S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కయ్యంవల్ల ప్రయోజనం ఉండదు

పాకిస్తాన్ అంశం చాలా సున్నితమైంది. ప్రస్తుత పరిస్థితులలో కయ్యానికి కాలు దువ్వితే ప్రయోజనం లేదు. యుద్ధం జరిగితే ఇరు దేశాలు చాలా నష్టపోతాయి. ఎంతిట సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. చర్చలు జరపడం వల్ల సమస్యకు పరిష్కారం లభించినా, లభించకపోయినా ఉద్రిక్తత పరిస్థితుల నుంచి కొంత గట్టెక్కవచ్చు. జమ్ము కాశ్మీర్‌లో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వైఖరిపై మొదట అక్కడి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. ప్రజలను మానసికంగా పాకిస్తాన్ పట్ల ఏ విధమైన వైఖరితో అనసరించాలో ప్రజల సంసిద్ధం చేయాలి. ప్రజలను చైతన్య పర్చకుండా సమస్యకు పరిష్కారం లభించదు.

- ప్రొఫెసర్ రాజ్ సిద్ధార్థ కాకతీయ విశ్వవిద్యాలయం

‘‘బుల్లెట్’’లో పాము

సరే విమానాలు, పైగా ఎయిర్ ఇండియా విమానాలు నిర్లక్ష్యం అనుకుందామా అంటే అత్యంత ఆధునిక సాంకేతిక సదుపాయాలున్న జపాన్ దేశంలో బుల్లెట్ రైలు చాలా పేర్గాంచింది. సుఖం, క్షేమం, వేగం గల బుల్లెట్ రైలు పోయిన సోమవారం టోక్యో నుంచి హిరోషిమాకు పరుగులు తీస్తున్న సమయంలో ఓ ప్రయాణీకుడు లేచి ‘పాము.. పాము..’ అంటూ గగ్గోలు మొదలెట్టాడు.

-వీరాజీ

విమాన భోజనంలో బల్లి!

ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకులకు పెట్టే భోజన పదార్థాలలో తల వెంట్రుకలు మొదలు బల్లులదాకా వుంటాయన్న ఆరోపణలు అలా వినబడుతూనే వుంటాయి.
పోయినేడాది- మహారాజా (ఎయిర్ ఇండియా పేరు)గారు ఒక ప్రయాణీకురాలికి పెట్టిన భోజనంలో బల్లి పిల్ల పడి వున్నది. ముంబాయి నుంచి న్యూయార్క్‌కు మహారాజా సర్వీస్‌లో ప్రయాణం చేసిన మాల్తీ మథుకన్ పహాడియా అనే ప్రయాణీకురాలికి అందించిన భోజన పళ్లెంలో బల్లిపిల్ల కనబడ్డది. ఆమె ఆ ఆహారం తిరస్కరించి, వినియోగదారుల ఫిర్యాదు సంఘానికి వెళ్లింది. ప్లేటులో ఒక తల వెంట్రుకల చిక్కుకూడా అగపడ్డదిట!

ఖాదీ షోరూమ్‌కి రు.17 కోట్లు!

‘‘యు.పిలో, బిహార్‌లోనే దేశం మొత్తంమీద యువజనుల జనాభా ఎక్కువమంది’’ అని యిటీవలి లెక్కలు చెబుతున్నాయి. కాగా, బిహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌గారు మద్యపాన నిషేధం అమలు చేస్తున్నాడు. పైగా, యువతీ యువకులను ఖాదీ ప్యాష న్ దుస్తుల వేపు మళ్లించాలన్న నిర్ణయంతో రాష్ట్రంలో ఖాదీ డ్రెస్సుల షోరూమ్స్‌కి 17 కోట్ల రూపాయలు కేటాయించాడాయన. ‘రాష్ట్రీయ చరఖా దివస్’ (రాష్ట్రీయ రాట్న దినోత్సవం) నాడు కొత్త కొత్త డిజైన్లలో ఖద్దరు దుస్తులు తయారుచేస్తే, వాటికి ‘బ్రాండు’ విలువ, డిమాండు వస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘నిఫ్ట్’ సంస్థలో కొత్తరకం మాడ్రన్ ఖాదీ దుస్తుల తయారీకి ఒప్పందం కూడా బిహార్ గవర్నమెంట్ చేసుకుంది.

-వీరాజీ

కుక్కలకి మాత్రమే జన్మదినోత్సవ విందు!

మనుషులనే పిలిచి బర్త్‌డేలకి విందులు యివ్వటం లేదు- ఎక్కడో అక్కడ ‘బఫే’లు పెట్టేస్తున్నారు. అటువంటిది యిటీవల జంతువులకి పెళ్లిళ్లు చేయడం, విందులు చేయడం ఎక్కువైంది. జూలో సింహానికీ, సివంగికీ నాలుగు వందల మంది అతిథుల్ని పిలిచి, విందుపెట్టి పెళ్లి చేయడం బాంగ్లాదేశ్‌లో చూశాంగానీ ముంబాయికి చెందిన ఒక చిన్నారి తన 12వ ఏట జన్మదినోత్సవ వేడుకల్ని భారీగా జరిపించుకుంటూ- నాలుగు వందల ఊరకుక్కల్ని అత్యంత మక్కువగా ఆదరణతో పిలిచింది.

