S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వాంటం మెకానిక్స్

పరమాణువు, పరమాణు అంతర్భాగాల స్థాయిలో పదార్థం ప్రవర్తించే తీరును అధ్యయనం చేసే శాస్త్ర విభాగమే ‘క్వాంటమ్ మెకానిక్స్’. సంప్రదాయ భౌతిక శాస్త్రం కొన్ని దృగ్గోచర విషయాలను వివరించటంలో విఫలమైన పరిస్థితిలో 1920ల్లో ఈ శాస్త్రం వచ్చింది. సుప్రసిద్ధ భౌతిక శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన సాధారణ సాపేక్ష సిద్ధాంతంలో భాగంగా ‘్ఫటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్’కు ఇచ్చిన వివరణలో మొదట ఈ శాస్త్రానికి నాంది జరిగింది. సంప్రదాయ భౌతిక శాస్త్ర దృష్టితో ప్రపంచాన్ని పరిశీలిస్తున్న శాస్తవ్రేత్తలకు ‘క్వాంటం మెకానిక్స్’ను అర్థం చేసుకోవటం కష్టంగా అనిపించింది.

-బి.మాన్‌సింగ్ నాయక్

‘స్కూల్’ అంటే తెలుసా?

ఇంగ్లీషు భాషలో స్కూల్ అంటే పాఠశాల అని అర్థం కదా!. అది నిజమే. కానీ ‘స్కూల్’ అన్న పదానికి మరో అర్థం కూడా ఉంది. చేపపిల్లల సమూహాన్ని ‘స్కూల్’ అని పిలుస్తారు. శత్రువునుంచి రక్షణకు వేలాది చేపలు ఒకేచోట గుంపుగా తిరుగుతూంటాయికదా! ఆ గుంపును ఇంగ్లీషులో ‘స్కూల్’ అని పిలుస్తారు. ఒకరకంగా ఇది నామవాచకం. ఇది సాధారణంగా చేపలజాతిని ఉద్దేశించిన పదం. విడివిడిగా ఒక్కోజాతి చేపల సమూహాన్ని బట్టి ఈ నామవాచకం మారుతూంటుంది. ఉదాహరణకు ఈల్ చేపల సమూహాన్ని ‘స్వార్మ్ ఆఫ్ ఈల్’ అని అంటారు. ఎగిరేచేపల సమూహాన్ని ‘గ్లైడ్ ఆఫ్ ఫ్లయింగ్‌ఫిష్’ అని, డాగ్ ఫిష్‌ల గుంపును ‘ట్రూప్ ఆఫ్ డాగ్‌ఫిష్’ అని పిలుస్తారు.

తగిన శాస్తి (కథ)

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పక్కనే ఒక ఏరు. ఆ ఏటిలో ఎప్పుడూ నీరు సమృద్ధిగా ఉండేది. ఆ ఊరి వారందరికీ అదే ప్రాణాధారం.
ఆ ఊరిలో సమ్మయ్య, సారయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు చిన్ననాటి నుంచీ ప్రాణ స్నేహితులు. ఆ ఊళ్లోనే చదువుకొని అక్కడే ఉద్యోగాలు సంపాదించుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
సమ్మయ్య, సారయ్య ఇళ్లు పక్కపక్కనే ఉండేవి.
ఇలా ఉండగా ఒకసారి సమ్మయ్య అత్తగారింటికి వెళ్లొచ్చాడు. వచ్చిన రోజే తన వేలికున్న కొత్త ఉంగరాన్ని సారయ్యకు చూపిస్తూ ‘ఇదిగోరా! మా అత్తగారు గృహప్రవేశానికి ఈ ఉంగరం బహూకరించారు. ఎలా ఉంది?’ అంటూ మురిసిపోయాడు.

-వాసాల నరసయ్య

ఈ పూలు అక్కడే పూస్తాయి

గులాబీవర్ణంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ పూలు ఓ పొద జాతికి చెందినవి. మాల్టా దేశంలోని ఒకటీఅరా దీవుల్లోని లైమ్‌స్టోన్ శిఖరాలపై మాత్రమే ఇవి కన్పిస్తాయి. మాల్టీస్ రాక్ ఫ్లవర్‌గా వీటిని పిలుస్తారు. 1973 నుంచి ఇది మాల్టా జాతీయ పుష్పంగా ఎంపికయ్యాయి. అయితే గుర్తు తెలియని ఓ చిమ్మెట లార్వా వీటి పండ్లపై దాడి చేస్తూండటంతో ఈ పొదలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈ పూలమొక్కల సంరక్షణకు మాల్టా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తోంది.

