S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యూఎస్ వరల్డ్ బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో ఎస్కేయూకు స్థానం

అనంతపురం సిటీ, జూలై 22:క్యూఎస్ వరల్డ్ బ్రిక్స్ ర్యాంకింగ్స్ తాజాగా ప్రకటించిన రాంకింగ్స్‌లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి స్థానం లభించింది. ఎస్కేయూ ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ చేసిన మార్గనిర్థేశనంలో ఎస్కేయూకు ఈ గౌరవం దక్కింది. క్యూయస్ వరల్డ్ బ్రిక్స్ ర్యాంకింగ్స్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఎస్కేయూ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఉపకులపతి ఆచార్య రాజగోపాల్ నేతృత్వంలో ఎస్కేయూకు స్థానం లభించడం విశేషం. దేశంలో 421 విశ్వవిద్యాలయాలు క్యూఎస్ వరల్డ్ బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో స్థానం కోసం దరఖాస్తు చేయగా 44 విశ్వవిద్యాలయాలకు చోటు లభించింది.

యువకుడి ఆత్మహత్య

గుంతకల్లు, జూలై 22 : నిరుద్యోగానికి అనారోగ్యం తోడవడంతో జీవితంపై విరక్తి చెందిన డేనియల్(23) శుక్రవారం తెల్లవారుజామున బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కసాపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు సత్యనారాయణ పేటలోని మున్సిపల్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి కుమారుడు డేనియల్ డిగ్రీ వరకు పూర్తి చేశాడు. అతనికి గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పాటు పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న లక్ష్మీదేవికి అనారోగ్యానికి గురికావడంతో మనస్థాపానికి గురైన డేనియల్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు.

నైతిక వర్తనకు పదును

గోరఖ్‌పూర్, జూలై 22: దేశాన్ని ఆధునికం, సౌభాగ్యవంతం చేయడంలో స్వామీజీలు, వివిధ మతాలకు చెందిన మఠాలు కీలకపాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు వీరిలో చాలా మంది ఇప్పటికే టాయిలెట్లు నిర్మించడం, వైద్య సేవలు అందించడం లాంటి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నాయని కూడా ఆయన అన్నారు. ‘లక్షల సంఖ్యలో ఉన్న స్వామీజీలు, వేలాది పీఠాలు, వందలాది మఠాలు భారత దేశాన్ని ఆధునికం, సౌభాగ్యవంతం చేయడంలో, అలాగే దేశ ప్రజల్లో నైతిక విలువలవను పెంపొందించడంలో కీలకపాత్ర పోషించాల్సిన సమయం వచ్చింది. చాలా మఠాలు, పీఠాలు ఇప్పటికే ఈ పని చేస్తున్నాయి.

గుట్కా పట్టివేత

మడకశిర, జూలై 22 : కర్నాటక నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న రూ.8.47 లక్షల విలువజేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ దేవానంద్ తెలిపారు. గురువారం రాత్రి మడకశిర పట్టణంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా కెఏ.27-7906 నెంబర్ 407 వాహనం టుంకూరు నుంచి 170 బస్తాల గుట్కా లోడ్‌తో వెళ్తుండగా పట్టణ సమీపంలోని వైబి హళ్లి క్రాస్ వద్ద తనిఖీ చేయగా గుట్కా బస్తాలు ఉన్నట్లు తేలడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. గట్కాపై నిషేధం ఉన్నా టుంకూరుకు చెందిన వ్యాపారి భక్తరామ్ పటేల్ సూచన మేరకు 407 డ్రైవర్ రుద్రేష్ గుట్కాను తరలిస్తుండటంతో వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

పెరుగుతున్న వర్షపాతం

అనంతపురం, జూలై 22 : జిల్లాలో వర్షపాతం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి జిల్లావ్యాప్తంగా 22.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఈనెల సాధారణ వర్షపాతం 67.4 మి.మీ. కాగా 14వ తేదీ నాటికి కేవలం 4.6 మి.మీ మాత్రమే నమోదైంది. అలాగే 63 మండలాలకు కేవలం 9 మండలాల్లో మాత్రమే 0.0 నుంచి 2.5 మి.మీ వరకూ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో చినుకు ఊసే లేదు. అనంతరం 21వ తేదీ దాదాపు అన్ని మండలాల్లో వర్షం కురిసింది. దీంతో సగటు వర్షపాతం 20.5 మి.మీ. నమోదైంది. ఇందులో 5.0 నుంచి 10.0 మి.మీ. వర్షం 23 మండలాల్లో కురవగా, 10.0 మి.మీ., ఆపైన 14 మండలాల్లో కురిసింది. శుక్రవారం 2.5 మి.మీ మేర వర్షపాతం 36 మండలాలు, 5.0 మి.మీ.

