S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యాను వెంటాడుతున్న ముప్పు

మాంట్రియల్, జూలై 22: ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రీడాకారులు డోపింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలతో తీవ్రమైన అపఖ్యాతిని మూటగట్టుకున్న రష్యాను ప్రస్తుతం రియో ఒలింపిక్స్ నుంచి సంపూర్ణ నిషేధానికి గురయ్యే ప్రమాదం వెంటాడుతోంది. ఒలింపిక్స్ నుంచి తమ ట్రాక్ అండ్ ఫీల్డ్ జట్టును నిషేధించడాన్ని సవాలు చేస్తూ రష్యా చేసుకున్న అప్పీలును అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎస్‌ఎ) డిస్మిస్ చేయడంతో ఆ దేశానికి ఈ పరిస్థితి దాపురించింది.

పింక్ పాంథర్స్‌కు మరో విజయం

ముంబయి, జూలై 22: స్టార్‌స్పోర్ట్స్ ప్రోకబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు పాట్నా పైరేట్స్‌ను 29-22 పాయింట్ల తేడాతో ఓడించి ఎనిమిదో వజయం సాధించింది. తొలి అర్ధ్భాగం ముగిసే సరికి 9-11 పాయింట్ల తేడాతో వెనకబడి ఉన్న పింక్ పాంథర్స్ రెండో అర్ధ భాగం ప్రారంభంలోనే సూపర్ టాకిల్ ద్వారా స్కోరును 13 పాయింట్ల వద్ద సమం చేయగలిగింది. ఆ తర్వాతనుంచి ఆ జట్టు ప్రత్యర్థిపై ఆధిక్యతను కొనసాగిస్తూనే వచ్చింది. పింక్ పాంథర్స్ జట్టులో రైడర్ అజయ్ కుమార్ అద్భుతంగా రాణించి ఏడు పాయింట్లు సాధించాడు.

సంస్కరణల అమలుపై చర్చిద్దాం రండి

న్యూఢిల్లీ, జూలై 22: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)ను ప్రక్షాళన చేసేందుకు అనుసరించాల్సిన మార్గాల గురించి చర్చించేందుకు వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను ఆదేశించింది. బిసిసిఐని సంస్కరించేందుకు జస్టిస్ లోధా కమిటీ చేసిన ప్రధాన సిఫారసులను సుప్రీం కోర్టు ఇటీవల ఆమోదించడంతో పాటు ఆరు నెలల వ్యవధిలోగా ఈ సిఫారసులను అమలు చేయాలని స్పష్టం చేసిన విషయం విదితమే.

హాకీలో పతకం ఖాయం..

ముంబయి, జూలై 22: రియో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని హాకీ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎం సోమయ ఆశాభావం వ్యక్తం చేశాడు. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం సాధించని విషయం తెలిసిందే. ఓల్ట్‌మన్స్ జట్టులో గణనీయమైన మార్పు తీసుకు వచ్చాడని , ఆటగాళ్లపై ఆధారపడ్డం కాక ఆట తీరుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని ఇక్కడొక కార్యక్రమంలో పాల్గొన్న సోమయ చెప్పాడు.

లియాండర్ లక్ష్యం.. ఒలింపిక్స్‌లో రెండో పతకం

కోల్‌కతా, జూలై 22: ఒలింపిక్స్‌లో రెండో పతకం సాధించడంతో పాటు భారత్ తరఫున డేవిస్ కప్‌లో అత్యధిక సింగిల్స్ విజయాలు సాధించిన రామనాథన్ కృష్ణన్ రికార్డును బద్దలు కొట్టాలన్నది లియాండర్ పేస్ లక్ష్యమట. వచ్చే నెల జరిగే రియో ఒలింపిక్స్‌లో ఆడడం ద్వారా ఏడవసారి ఒలింపిక్స్‌లో పాల్గొనే రికార్డు కోసం పేస్ ఇప్పుడు సంసిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ‘పేస్‌కు కొన్ని లక్ష్యాలున్నాయి. ఒలింపిక్స్‌లో రెండో డబుల్స్ పతకం సాధించాలన్నది వాటిలో ఒకటి.

