S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటాడుతూనే ఉన్న కరెన్సీ కష్టాలు

నిజామాబాద్, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాలు ప్రజానీకాన్ని ఇంకనూ వెంటాడుతూనే ఉన్నాయి. పాత 500, 1000రూపాయల నోట్ల చెలామణిని రద్దుచేసి పక్షం రోజులు పూర్తయినప్పటికీ, పరిస్థితి కుదుటపడకపోవడంతో సామా న్య జనాలంతా బ్యాంకులు, ఎటిఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయితే మొదటివారం పదిరోజులతో పోలిస్తే ప్రస్తుతం బ్యాంకుల వద్ద కాస్తంతగా క్యూ లైన్లు తగ్గడం స్వల్ప ఊరటనిస్తున్నప్పటికీ, ఏదో ఒక రకంగా కరెన్సీ కష్టాలు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయని సగటు జీవులు వాపోతున్నారు. చివరకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రైతులనూ కుంగదీస్తోంది.

గడువులోగా మిషన్ భగీరథ పూర్తి కావాలి

నల్లగొండ, నవంబర్ 23: జిల్లాలో మిషన్ భగీరథ పథకం పనులు నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. బుధవారం ఆయన ఆలేరు ప్రాంతానికి మిషన్ భగీరథ పథకం కింద కృష్ణా మంచినీటిని అందించే పానగల్ ఉదయ సముద్రం చెరువులో నిర్మాణంలో ఉన్న పంపింగ్ స్టేషన్ పనులను పరిశీలించారు.

చిన్నారులకు మంచి భోజనం అందించండి

మెదక్, నవంబర్ 23: మెదక్ మిని ఎస్టీ బాలికల వసతి గృహంలోని వంట గదులను, ప్రహరీ గోడ నిర్మాణ ప్రాంతాలను తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్ బుధవారం పరిశీలించారు. సన్నబియ్యంతో వండిన భోజనాన్ని వారు పరిశీలించారు. వంకాయ కూర, ఇతర కూరలను తిని వారు రుచి చూశారు. వండిన కోడిగుడ్లను కూడా పరిశీలించారు. మిని గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు దేవునితో సమానం, ఇలాంటి పిల్లలకు పౌష్టికహారం అందజేస్తే మీకు భగవంతుడు దీవిస్తాడని దేవేందర్‌రెడ్డి ఉపాధ్యాయులు, హెచ్‌ఎం, వంట మనుషులను ఉద్దేశించి అన్నారు.

నేరాల అదుపుకు సిసి కెమెరాల ఏర్పాటు

జన్నారం, నవంబర్ 23: దొంగతనాలు, దోపిడిలను నియంత్రించడానికే సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని మంచిర్యాల డిసిపి జాన్‌వెస్లీ అన్నారు. బుదవారం మండల కేంద్రంలోని బస్టాండ్, కవ్వాల ఆటో పాయింట్, దర్మారం చౌరస్తా వద్ద సిసి కెమెరాలు ప్రారంభించిన అనంతరం పి ఆర్‌టియు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిపి మాట్లాడారు. ఇటీవల కాలంలో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వీటిని నియంత్రించడానికి సిసి కెమెరాలు దోహదపడుతాయని అన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులున్నా నిర్భయంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

24-11-2016

భక్తియోగం

కౌపీనం పెట్టుకుని లేదా కాషాయం కట్టుకుని కమండలం పట్టుకున్న ప్రతివాడు యోగి కాడు. పైగా సర్వసంగ పరిత్యాగి అసలే కాలేడు. సమస్త సుఖములు రాజభోగములు అందుబాటులో ఉన్నప్పటికి వాటిని త్యజించినవాడు విరాగి కాగలడు ఏమో కాని ఎప్పటికీ యోగి కాలేడు. యోగి తత్వం వంటబట్టించుకొనుట అనుకున్నంత సులభంగాదు. ఏది సత్యం ఏది మిధ్య, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అను విషయముల మధ్య అంతరం తెలుసుకొని వాటిపై అవగాసన కలిగినవాడే నిజమైన యోగి. శాంతముతో కూడిన చిత్తము, స్థితప్రజ్ఞతతో నిండిన మానసిక పరిపక్వత, నిశ్చిత అభిప్రాయములు అనేవి యోగికి పెట్టని ఆభరణములు.

- వేదగిరి రామకృష్ణ

కాశీఖండం 70

వారింపనలవికాని ఔదార్యంతో సర్వలోక హర్షకారకుడు, దాన గుణపరుడున్ను, పరాక్రమంతుడున్ను అయిన చుక్కలరేడు కాశీ మహానగరంలో అధ్వర సమాపన సమయంలో ఫాలాక్షుడి సమక్షంలో సదస్సులకి అలవోకగా ముల్లోకాలు దక్షిణగా ఒసగాడు.
తాను త్రవ్వించిన చంద్ర కుండం ప్రక్కనే తాను ప్రతిష్టచేసిన చంద్రేశ్వర లింగం దగ్గర కాశీ అంతర్భాగం అయిన అవిముక్త కంఠసీమలో చంద్రుడు రాజసూయాధ్వరం చేశాడు. ఈ క్రియ రాజసూయయాగం ఒనర్చిన అమృతకిరణుడు యజ్ఞదీక్షాంత సమయాన చేసిన స్నానం తర్వాత-

శ్రీపాద కృష్ణమూర్తి

కొత్త స్నేహితులు 24

ఆరోజు సాయంత్రం ఆఫీసు నుంచి బయటపడ్డాక ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం వేణుగోపాలస్వామి ఆలయం వద్ద కల్సుకున్నారు ఇద్దరూ.
ఆ ఆలయ ప్రాంగణం ఎంతో విశాలంగా, ప్రశాంతంగా, గుడిచుట్టూ దట్టమైన చెట్లతో, పచ్చని పచ్చికతో ఎంతో బావుంటుంది.
అందుకే ఆ రోజక్కడ కల్సుకోవాలని నిర్ణయించుకుని అనుకున్న ప్రకారమే అనుకున్న సమయానికి ఇద్దరూ అక్కడ కల్సుకుని భక్తులు తిరిగే చోటుకి కాస్త దూరంగా అనువుగా ఉన్న స్థలాన్ని ఎన్నుకుని దాదాపు రెండు గంటల సమయాన్ని రెండు క్షణాల్లా గడిపి ఎవరింటికి వారు బయల్దేరారు.

సీతాసత్య

నేర్చుకుందాం

శా ఱాలన్ ఱువ్వగ జేతులాడవు కుమారా రమ్ము రమ్మంచు నే
జలన్ జంపగ నేత్రముల్ దివియగ శక్తుండ నేగాను నా
శీలంబేయని చెప్పనున్నదిక నీ చిత్తంబు నా భాగ్యమో
శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రి యుగళా శ్రీకాళహస్తీశ్వరా!

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

Pages