ఎస్.కె.కె.రవళి

అతి ఎతె్తైన చెట్లు

ప్రపంచంలో అత్యధిక కాలం జీవించి, ఎత్తు పెరిగే చెట్లు ఇవి. కాలిఫోర్నియాలోని సియర్రా నవడ పర్వతప్రాంతంలో మాత్రమే ఇవి కన్పిస్తాయి. వీటిని జెయింట్ సెక్వోయి, జనరల్ షెర్మన్, రెడ్‌వుడ్, హైపెరియాన్‌లని పిలుస్తారు. 3500 సంవత్సరాల జీవితకాలం ఉండే ఈ చెట్లు కనీసం 250 అడుగుల మేర ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్లకు సగభాగం పైన మాత్రమే ఆకులు విస్తరిస్తాయి. వీటి కాండం చుట్టుకొలత (వ్యాసార్థం) కనీసం 26 అడుగులు ఉంటుంది. లోపలిభాగం డొల్లగా ఉంటుంది. ఈ చెట్ల బెరడు మందం మూడు అడుగులు. వీటి కాండం తొలచి టనె్నల్ మాదిరిగా చేసి పర్యాటకులను ఆకర్షించడం అక్కడ అలవాటు.

ఎస్.కె.కె.రవళి

ఈ తేళ్లు అతిపెద్దవి!

నల్లగా ఉండే పెద్దతేళ్లను మనం బండ్రగప్పలని పిలుస్తాంకదా. మహా అయిదే రెండుమూడు అంగుళాలుంటాయి అవి. కానీ ఆఫ్రికాలోని అడవుల్లో కన్పించే 3ఎంపరర్ స్కార్పియన్స్2 ప్రపంచంలోనే అతిపెద్ద తేళ్లుగా చెబుతారు. అవి కనీసం 8 అంగుళాల వరకు పెరుగుతాయి. వీటి కొండెలు అతిపెద్దవి, భయంకరంగా ఉంటాయి. మెరిసిపోయే నలుపు, ముదురు నీలం లేదా అకుపచ్చ రంగులోనూ కన్పిస్తాయి. ఆల్ట్రావయలెట్ రేస్ ప్రసారం చేసినప్పుడు ముదురు ఆకుపచ్చగా లేదా నీలిరంగులో కన్పిస్తాయి. వీటి పిల్లలు పుట్టినపుడు తెల్లగా ఉండి తల్లి వీపుపైనే ఉంటాయి. అవి ఎదిగిన తరువాత తల్లి వాటిని వీపునుంచి దొర్లించి తరిమేస్తుంది.

ఎస్.కె.కె.రవళి

పేగుబంధం

కథలపోటీలో
ఎంపికైన రచన
***

విశ్వనాథ రమ

బ్లాక్‌మెయిల్

ఆగస్ట్ నెల.
గురువారం.
రాత్రి 10.25. టేక్సీ డ్రైవర్ హాగ్‌లేండ్ బెవర్లీ హిల్స్‌లోని ఓ ఖరీదైన హోటల్ ముందు తన టేక్సీని ఆపి అప్పటికే పావుగంట అయింది. ఈసారి అతని వంతు వచ్చింది. సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు, ఫైనాన్షియర్లు తరచు వచ్చే హోటల్ అది.
డోర్ మేన్ ఈల విని వెళ్లి పోర్టికోలో టేక్సీని ఆపాడు. అతను తలుపు తెరవగానే ఓ నలభై ఏళ్లతను వెనక సీట్లో ఎక్కాడు. వెంటనే టేక్సీ అంతా ఆల్కహాల్ వాసన. డోర్ మేన్ అతను ఇచ్చిన కరెన్సీ నోట్‌ని అందుకుని తలుపు మూశాడు.
‘నైన్ ఎయిట్ త్రీ త్రీ. స్టోన్ వేలీ రోడ్’
హాగ్‌లేండ్ టేక్సీని ముందుకి పోనించాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఎలా వుందీ వారం? (అక్టోబర్ 23 నుండి 29 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక వ్యవహారాలు మెరుగవుతాయి. ఖర్చులు చేయి దాటకుండా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు విస్తరింప జేసుకోవడానికి అనుకూలం. స్ర్తి, పురుషులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వస్తువులు, వస్త్రాలు కొత్తవి పొందే అవకాశాలున్నాయి. కీలక పత్రాలు భద్రపరచుకోండి. మతిమరుపు రాకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులు పోటీ పరీక్షలందు అప్రమత్తంగా ఉంటే మంచి ఫలితాలందుకుంటారు. ఇతరులతో గొడవలు వద్దు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. శుభకార్యాలు నెరవేరనున్నాయి. విందులు, సంఘ కార్యాలలో పాల్గొంటారు.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855

స్మృత్యంజలి

క్రితం వారం మరణించిన జీవిత భాగస్వాముల ప్రేమ, అనురాగాలతో చేసిన నివాళి గురించి చదివాం. ఇలాగే ఈ వారం మరణించిన వారి ఆత్మీయులు చేసిన నివాళి గురించి చదువుదాం.

పద్మజ

Pages