S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడో దశ మెడికల్ కౌనె్సలింగ్

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో మెడికల్, డెంటల్ కాలేజీల్లో ( ఎమ్సెట్-3) యుజి కోర్సుల అడ్మిషన్లకు మూడో దశ కౌనె్సలింగ్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అలాగే మూడో దశలో మల్లారెడ్డి కాలేజీ ఫర్ ఉమెన్‌లో సీట్లు కేటాయిస్తారు. 28వ తేదీ రాత్రిలోగా స్పోర్ట్సు కోటా సీట్లు జాబితాను స్పోర్ట్సు అధికారులు అందజేస్తే వాటిని సైతం భర్తీ చేస్తారు. 29వ తేదీ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోగా వెబ్ ఆప్షన్లను ఇవ్వాల్సి ఉంటుంది. రాత్రికి అలాట్‌మెంట్ జరుగుతుంది. అభ్యర్థులు 30వ తేదీన సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
జెఎన్‌టియు హెచ్ ఫలితాలు వెల్లడి

మిషన్ కాకతీయపై షికాగో విశ్వవిద్యాలయం అధ్యయనం

హైదరాబాద్, సెప్టెంబర్ 27:మిషన్ కాకతీయ పథకం గ్రామీణ ప్రాంతాల్లో మార్పులకు దోహదం చేస్తోందని, ఈ పథకం ఫలితాలపై ప్రపంచం ఆసక్తి చూపిస్తోందని షికాగో విశ్వవిద్యాలయం విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పథకం గ్రామీణ ప్రాంతాల్లో చూపించిన ప్రభావం, ఈ పథకాన్ని ఇంకా మేరుగ్గా అమలు చేయాలంటే ఏం చేయాలి, పథకం అమలుకు ముందు, అమలు తరువాత గ్రామీణ ప్రాంతాల పరిస్థితి తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు గతంలో షికాగో విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎంఓయు కుదిరింది. రెండేళ్లపాటు అధ్యయనం చేస్తారు.

ఏపిఏటి పరిధి నుంచి తెలంగాణను తప్పించడంపై హైకోర్టు అసంతృప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిధి నుంచి ఏ చట్టానికి లోబడి తెలంగాణ రాష్ట్రాన్ని మినహాయించాలని కేంద్రాన్ని కోరారో తెలియచేయాలని హైకోర్టు తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. తెలంగాణకు చెందిన దాదాపు 8670 కేసులను హైకోర్టుకు బదలాయించాలని కోర్టు పేర్కొంది. పివి కృష్ణయ్య, బి కిరణ్‌కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథం, జస్టిస్ యు దుర్గాప్రసాద్‌లు విచారించారు. ట్రిబ్యునల్ పరిధి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మినహాయిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఈ న్యాయవాదులు సవాలు చేశారు.

మిచిగాన్ యూనివర్శిటీకి యూఓహెచ్ ప్రొఫెసర్

హైదరాబాద్, సెప్టెంబర్ 27: మిచిగాన్ గ్రాండ్ వాలీ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యా త ఆంగ్లరచయిత షేక్‌స్పియర్‌పై జరుగుతున్న సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ సత్యబ్రత రౌత్‌కు అవకాశం దక్కింది. అక్టోబర్ 1 నుండి 23వ తేదీ వరకూ జరిగే సాహితీ సమ్మేళనంలో డాక్టర్ సత్యబ్రత రౌత్ షేక్‌స్పియర్ ఉత్సవానికి హాజరవడంతో పాటు అక్కడ రంగస్థల తరగతులను సైతం తీసుకుంటారు. షేక్‌స్పియర్ రచనల్లో భారతీయత అంశంపై ప్రత్యేకించి మాట్లాడతారు.

