S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు

రాజమహేంద్రవరం, జూలై 22: గోదావరి తీరంలో అంత్య పుష్కరాలకు ఆధ్యాత్మిక శోభ వెల్లి విరయనుంది. పవిత్ర అంత్య పుష్కర స్నానాలకు తరలివచ్చే పుష్కర యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర భూమికలో కీలకపాత్ర పోషించే దేవాదాయ ధర్మాదాయశాఖ అంత్య పుష్కరాల పనె్నండు రోజులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాలతోపాటు, గోదావరి నది ఒడ్డున వున్న ప్రాచీన ఆధ్యాత్మిక ప్రాశస్థ్యం కలిగిన పురాణ ఇతిహాస క్షేత్రాల్లో పుష్కర యాత్రికుల దైవ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సమస్యలు పట్టవా!

అనంతపురంటౌన్, జూలై 22:వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బెడద ఒకవైపు, తాగునీటి కాలుష్యం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పాలకవర్గానికి, అధికారయంత్రాంగానికి అభివృద్ధి పనులపై ఉన్న శ్రద్ధ పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, తాగునీటి కాలుష్యనివారణపై కానరావటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి మత్తులో జోగుతున్న పాలక, అధికారవర్గాలకు ప్రజల గోడు పట్టకపోవటంలో వింతేమి లేదని నగరవాసులు ధ్వజమెత్తుతున్నారు. ప్రజలకు వౌలిక వసతులు కల్పించటం ఎంత అవసరమో అదే సమయంలో అంతకన్నా ముందు ప్రజాసమస్యలు తీర్చటం ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించాలని పాలకవర్గం, అధికారయంత్రాంగానికి వారు మొరపెట్టుకుంటున్నారు.

డ్రిప్.. డ్రిప్...

అనంతపురం, జూలై 22 : ఎపిఎంఐపి ద్వారా ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న డ్రిప్ పరికరాల కోసం రైతులు ముమ్మరంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వర్షాభావం, అకాల వర్షాల కారణంగా ఏటా రబీ, ఖరీఫ్ సీజన్‌లలో వేరుశెనగతో పాటు ఇతర పంటలు నష్టపోతున్న జిల్లా రైతాంగం పండ్ల తోటలు, కూరగాయల పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా నీటిని పొదుపుగా వాడుకుని పంటలను సంరక్షించుకునేందుకు డ్రిప్ ఇరిగేషన్‌పై ఆధార పడాల్సి వస్తోంది. దీంతో చాలామంది రైతులు డ్రిప్ ఇరిగేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాకు 35,000 హెక్టార్లలో డ్రిప్ సౌకర్యం కల్పించాలని సంకల్పించిన విషయం తెలిసిందే.

‘కబాలి’ డా...

అనంతపురం కల్చరల్, జూలై 22: కబాలి సినిమా విడుదల కావడంతో నగరంలోని సినిమా థియేట ర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా వివిధ భాషలలో భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైంది. దీంతో అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పడిగాపులు కాశారు. నగరంలో శాంతి, గౌరి థి యేటర్లతో పాటు ఇతర థియేటర్లలో కూడా శుక్రవారం కబాలి సినిమాను ప్రదర్శించారు. సినిమా చూడటం కో సం అభిమానులు ఉదయానే్న పెద్ద ఎత్తున థియేటర్లకు చేరుకున్నారు. టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకున్నారు. శాంతి థియేటర్‌లో సరికొత్త టెక్నాలజీతో నగరంలో మొదటి సారి గా యుఎఫ్ 2కె సౌండ్‌సిస్టం ద్వారా సినిమాను ప్రదర్శించా రు.

