S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైపిసి స్ట్రీమ్ కౌనె్సలింగ్ 3నుంచి

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పివి నరసింహారావువెటర్నరీ వర్శిటీలకు సంబంధించిన బైపిసి స్ట్రీం కోర్సులకు సంయుక్త కౌనె్సలింగ్ అక్టోబర్ 3వ తేదీ నుండి నిర్వహించనున్నట్టు జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్‌కుమార్ తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం జారీ చేసిన అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారు మాత్రమే ఈ కౌనె్సలింగ్‌కు హాజరుకావడానికి అర్హులని ఆయన తెలిపారు.

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల దుర్మరణం

గట్టు, సెప్టెంబర్ 27: మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండల పరిధిలోని గంగిమాన్‌దొడ్డి గ్రామంలోమంగళవారం ఉద యం తమ వ్యవసాయ పొ లం దగ్గర ఇద్దరు రై తులు విద్యుతాఘాతానికి దుర్మరణం చెందా రు. రోజు మాదిరిగా రైతులు తమ వ్య వసాయ పొలానికి నీరు పారించేందుకు వెళ్లగా సర్వీస్ వైర్‌కు షార్ట్‌సర్క్యూట్ రావడంతో కరెన్న అలియాస్ అడివన్న (38) కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అక్కడే ఉన్న ఆయన సోదరుడు ఈరన్న (35), అతనిని రక్షించేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన తెలుసుకుని చుట్ట్టుపక్కల ఉన్న రైతులు గ్రామస్థులకు సమాచారం అందించారు.

కనిష్టస్థాయికి పడిపోయిన యాదాద్రి ఆదాయం

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 27: నల్లగొండ జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్థానం ఆదాయం ఎన్నడూ లేనంతగా మంగళవారం కనిష్టస్థాయికి పడిపోయింది. గత కొంతకాలంగా తగ్గు ముఖం పడుతూ వస్తున్న ఆదాయం మంగళవారం మరింత తగ్గింది. మంగళవారం యాదాద్రిలో వివిద విభాగాల నుండి 2 లక్షల 66 వేల 240 రూపాయల ఆదాయం సమకూరింది. బాలాలయంలో దర్శనాలు ప్రారంభమై సుమారు 6 మాసాలు కావస్తోంది.

నరుూంతో లింక్‌లున్న నేతలకు ప్రభుత్వం షాక్!

నల్లగొండ, సెప్టెంబర్ 27: గ్యాంగ్‌స్టర్ నరుూంతో సంబంధాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార, విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వపరంగా భద్రతాపరమైన అంశాలపై కోత పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ టిఆర్‌ఎస్ నేత రివాల్వర్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ రివాల్వర్‌ను పోలీస్ శాఖ స్వాధీనపరుచుకోవాలంటూ జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే కలెక్టర్ ఆదేశాలపై అధికారికంగా సమాచారం వెల్లడించేందుకు అధికారులు ఇష్టపడలేదు.

అంతం కాదిది... ఆరంభం

హైదరాబాద్, సెప్టెంబర్ 27: నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అధికారులు వేగవంతం చేశారు. రెండోరోజు మంగళవారం సాయంత్రానికి 204 అక్రమ కట్టడాలను నేలమట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఫోన్‌లో జనార్దన్‌రెడ్డితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అయితే అనేక చోట్ల ఆ ఇళ్ళలో నివసిస్తున్న వారు కూల్చి వేతలకు అడ్డుతగిలారు. దీంతో జిహెచ్‌ఎంసి సిబ్బందికి, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఎర్రవల్లిలో కెసిఆర్ పర్యటన

జగదేవ్‌పూర్, సెప్టెంబర్ 27: రాష్టమ్రుఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో మంగళవారం పర్యటించారు. ఈసందర్భంగా ఎర్రవల్లి-నర్సన్నపేట మధ్య కూడేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంతో పాటు ఎర్రకుంట, మైశిరెడ్డికుంట, లింగరాజ్‌కుంట, పాండురంగారిజర్వాయర్‌లను సిఎం పరిశీలించారు. ముందుగా సిఎం గ్రామంలో పర్యటిస్తారన్న సమాచారం మేరకు జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, గడా హన్మంతరావు రోడ్లు, డబుల్‌బెడురూంలను పరిశీలించారు. అయితే ఇళ్లను పరిశీలించకుండానే కేవలం చెరువులను మాత్రమే సిఎం పరిశీలించి తిరిగి పాంహౌస్‌కు వేళ్లారు.

పోలీస్ సంస్కరణలు అనివార్యం

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రతి దేశానికి అంతర్గత, బహిర్గత సమస్యలుంటాయని, వీటిని ఎదుర్కోవడంలో పోలీస్ భద్రత ప్రధానమైందని, దీనికి పోలీస్ శాఖలో సంస్కరణలు అనివార్యమని ఉత్తరప్రదేశ్, అస్సాం మాజీ డిజిపి ప్రకాష్ సింగ్ అన్నారు. మంగళవారం రావుబహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ వేణుగోపాల్ రావు స్మారక ఉపన్యాసంలో ‘పోలీస్ సంస్కరణలు-అంతర్గత భద్రత’పై ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

మహేశ్వరంలో 400 కెవి విద్యుత్ కేంద్రం

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఛత్తీస్‌గడ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌ను పొందడానికి మహేశ్వరంలో ఏర్పాటు చేస్తున్న 400 కెవి విద్యుత్ కేంద్రాన్ని నిర్ణీత గడవులోగా పూర్తి చేయాలని ట్రాన్స్‌కో సిఎండి డి ప్రభాకర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌కో కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ కమర్షియల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సి సి శ్రీనివాస్‌రావు, ప్రాజెక్ట్స్ అండ్ గ్రిడ్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎస్‌జి నర్సింగ్‌రావు, ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ టి జగత్‌రెడ్డి, లిఫ్డ్ ఇరిగేషన్ స్కీమ్స్ డైరెక్టర్ జె సూర్యప్రకాశ్, ప్రాజెక్ట్స్-1 చీఫ్ ఇంజనీర్ లతా వినోద్ తదితర ఉన్నతాధికారులతో సిఎండి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఉద్యోగుల విభజనకు ప్రత్యేక కమిటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఉద్యోగుల విభజనపై ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఉద్యోగుల విభజన కోసం కమలనాథన్ కమిటీని (చైర్మన్ అడ్వయిజరీ కమిటీ, ఎపి) కేంద్రం నియమించిన విషయం గమనార్హం. అదే విధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అక్టోబర్ 11 న (దసరా) సందర్భంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

షీలాభిడే కమిటీ పొడిగింపుతో ఆర్టీసి విభజన వేగవంతం

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపి పునర్విభజన చట్టంలోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, ఆస్తులు- అప్పులు, ఉద్యోగుల పంపకాలపై కేంద్రం నియమించిన షీలా భిడేకమిటీ పని కాలాన్ని పొడిగించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వరకు ఈ కమిటీని పొడిగించారు. ఈ మేరకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసి విభజన త్వరలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కమిటీ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 31తో ముగిసింది. ఏపి పునర్విభజన చట్టంలో 9వ షెడ్యూల్‌లో 91 సంస్థలున్నాయి. ఇందులో కమిటీ 59 కంపెనీలపై నివేదికలు అందించింది. మరో 32 సంస్థలపై నివేదికను తయారు చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి విభజన ఇంకా పూర్తి కాలేదు.

Pages