అంతర్జాతీయ ఆరోగ్య సదస్సుకు పొగాకు రైతు ప్రతినిధులను అనుమతించాలి

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ముసాయిదా సదస్సుకు పొగాకు సాగు చేసే రైతులను కూడా అనుమతించాలని అంతర్జాతీయ పొగాకు పెంపకందార్ల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సదస్సు ఢిల్లీలో నవంబర్‌లో ఢిల్లీలో జరుగుతుందని, పొగాకు పంటపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదని సంఘం అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ వాన్ డెర్‌మెర్వ్ కోరారు. పొగాకు రైతు వ్యతిరేక విధానాలను తీసుకోవడం వల్ల అనేకప్రాంతాల్లో రైతుల జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. పొగాకు సాగు పట్ల అవసరమైన సాంకేతిక జ్ఞానం కలిగిన వారిని చర్చల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలన్నారు.

డిస్కంలను లాభాలబాటలో నడిపిస్తాం

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేసిన డిస్కంలను లాభాల బాటలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విద్యుత్ వాణిజ్య సరఫరా వ్యవస్థలో నష్టాలను పూర్తిగా తగ్గించేందుకు ప్రణాళిక ఖరారు చేశామన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో డిస్కంలు లాభాల్లోకి వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ స్కీం ప్రయోజనాలను ఏపి పూర్తిగా వినియోగించుకుంటోందన్నారు. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీ కింద ఈ ఏడాది రూ. 3200 కోట్లను డిస్కంలకు చెల్లిస్తున్నట్లు చెప్పారు.

వెంకయ్య సన్మానంలో అమిత్‌షాకు అవమానం

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఏపిలో బిజెపి నాయకులు పార్టీ జాతీయ అధ్యక్షుడినే మర్చిపోతున్నారా? ప్రధానికి సముచిత స్థానం ఇవ్వాలన్న విషయం కూడా విస్మరిస్తున్నారా? తాజాగా తెనాలిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు జరిగిన సన్మానసభ, దానికోసం పార్టీ నేతలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, ఆహ్వానపత్రాలు పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడి ఫొటో లేకుండానే సన్మానం జరిగిన తీరుపై అటు బిజెపి సీనియర్లు కూడా అసంతృప్తితో ఉన్నారు.

నవంబర్ 11, 12లలో గ్రూప్ 2

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో తొలి భారీ రిక్రూట్‌మెంట్ నిర్వహణకు పబ్లిక్ సర్వీసు కమిషన్ సన్నద్ధమవుతోంది. గ్రూప్-2 స్థాయిలోని 1032 పోస్టుల భర్తీకి 7,91,964 దరఖాస్తులు వచ్చాయి. తొలుత 439 పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌కు స్పందనగా 5,62,715 దరఖాస్తులు రాగా, తర్వాత ఇచ్చిన అదనపు 593 పోస్టులకు మరో 2,29,249 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం ఇంత వరకూ కమిషన్‌కు 7,91,964 దరఖాస్తులు వచ్చాయని కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ పేర్కొన్నారు. పరీక్షను నవంబర్ 11 , 13 తేదీల్లో నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

పార్టీ మారిన వారికి పదవులు లేనట్టే?

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఏపిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఒకవైపు ఊహాగానాలు సాగుతున్న సమయంలోనే, వైసీపీ నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇటీవల బాబు గవర్నర్‌ను కలసిన సందర్భంలో మంత్రివర్గ విస్తరణపై చర్చకు వచ్చినప్పుడు, వైసీపీ ఎమ్మెల్యేలను కొందరిని తీసుకోవాలని భావిస్తున్నానని బాబు తన మనసులో మాట చెప్పారు.

మరో 55 వేల ఇళ్లకు సిఎం ఓకే

విజయవాడ, సెప్టెంబర్ 27: ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద గతంలో లక్షా 45వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం జరిపిన గృహ నిర్మాణశాఖ సమీక్షా సమావేశంలో అదనంగా మరో 55వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. ఈ పథకం కింద నిర్మితమయ్యే ఒక్కో ఇంటికి లక్షా 50వేల రూపాయలను ప్రభుత్వం భరించనుంది. నూతనంగా వచ్చిన అనుమతులతో ప్రతి నియోజకవర్గానికి 1250 ఇళ్లు లభించనున్నాయి. పిఎంఎవై పథకం కింద నిర్మించే 55వేల ఇళ్లకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం చొప్పున రెండు లక్షలతో ఒక్కో ఇంటి నిర్మాణం జరుగనుంది.

Pages