S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరింటాకు

ప్రకృతి సహజమైన కండిషనర్‌గా గోరింటాకు పనిచేస్తుంది. వేడిని పోగొట్టి చర్మాన్ని చల్లబరిచే గుణం గోరింటాకులో ఉంది.

పుదీనా

పుదీనా ఆకుల వాసనతో మనసు అలసట తగ్గుతుంది. జిడ్డు చర్మానికి పుదీనా ఆకు మంచిది. పుదీనా ఆకులతో తయారుచేసే ప్యాక్ వల్ల ముఖంపైన వచ్చే మొటిమల మచ్చలు పోయి, ముఖం కాంతివంతం అవుతుంది.

తులసి

తులసి ఆకులను క్రమం తప్పకుండా తినటంవల్ల ముఖంపైన ఉండే మచ్చలు పోతాయి. తులసి ఆకులలో చర్మంలోని మృత కణాలను తొలగించి కోమలంగా చేసే గుణం ఉంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఏడు తులసి ఆకులు తినటం చాలా మంచిదని మన పెద్దలు చెబుతారు.

వేప

మొటిమలు, ఇంకా వాతావరణ కాలుష్యంవల్ల ఏర్పడే చర్మం సమస్యలకు వేపాకులు మంచి ఔషధం. నాలుగైదు వేపాకులను రుబ్బి, ముల్తానుబట్టితో వేసుకునే ప్యాక్‌లో కలుపుకుంటే చర్మం కోమలమవుతుంది. అంతేకాక వేపాకులు కురుల కుదుళ్ళకు, కురులకు మంచి మేలు చేస్తాయి.

కరివేపాకు

నల్లని, ఒతె్తైన, మెరిసిపోయే కురులకోసం కరివేపాకు హెయిర్ ప్యాక్ వేసుకుంటే మంచిది. ఈ ప్యాక్‌వల్ల కురుల కుదుళ్ళు గట్టిపడటమే కాక, నెరవకుండా నివారిస్తుంది.

మెంతి

మెంతికూరను రుబ్బి దానిని జుట్టుకు పట్టించుకుంటే చుండ్రు సమస్య నివారణమవుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

- మనస్విని

భవిష్య కాలం

జూపల్లి వెంకట్రావు, నర్సారావుపేట (గుంటూరు)
ప్ర:ఇంట్లోనుంచి వెళ్లిపోయిన కొడుకు-
సమా:ఒక వివాదం కారణంగా కాని, సినిమా వ్యామోహం కారణంగా కాని వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. ఆగ్నేయ దిశగా మరొకరితో కలిసి వెళ్లినాడు. చెన్నై వైపు ప్రయత్నించండి.
ఎన్.శివరామయ్య, నంద్యాల (ఆం.ప్ర.)
ప్ర:కూతురు విద్యా విఘ్నములకు తాముగా చేయవలసిన దైవకార్యాలు
సమా:ఆదిలాబాద్ (తెలంగాణ) జిల్లాలోగల బాసర సరస్వతీ క్షేత్రాన్ని దర్శించి ముడుపు కట్టండి. విశేష క్రియలకు వ్యక్తిగతంగా వీలయితే సంప్రదించండి.
వై.నాగేంద్రబాబు, ద్రవిడియన్ యూనివర్సిటీ (కుప్పం)
ప్ర:వివాహాలస్యానికి కారణం?

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ

వీరి అడుగులు ఎటువైపు?

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అడుగులు విచిత్రంగా, విభిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ సిఎం కెసిఆర్, ఎపి సిఎం చంద్రబాబు వ్యవహారశైలిని పరిశీలించిన వారెవరికైనా ఇలాంటి అనుమానమే ఏర్పడుతుంది. ఈ ఇద్దరిలోనూ ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తోంది. కెసిఆర్ విషయంలో అయితే అది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఆయన సచివాలయానికి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమైతే , బాబు పాత అలవాటు ప్రకారం తాను నిద్రపోకుండా, మరొకరిని నిద్రపోనీయకుండా కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ తిరుగుతున్నారు.

మార్తి సుబ్రహ్మణ్యం, సెల్: 9705311144

తాతను మించిన మనవడు!

చంద్రబాబు కుమారుడు లోకేశ్‌బాబు తమ కుటుంబ సభ్యుల ఆస్తులను వెల్లడించారు. తాత చంద్రబాబు కన్నా మనవడు దేవాన్‌ష ఆస్తి ఎక్కువ ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. గతంలో తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, రెండున్నర ఏళ్ల నుంచి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆస్తి అప్పుల మధ్య సమతూకం కనిపించగా, మాటలు ఇంకా రాని మనవడికి అప్పుడే కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఏదో పాలు, కూరగాయలు అమ్మి ఆస్తులు సంపాదించామని లోకేశ్ చెప్పుకొచ్చారు. మార్కెట్‌లో ధర బాగుంటే బెంగళూరు మిర్చి సాగుచేస్తే ఎకరానికి కోటి రూపాయల ఆదాయం వసుందని కెసిఆర్ చెబితే తీవ్రంగా విమర్శించిన వారు పాలు, కూరగాయల్లో కోట్లు ఎలా సంపాదించారబ్బా..!

చక్రబంధంలో పాక్

పాకిస్తాన్ ఉగ్రవాద మూకలపై మెరుపుదాడులు జరిగిన రోజు జాతి జనులు దేశ రాజకీయ నాయకత్వ దృఢచిత్తం చూసి అభినందించారు. అన్ని రాజకీయ పార్టీల వారూ మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. కానీ, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ప్రతిదీ రాజకీయ యాగీ చేసే మతి తప్పిన కొందరు నాయకులకు అదే కంటగింపైంది. 1971లో అప్పటి ప్రధాని ఇందిరను ‘దుర్గ’తో పోల్చిన వాజపేయికి ఉన్న రాజనీతిజ్ఞత నేటి ప్రతిపక్షంలో కానరావట్లేదు. రాహుల్ గాంధీ వంటివారు ‘దలాల్’ వంటి పదాలను వాడి సెల్ఫ్‌గోల్ (స్వీయ ఓటమి) చేసుకున్నారన్నది మీడియాలో మాట. కొందరు విపక్ష నేతలు యుద్ధం చేయాలని, ఇంకొందరు దౌత్యయుద్ధం మాత్రమే చేయాలన్నారు.

- తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 96761 90888

Pages