడారు. ఈసందర్భంగా చోడవరం డివిజిన్ కన్వీనర్ గండి నాయినిబాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఎల్లకాలం ప్రజలను మోసం చేయలేడన్నారు. గత ఎన్నికల ప్రచారంలో 90శాతం నల్లధనం విదేశాలకు తరలిపోయిందంటూ అధికారంలోకి వచ్చిన మోడీ అక్కడి నల్లధనం తెచ్చి కుటుంబానికి 15 లక్షలు పంపిణీ చేస్తానని ప్రకటించారని గుర్తుచేశారు.

కనకదుర్గాలయంలో అన్నమయ్య కీర్తనలు

అనకాపల్లి(నెహ్రూచౌక్), నవంబర్ 22: స్థానిక సత్యనారాయణపురం కళ్యాణగిరిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ ఆలయంలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే అన్నమయ్య కీర్తనలు, శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవం సమర సతా సేవా ఫౌండేషన్ మండల ధర్మప్రచారంలో భాగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోరుకొండ సాంబశివరావు, వ్యవస్థాపకులు బోయిన నాగేశ్వరరావు, కోశాధికారి రాయపురెడ్డి రామచంద్రరావు, అన్నదానం ట్రస్టు కన్వీనర్ లక్కరాజు అప్పారావు, మహిళా కమిటీ బోయిన విజయలక్ష్మి, రామలక్ష్మి, పడమటమ్మ, మహిళా బృందం, ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి ధర్మాచార్యులు పాల్గొన్నారు.

హిందూ మత ప్రచార పరిషత్‌ను పటిష్టం చేయాలి

మునగపాక, నవంబర్ 22: హిందూ మత ప్రచార పరిషత్‌ను పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని నాగులాపల్లి సర్పంచ్ యల్లపు వెంకట భాస్కరరావు అన్నారు. మండలంలో గల నాగులాపల్లిలో హిందూ పరిషత్ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ హిందుత్వాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, అలాగే గ్రామంలో విద్యార్ధులకు నగర సంకీర్తనలు, కోలాటలు నేర్పి పిల్లలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అవగాహన పెంపొందించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి నగర సంకీర్తనలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న విద్యార్ధులను సత్కరించారు.

మల్కాజిగిరి నీటి ప్రాజెక్ట్ పూర్తి

హైదరాబాద్, నవంబర్ 22: మల్కాజిగిరిలో తాగునీటి సరఫరా మెరుగుకోసం జలమండలి ఆధ్వర్యంలో రూ.330 కోట్లతో చేపడుతున్న తాగునీటి సరఫరా ప్రాచెక్టు పనుల్లో దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు నీటి పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. మల్కాజిగిరిలో నల్లా కొత్తగా ఏర్పాటు చేసిన నీటి కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు వెంటనే టెండర్లు పిలువాలని జలమండలి ఎండి ఎం.దానకిషోర్ అధికారులను అదేశించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం వివిధ విభాగాలకు చెందిన డైరెక్టర్లతో జరిగిన సమీక్షా సమావేశం జరిగింది.

Pages