S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకవరం సిహెచ్‌ఎన్‌సి మూత

గోకవరం, జూలై 22: పిహెచ్‌సిలపై అజమాయిషీ చేసే సిహెచ్‌ఎన్‌సిలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో 9 పిహెచ్‌సిలపై అజమాయిషీ చేసే గోకవరం సిహెచ్‌ఎన్‌సి మూతపడింది. ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలోని పిహెచ్‌సి ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనంలో సిహెచ్‌ఎన్‌సి కార్యాలయం ఏర్పాటు చేసి, ఇక్కడ నుండే 9 పిహెచ్‌సిల పనితీరును అధికార్లు పర్యవేక్షించేవారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సిహెచ్‌ఎన్‌సి ఎత్తివేయడంతో పిహెచ్‌సిల బాగోగులు జిల్లాస్థాయి నుండే అధికార్లు పర్యవేక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.

పారిశుద్ధ్య కార్మికులకు ధర్మబద్ధంగా జీతాలివ్వండి

తిరుపతి, జూలై 22: రాత్రనక, పగలనక ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మలమూత్రాలను శుభ్రంచేసి పారిశుద్ధ్యాన్ని అందిస్తున్న కార్మికులు కడుపుకాలి పనిచేయడం ఆపితే ఆ పని మరొకరు చేయలేరని ధర్మబద్ధంగా జీతాలిచ్చి వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్ రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌కు విజ్ఞప్తిచేశారు. రుయాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన వందలాది కార్మికులతో కలిసి రుయా సూపరింటెండెంట్‌ను ఆయన ఛాంబర్‌లో కలసి విజ్ఞప్తి చేశారు.

పాల ఆటో బోల్తా : ఏడుగురు విద్యార్థులకు గాయాలు

రామచంద్రాపురం, జూలై 22: కుప్పం బాదూరు సమీపంలో పాల ఆటో బోల్తా పడటంతో ఏడుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళితే పరమాల నుంచి గంగి రెడ్డిపల్లి వైష్ణవి డెయిరీఫామ్‌కు పాలు తరలిస్తున్న ఆటోలో పరమాల, మిట్టకండ్రిగ, కుప్పం గ్రామాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు కుప్పంబాదూరు పాఠశాలకు వెళ్లడానికి ఎక్కారు. కుప్పం బాదూరు రైస్‌మిల్ సమీపంలో మలుపువద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా గిరీషా

చిత్తూరు, జూలై 22: చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా గిరీషాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ జెసిగా ఉన్న భరత్‌గుప్తాను ప్రభుత్వం ఇటీవల శ్రీశైలం ఆలయ ఈవోగా నియమించింది. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా ఉన్న గిరీషాను జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జాయింట్ కలెక్టర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

లక్షన్నర కిలోమీటర్లలో ఇంటర్నెట్ ఫైబర్ లైన్లు

హైదరాబాద్, జూలై 22: మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటింటికి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించే విధంగా, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో ప్రతి ఒక్కరికీ అన్ని అవకాశాలు అందాలన్న లక్ష్యంతో లక్షా 50వేల కిలో మీటర్ల మేర ఇంటర్‌నెట్ ఫైబర్ లైన్లు వేస్తున్నట్టు మంత్రి తారక రామారావు తెలిపారు. మారుమూల గ్రామాలను ప్రపంచంతో కలపాలని, ఇది ఇంటర్‌నెట్‌తోనే సాధ్యం అవుతుందని అన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపైన ఐటి శాఖ నిర్వహించిన వర్క్‌షాప్‌లో కెటిఆర్ మాట్లాడారు. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్న డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ లాంటి నినాదాలు ఈ ఫైబర్ గ్రిడ్ ద్వారా సాధ్యం అవుతాయని అన్నారు.