అమెరికా ఎటిపి చాలెంజర్ క్వార్టర్స్‌కు రామ్‌కుమార్

బింగ్‌హామ్టన్ (అమెరికా), జూలై 22: అమెరికాలో జరుగుతున్న ఎటిపి చాలెంజర్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు రామనాథన్ రామ్‌కుమార్ (21) క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 214వ స్థానంలో కొనసాగుతున్న రామ్‌కుమార్ శుక్రవారం ఇక్కడి హార్డ్ కోర్టులో జరిగిన సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌కు చెందిన జోస్ స్ట్థామ్‌పై అద్భుత విజయాన్ని సాధించాడు. రెండు గంటల 22 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ సుదీర్ఘ పోరులో 2-6 తేడాతో తొలి సెట్‌ను కోల్పోయిన రామ్‌కుమార్ ఆ తర్వాత అనూహ్య రీతిలో విజృంభించాడు.

రియోలో రాణిస్తా సానియా ఆశాభావం

హైదరాబాద్, జూలై 22: బ్రెజిల్‌లో వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడల్లో పోటీపడేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానని, సహచర భారత అథ్లెట్లతో కలసి ఈ క్రీడల్లో చక్కటి ప్రదర్శనతో రాణించగలనని ఆశిస్తున్నానని టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా స్పష్టం చేసింది. ‘ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నా. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ నుంచి కెనడాకు బయలుదేరుతున్నా. ఈసారి భారత్ నుంచి అతిపెద్ద క్రీడా బృందం ఒలింపిక్స్‌కు వెళుండటం ఆసక్తిని కలిగిస్తోంది.

రియో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న సచిన్

న్యూఢిల్లీ, జూలై 22: భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెండూల్కర్ రియో ఒలింపిక్స్‌కు వెళ్లనున్నాడు. భారత ఒలింపిక్ సంఘానికి సుహృద్భావ రాయబారిగా నియమితుడైన సచిన్‌ను ఆగస్టు 5వ తేదీ నుంచి బ్రెజిల్‌లో ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడలకు విచ్చేయవలసిందిగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అధ్యక్షుడు థామస్ బాచ్ ఆహ్వానించాడు. దీంతో సచిన్ వచ్చే నెల 2వ తేదీన రియో డీ జెనిరో నగరానికి బయల్దేరనున్నాడు. ఈ పర్యటన సందర్భంగా సచిన్ అక్కడ భారత ఒలింపిక్ క్రీడా బృందాన్ని కలుసుకుని వారికి శుభాకాంక్షలు తెలుపనున్నాడు. ఒలింపిక్స్‌కు సచిన్ వెళ్లడం ఇదే తొలిసారి.

విమాన స్పేర్‌పార్ట్స్ పరిశ్రమ ఏర్పాటుకు భూముల పరిశీలన

దొనకొండ, జూలై 21: దొనకొండ మండలం చందవరంలో 120కోట్ల రూపాయలతో స్పేర్‌పార్ట్స్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ ఎపిజె అబ్దుల్‌కలాం స్వశక్తి కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండలంలోని చందవరం పంచాయతీలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని వారు పరిశీలించారు. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, విమానాలు, హెలికాఫ్టర్లకు సంబంధించిన విడి భాగాలను ఈ పరిశ్రమలో తయారుచేస్తారని, ముందుగా 2500మందికి ఈ సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. శిక్షణ పొందిన సిబ్బందితో ఈప్రాంతంలో మరికొందరికి శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు.

క్షేత్రస్థాయిలో పర్యటించి ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటాం

గిద్దలూరు, జూలై 21: రాష్ట్రంలో 13 జిల్లాల్లో 202 తాలూకా యూనిట్లు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు పర్యటనలు సాగిస్తున్నామని, ఇప్పటివరకు 70 తాలూకా పర్యటనలు చేసినట్లు రాష్ట్ర ఎన్‌జిఓ సంఘం అధ్యక్షులు అశోక్‌బాబు తెలిపారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయం ఆవరణలో జరిగిన ఎన్‌జిఓ ఉద్యోగుల తాలూకా యూనిట్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

Pages