S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత సైన్యానికి స్వర్ణ పతకం

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరులోనే కాదు, అంతర్జాతీయ పోటీల్లోను తమకు తామే సాటి అని భారత సైన్యం నిరూపించుకుంది. సైన్యంలోని గూర్ఖా రైఫిల్స్ దళం అత్యంత కఠినమైన కాంబ్రియన్ పెట్రోలింగ్ ఎక్సర్‌సైజెస్‌లో స్వర్ణ పతకం సాధించింది. వేల్స్‌లోని బ్రిటిష్ సైన్యం ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తుంది. 8వ గూర్ఖా రైఫిల్స్ రెండో బెటాలియన్‌కు చెందిన 8 మంది సభ్యుల బృందానికి పతకాలను ప్రదానం చేస్తున్న చిత్రాలను బ్రిటిష్ ఆర్మీ ట్వీట్ చేసింది. ‘కాంబ్రియన్ పెట్రోల్‌లో స్వర్ణ పతకం గెల్చుకున్న గూర్ఖా రైఫిల్స్ బృందానికి అభినందనలు..

కాశ్మీర్‌లో రైతుల ‘మూగ’ వేదన

ఆర్‌ఎస్ పుర, అక్టోబర్ 22: జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ముష్కరుల దాడులు రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫిరంగులు, తుపాకీ బుల్లెట్లకు పశు సంపదనను కోల్పోతున్నారు. పశుపోషణే జీవనాధారంగా బతుకున్న రైతులు ‘మూగ’ రోదనను వినిపించుకునేవారై కరవైపోయారు. ఆర్‌ఎస్ పుర సెక్టార్‌లో గత రాత్రి పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పులకు అభంశుభం ఎరుగని మూగజీవాలు బలైపోయాయి. ‘అందరి దృష్టిలో అవి పశువులే. మాకుమాత్రం అవి సంపాదించే కొడుకులతో సమానం. వాటి పాలు అమ్ముకుని బతుకున్న మాకు ఈ సంఘటన తీరని వ్యధే. ఉన్న ఒక్క జీవనాధారాన్ని కోల్పోయాం’ అని అరవై ఏళ్ల కిషన్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

చొరబాట్ల గుట్టు రట్టు

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: జమ్మూ, కాశ్మీర్‌లోని హీరానగర్ సెక్టార్‌లో పాకిస్తానీ ఉగ్రవాదులు పెద్దఎత్తున చొరబాటుకు విఫలయత్నం చేసిన ఫోటోలను బిఎస్‌ఎఫ్ శనివారం విడుదల చేసింది. రాత్రిపూట ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తీసిన ఈ థర్మల్ ఇమేజెస్‌లో పాక్ రేంజర్ల తోడ్పాటుతో ఉగ్రవాదులు మన భూభాగంలోకి చొరబడడానికి పెద్దఎత్తున కాల్పులు, బాంబుదాడులకు తెగబడ్డం, బిఎస్‌ఎఫ్ దళాలు ఆ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టిన దృశ్యాలున్నాయి. బిఎస్‌ఎఫ్ స్థావరంపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ, బాంబులు విసురుతున్న దృశ్యాలు ఈ ఫుటేజిలో ఉన్నాయి.

యుపి సిఎం అఖిలేష్ సన్నిహితుడిపై వేటు

లక్నో, అక్టోబర్ 22: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చెలరేగిన కలహాలు ఆ పార్టీ పాలిట ముసలంగా మారుతున్నాయి. పార్టీ చీఫ్ ములాయం సోదరుడు శివపాయాదవ్, కుమారుడు అఖిలేష్‌ల మధ్య పెరుగుతున్న అంతరం ముదిరి పాకాన పడింది. అఖిలేష్‌ను సిఎం పదవి నుంచి తప్పుకోవాలని తండ్రి, పార్టీ అధ్యక్షపదవి నుంచి తప్పుకోవాలని తండ్రిని కొడుకు డిమాండ్ చేస్తున్నారు. ఈ గొడవల్లో భాగంగానే శివపాల్‌ను యుపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమిస్తే, శివపాల్ నుంచి ముఖ్యమైన శాఖలన్నింటినీ అఖిలేష్ తొలగించారు. ఇప్పుడు అఖిలేష్ సన్నిహిత ఎమ్మెల్సీపై ములాయం వేటు వేశారు.