ముగ్గురు దొంగల అరెస్ట్

తిరుపతి, జూలై 22: తిరుపతి-తిరుచానూరులో 7 ఇళ్లు, మహిళల మెడల్లో చెన్లుచోరీచేసి తప్పించుకుతిరుగుతున్న ముగ్గురు దొంగలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు క్రైం ఎ ఎస్పీ సిద్దారెడ్డి తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.5లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్ట్‌చేశామన్నారు. ఎ ఎస్పీ సిద్దారెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి సాయినగర్‌కు చెందిన బి.లోకేష్ (20), పునీత్‌రెడ్డి(21), ఎస్.్ఛంద్‌భాషా (29) అనే ముగ్గురు దొంగలు పలుచోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్నారన్నారు.

24 నుంచి త్యాగరాజ జయంతి ఉత్సవాలు

తిరుపతి, జూలై 22: త్యాగరాజ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 11రోజుల పాటు నిర్వహించనున్న 250వ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కమిటీ ఛైర్మన్ బీమాస్ రఘు తెలిపారు. శుక్రవారం స్థానిక బీమాస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు టిటిడి యాజమాన్యం ఎంతగానో సహకరిస్తుందని, ఇందుకు టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి, ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 73 సంవత్సరాలుగా త్యాగరాజు ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడు త్యాగరాజుస్వామి 250వ జయంతి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు.

గ్రీనరీ పర్యవేక్షణకు గ్రీన్‌బుక్

హైదరాబాద్, జూలై 22: తెలంగాణలోని అన్ని పరిశ్రమల్లో నిబంధనల మేరకు ఉండాల్సిన గ్రీనరీని పర్యవేక్షించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు తెలిపారు. ప్రతి పరిశ్రమలోనూ మూడవ వంతు చెట్ల పెంపకం ఉండాలని, ఈ వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. దీని కోసం గ్రీన్ బుక్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ గ్రీన్ బుక్ ద్వారా ప్రతి పరిశ్రమ యూనిట్ తాము పెంచుతున్న చెట్ల వివరాలను జియో మ్యాపింగ్ చేస్తారని చెప్పారు. జియో ఫెన్సింగ్ పద్ధతి ద్వారా ఎప్పటికప్పుడు గ్రీనరీ పెరుగుదలను పర్యవేక్షిస్తామని చెప్పారు.

శ్రీనాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలి

తిరుపతి, జూలై 22: మదనపల్లి మునిసిపల్ చైర్మన్ వేధింపులకు బలవన్మరణానికి పాల్పడిన శ్రీనాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని రూ. 25 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలంటూ సి ఐ టి యు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ వేధింపుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈకార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యదర్శి గంగరాజు, సురేంద్ర, హరి, చిన్నామణి, వెంకటేష్, మళ్లి, గండి శ్రీను, పళణి తదితరులు పాల్గొన్నారు.

కుక్కల దాడిలో దుప్పి మృతి

పలమనేరు, జూలై 22: పలమనేరు పట్టణ సమీపంలోని గంటావూరు అటవీ ప్రాంతంలో శుక్రవారం కుక్కల దాడిలో అడవి నుంచి వచ్చిన దుప్పి తీవ్ర గాయాలై మృత్యువాత పడింది. దీనిని గమనించిన స్థానికులు పలమనేరు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. అనంతరం అటవీ అధికారులు చట్టం ప్రకారం వణ్యప్రాణికి చేయవలసిన కార్యక్రమాలు చేపట్టారు. అటవీ సమీప గ్రామాల్లో వ్యవసాయ పొలాలపై దుప్పిలు, అడవి జంతువులు వస్తుంటాయి. ఈనేపథ్యంలో కొన్ని జంతువులు రాత్రి వేళల్లో వేటగాళ్ల తూటాలకు బలి అవుతున్నాయి. వణ్యప్రాణులకు రక్షణ కరువైంది. గ్రామీణ ప్రాంతాలకు వచ్చే అడవి జంతువులపై కుక్కలు దాడి చేయడంతో మృత్యువాత పడుతున్నాయి.

Pages