హెచ్చెల్సీకి నీరు విడుదల

బళ్లారి, జూలై 22 : తుంగభద్ర జలాశయం నుంచి శుక్రవారం హెచ్చెల్సీకి నీరు విడుదల చేశారు. దాదాపు వంద కూసెక్కుల నీటిని కిందకు వదిలారు. గంటగంటకూ వంద కూసెక్కుల చొప్పున గరిష్టంగా 1050 క్యూసెక్కుల నీరు పెంచుతున్నట్లు మండలి అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయానికి 4984 కూసెక్కుల వరద వస్తుండగా 11,689 క్యూసెక్కులు కిందకు వదులుతున్నట్లు తెలిపారు. జలాశయంలో 40.388 నీటి మట్టం ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలాశయం మండలి కార్యదర్శి డి.రంగారెడ్డి, తుంగభద్ర మండలి ఇంజినీర్ శశిభూషణరావు, దేవిరెడ్డి, కార్య నిర్వహణ ఇంజినీర్ లక్కప్ప, పార్థసారధి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ

తాడిపత్రి, జూలై 22:తాడిపత్రిలో ప్రజస్వామ్యం ఖూనీ అయ్యిందని, నాటి నియంతల పాలన, ఎమర్జెన్సి పాలన తాడిపత్రిలో ఈనాడు నడుస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పేర్కొన్నారు. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తు శుక్రవారం పెన్నానది కొత్తవంతెన వద్ద ఉన్న చెక్‌పోస్ట్‌వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు.

రాజన్న రాజ్యంతోనే అభివృద్ధి

నల్లమాడ, జూలై 22:రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గపు పాలనతో రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయ ం జరుగుతోందని, రాజన్న రాజ్యం వచ్చినప్పుడే రాయలసీమ ప్రజానికానికి న్యాయం జరిగి సీమ అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నల్లశింగయ్యగారిపల్లిలో ఉన్న పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నివాసానికి వచ్చిన వైఎస్ వివేకానందరెడ్డి నియోజకవర్గంలో చేబట్టిన గడపగడపకూ వైకాపా కార్యక్రమంపై ఆరాతీశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు.

నిందితుల కోసం గాలింపు

అనంతపురం, జూలై 22 : నగరం లో గురువారం జరిగిన జంటహత్య కేసు నిందితుల కోసం ముమ్మర గాలి ంపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ మల్లికార్జునవర్మ తెలిపారు. చంద్రబాబు కొట్టాలకు చెందిన గోపీనాయక్, వెంకటేష్ నాయక్‌ను ప్రత్యర్థులు దారుణం గా నరికి చంపిన విషయం విధితమే. ఈ కేసుకు సంబంధించి డిఎస్పీ వివరాలు వెల్లడించారు. హత్యలు జరిగిన తక్షణం నిందితులను పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బృందాలు వివిధ చోట్ల గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అలాగే వివిధ కోణాల్లో కేసు విచారణ చేపట్టామన్నారు. బొలేరో వాహనం ఎవరిది? బైకు ఎక్కడిది? నిందితులు ఎంతమంది ఉన్నారు? పతకం ఎలా వేసుకున్నారు?

ప్రగతే భవిత

గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), జూలై 22: కులతత్వ రాజకీయాలను, బంధుప్రీతి రాజకీయాలను తిరస్కరించి, అభివృద్ధి రాజకీయాలకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీ, ప్రతిపక్ష బహుజన్ సమాజ్ పార్టీలపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. అయితే ఆయన ఇటీవల గుజరాత్‌లో దళితులపై జరిగిన దాడి గురించి కాని, బిఎస్‌పి అధినేత్రి మాయావతి గురించి తమ పార్టీ నేత చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల గురించి కాని ప్రస్తావించలేదు.

ఆటలో మెళకువలు పాటిస్తే అదరహో..

బెళుగుప్ప, జూలై 22 : ఫుట్‌బాల్ క్రీడలో మెళకువలు పాటిస్తే మేటి ఆటగాళ్లుగా తయారు కావచ్చని స్పెయిన్ ఫుట్‌బాల్ కోచ్‌లు బోమ, లూకా, ఆల్బర్ట్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఆర్టీటీ సహకారంతో ఫుట్‌బాల్ కోచ్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో సుమార్ 50 మంది క్రీడాకారులకు స్పెయిన్ ఫుట్‌బాల్ కోచ్‌లతో శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ క్రీడను ఏవిధంగా ఆడాలి, గోల్ఫ్ ఏవిధంగా కొట్టాలనే మెలకువలను స్పెయిన్ కోచ్‌లు వివరించారు.

Pages