ఆపారు గానీ.. అడ్డుకోలేరు

న్యూఢిల్లీ, జూలై 22: ప్రత్యేక హోదాపై ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రస్తుతం రాజ్యసభలో వాయిదా వేయగలిగారే దాన్ని ఓటింగ్ రాకుండా అడ్డుకోలేరని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావుస్పష్టం చేశారు. ఈ బిల్లు రాజ్యసభలో మళ్లీ అడ్డుకోడానికి ఎన్ని కుట్రలు చేస్తారో చూడాలని ఆయన అన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై అనేక పార్టీలు ముక్తకంఠంలో ఖండించాయని శుక్రవారం ఇక్కడ చెప్పారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీలకు రాజ్యసభ సభ్యులకు, టిఆర్‌ఎస్, వామపక్షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బాబు అల్టిమేటం ఇవ్వాలి: దిగ్విజయ్

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

హైదరాబాద్, జూలై 22: మహానగరాభివృద్ధిలో కార్పొరేటర్లు కీలక భాగస్వాములు కావాలని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. నార్త్‌జోన్ పరిధిలోని కార్పొరటర్లతో ఆయన శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మిణఆన్ని చేపట్టడానికి ప్రస్తుతమున్న మురికివాడల ప్రజలను ఒప్పించాలని సూచించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో ప్రత్యేకత, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వంటి అంశాలపై ప్రజలకు వివరించి, వారు అంగీకరించేలా కృషి చేయాల్సిన బాధ్యత కార్పొరేటర్లదేనని ఆయన తెలిపారు.

మరో ముగ్గురు ఆత్మహత్యాయత్నం

అహ్మదాబాద్, జూలై 22: దళితుల ఆందోళనలతో అట్టుడికిన గుజరాత్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అనేక ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. బోటా డ్ జిల్లాలో ఆవుచర్మం క్రయిస్తున్నారన్న ఆరోపణలతో నలుగురు దళితులను అర్థనగ్నం చేసి దాడి చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. అనేక ప్రాంతాల్లో మూడు రోజులుగా హిం సాత్మక సంఘటనలు జరిగాయి. కాగా దోషులను శిక్షించాలని డిమాం డ్ చేస్తూ జిల్లాలో మరో ముగ్గురు దళిత యువకులు ఆత్మాహత్యకు ప్రయత్నించారు. నిరసన కార్యక్రమం చేపట్టిన ముగ్గురు దళితులు విషం తాగారని పోలీసులు వెల్లడించారు.

మమ్మల్ని వేధిస్తున్నారు

లక్నో, జూలై 22: బిఎస్పీ అధినేత్రి మాయావతిపై ఉత్తరప్రదేశ్ బిజెపి నేత దయాశంకర్ సింగ్ అసభ్య వ్యాఖ్యల వివాదం శుక్రవారం కొత్త మలుపు తిరిగింది. తన భర్త ప్రాణాలు తీసేంతవరకు నిద్ర పోరని ఆరోపిస్తూ మాయావతిపైన, ఆమె పార్టీకి చెందిన నాయకులపైన దయాశంకర్ భార్య నగరంలోని హజరత్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిఎస్పీ నేతలు, కార్యకర్తలు తమ బూతులు తిడుతూ, తమను మానసిక వేదనకు గురి చేస్తున్నారని దయాశంకర్ సింగ్ భార్య స్వాతి అంతకు ముందు విలేఖరుల వద్ద వాపోయారు.

గాంధీ ఆస్పత్రిలో విద్యుత్ కట్ చిమ్మచీకటి

తార్నాక, జూలై 22: నిరు పేదలకు సేవలందించే సికింద్రా బాద్ గాంధీ ఆస్పత్రికి శుక్రవారం సాయంత్రం నుంచి విద్యుత్ కట్‌చేశారు. విద్యుత్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అధిక మొత్తంలో విద్యుత్ బకాయలు పడటంతో విద్యుత్ శాఖ అధికారులు కోత విధించినట్లు సమాచారం. ఈవిషయమై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం రాత్రి అధికారులు అందుబాటులో లేరు. ఒక్కసారిగా విద్యుత్ కట్ కావడంతో ఆస్పత్రిలో అంధకారం నెలకొంది. ప్రధాన వార్డులు విభాగాలు చీకటిలోనే వుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొవ్వొత్తులు, సెల్‌ఫోన్ లైట్ల సాయంతో వైద్యులు రోగులకు సేవలందించారు.

Pages