-వీరాజీ

హృదయం పదిలం... అతివల్లోనే అధిక గుండె సంబంధ వ్యాధులు ( నేడు వరల్డ్ హార్ట్ డే)

నమ్మలేని నిజాలు

- గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా 30-45 ఏళ్ల వయసు ఉన్నవారిలో సంభవిస్తున్నాయి.
- గృహిణుల్లో 69శాతం, ఉద్యోగినుల్లో 67శాతం మందికి వ్యాధులు సంభవిస్తున్నాయి.
- 8 నుంచి 10 మందిలో కొలెస్ట్రాల్ వల్ల, 3 నుంచి 4 మంది మహిళల్లో అధిక బరువు వల్ల వ్యాధులు దరిచేరుతున్నాయి. - 90 శాతం మందికి పొగతాగటం వల్ల, 97 శాతం మందికి డయాబెటీస్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి.

అక్వేరియంతో ఆహ్లాదం, ఆనందం..!

ఇళ్లలో ప్రేమగా జంతువులను ఎలా పెంచుకుంటామో.. కొందరు అక్వేరియంలో చేపల్ని కూడా అలానే పెంచుతారు.. మరికొందరేమో ఇంటి అందానికి అక్వేరియం పెట్టుకుంటారు. ఏదేమైనా అక్వేరియం ఇంట్లో ఉంటే మనకు ఉపయోగాలు కూడా ఉన్నాయట.. ఈదుతున్న చేప పిల్లలను కాసేపు చూస్తూ కూర్చుంటే అలసిన మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుందని దైనందిన వ్యవహారాలతో సొలసిన తరణంలో స్వేచ్ఛగా తిరుగాడే అమీనాల కేసి చూసే ఒక్క క్షణం వీక్షణం మన ఆలోచనల్లో మార్పు తెస్తుందని శాస్తజ్ఞ్రులు అంటారు.
ఎలాంటి చేపలు

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి

భారీ ఆఫర్!

సౌత్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ తెలుగు, తమిళంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులతో బిజీగా వుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో మెగాస్టార్ సరసన ఖైదీ నెం.150తోపాటు తమిళంలో స్టార్ హీరో అజిత్ 57వ చిత్రంలోనూ అలాగే మణిరత్నం డైరెక్షన్‌లో జీవ హీరోగా రూపొందుతున్న ‘కావలై వెండం’సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇన్ని భారీ ప్రాజెక్టులుచేస్తున్న ఈమెను మరో పెద్ద ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది. తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇలయదళపతి విజయ్ 61వ చిత్రంలో ఈమె హీరోయిన్‌గా నటిస్తోందట. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని ‘విజయ్ తెండల్’ సంస్థ నిర్మాణంలో అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు.

వేడి పుట్టింది

గ్లామర్ భామ త్రిష రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటినుండీ చేసిన సినిమాలన్నీ ఆమెకు ఎటువంటి లాభం ఇవ్వలేదు. ముఖ్యంగా అందరూ వెళ్ళే దారిలో వెళ్లి నాయకితో భయపెట్టి హిట్ కొట్టాలనుకున్నా ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక ఇప్పుడు మరో హారర్ సినిమా చేస్తోంది. మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనలో పడిందట. మలయాళంలో హిట్‌గా సంచలనం రేపిన ‘100 డిగ్రీల సెల్సియస్’ చిత్రంతో శే్వతమీనన్ మంచి పేరును తెచ్చుకుంది. ఈ సినిమా త్రిషకు బాగా నచ్చిందట. నటన, గ్లామర్ రెండూ ఈ సినిమాకు ప్రధాన అంశాలు కావడంతో ఈ చిత్రం రీమేక్ చేస్తే హిట్ కొట్టడం ఖాయమని భావిస్తోంది.

ఇద్దరూ ఇద్దరే..

మలయాళ నటుడు మోహన్‌లాల్, ఆమలాపాల్, సత్యరాజ్ ప్రధాన తారాగణంగా జోషి దర్శకత్వంలో కె.ఆర్.్ఫలింస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై కందల కృష్ణారెడ్డి తెలుగులో అందిస్తున్న చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’. ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, మోహన్‌లాల్, సత్యరాజ్ పోటీపడి నటించిన ఈ చిత్రంలో ఇద్దరూ ఇద్దరిగానే వుంటారని, ఓ వెరైటీ కథ కథనంతో రూపొందించిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని తెలిపారు.

Pages