వెబ్‌సైట్‌లో ఆలయాల ఆస్తులు

విశాఖపట్నం, అక్టోబర్ 22: తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్‌కు చెందినదేనని, దీనిపై ఇతర రాష్ట్రాలకు ఎటువంటి హక్కులు సంక్రమించవని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు స్పష్టం చేశారు. విశాఖలో దేవాదాయ శాఖ అధికారుతో శనివారం సమీక్షించిన ఆయన తనను కలిసి విలేఖరులతో మాట్లాడుతూ టిటిడి ఆదాయంలో తెలంగాణ వాటా కోరడాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా, ఇది అసంబద్దమని పేర్కొన్నారు. ఈ అంశంపై టిటిడి న్యాయస్థానాన్న ఆశ్రయిస్తే, ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల వివరాలు, ఆస్తులు, ఇతర అంశాలు సహా న్యాయస్థానం వాజ్యాల్లో ఉన్న ఆస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు.

పర్సెంటేజీల కోసమే పట్టిసీమ

శ్రీకాకుళం, అక్టోబర్ 22: రాయలసీమకు సాగునీరు అందిస్తామంటూ చేపట్టిన పట్టిసీమ నిర్మాణం కేవలం చంద్రబాబు ప్రభుత్వం పర్సంటేజీల కోసమేనని ఎపి పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 13 జిల్లాలు సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా రూపొందించాలని కాంగ్రెస్ ప్రజల తరపున పోరాటం చేస్తుంటే టిడిపి నేతలు అవినీతికి పాల్పడి సొమ్ములు గుంజడానికి పట్టిసీమను తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు.

220 తాబేళ్ల స్వాధీనం

గూడెంకొత్తవీధి, అక్టోబర్ 22: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలం మొల్లిమెట్ట, దుచ్చరిపాలెం గ్రామాల సమీపంలో శనివారం అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 220 తాబేళ్ళను ఫారెస్ట్ టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. టేకు తోటలు, ఇతర కాఫీ ప్లాంటేషన్ల రక్షణలో భాగంగా శుక్రవారం సాయంత్రం టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుండగా కనిపించిన మూటలు అనుమానంగా ఉండడంతో వాటిని పరిశీలించారు. మొదట గంజాయి అనుకున్నప్పటికీ అవి విప్పి చూడడంతో తాబేళ్ళుగా గుర్తించారు. వీటిని చింతపల్లి ఫారెస్ట్ కార్యాలయానికి తరలించి పరీక్షించడంతో 220 తాబేళ్ళలో 16 మరణించినట్లు సిబ్బంది గుర్తించారు.

హిల్లరీ గెలిస్తే.. ఐఎస్‌కు ఊతం

వాషింగ్టన్, అక్టోబర్ 22: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే మరో నాలుగేళ్ల పాటు బరాక్ ఒబామా పాలన కొనసాగినట్టేనని, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ విస్తరిస్తుందని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉత్తర కరోలినాలో శుక్రవారం ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఒబామాకేర్ (అధ్యక్షుడు ఒబామా ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకం)పై పెట్టుబడులను రెండింతలు, మూడింతలు పెంచాలనుకుంటున్నారని, ఫలితంగా మీరు చెల్లిస్తున్న పన్నులు పెరుగుతాయని ఆయన అమెరికా ప్రజలను హెచ్చరించారు.

ఓవైపు ఆనందం.. మరోవైపు బాధ

వాషింగ్టన్, అక్టోబర్ 22: అమెరికా అధ్యక్షుడి హోదాలో అధ్యక్ష భవనం శే్వతసౌధంలో ఏటా నిర్వహించే సంగీతోత్సవానికి (మ్యూజికల్ ఈవెంట్) బరాక్ ఒబామా చివరిసారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తనకు, తన భార్య మిషెల్లీ ఒబామాకు ఎంతో ఇష్టమైన సంప్రదాయ సంగీతోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం పట్ల తనకు ఒకవైపు ఆనందంగానూ, మరోవైపు బాధగానూ ఉందని బరాక్ ఒబామా అన్నారు. ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత ఎనిమిదేళ్ల క్రితం వైట్‌హౌస్‌లో ప్రతి సంవత్సరం ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించడం ప్రారంభించారు. త్వరలో ఒబామా పదవీకాలం ముగియనున్నందున ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా పాల్గొనడం ఆయనకు ఇదే చివరిసారి.

సన్నకారు రైతులకు పెద్దపీట

విజయవాడ, అక్టోబర్ 22: సాగు పద్ధతుల్లో మెరుగైన విధానాలను అమలుపరచడం ద్వారా సన్న, చిన్నకారు రైతుల జీవన ప్రమాణాలను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై అడుగులు వేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇందుకోసం చర్యల్లో భాగంగా నవంబర్ నెల చివరి వారంలో అజీమ్ ప్రేమ్‌జీ సంస్థతో అజీమ్ ప్రేమ్‌జీ-ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం జరుగుతుందని ఆయన తెలిపారు.

Pages