S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలతో ప్రజల హృదయాలను స్పందింపచేసిన దాసరి

హైదరాబాద్, మే 27: ‘తాతామనవడు’ చిత్రం ద్వారా సినీ దర్శకుడిగా పరిచయమై ప్రేమాభిషేకం, ఓసేరాములమ్మ, కంటే కూతురినే కనాలి వంటి సందేశాత్మక చిత్రాలను కలుపుకుని 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావును తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య ఘనంగా సత్కరించారు. చిత్రాలద్వారా ప్రజా హృదయాలను స్పందింపచేసిన దాసరి నారాయణరావు అని రోశయ్య కొనియాడారు. దాసరి సినీ ప్రస్తానం కొనసాగించాలని చెబుతూ ఢిల్లీ అకాడమీని ప్రశంసించారు.

పట్టణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలను కల్పించాలి

హైదరాబాద్, మే 27: పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అర్బన్ డే సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, పింఛన్ల పంపిణీ, పారిశుద్ధ్యం తదితర అంశాలపై దృష్టి సారించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కీసరను జిల్లా కేంద్రం చేసేందుకు కృషి

కీసర, మే 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలకు కార్యకర్తలు ప్రచారం చేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కీసరలోని కెబిఆర్ ఫంక్షన్‌హాల్‌లో మండల స్థాయి టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సుధీర్‌రెడ్డి హాజరయ్యారు.

పోలీసుస్టేషన్లలో ఎస్పీ తనిఖీ

మోమిన్‌పేట/మర్పల్లి, మే 27: వికారాబాద్ సబ్ డివిజన్‌లోని పోలీసుస్టేషన్ల పనితీరును తెలుసుకునేందుకు, ధారూర్, బంట్వారం, మర్పల్లి, మోమిన్‌పేట పిఎస్‌లను సందర్శించినట్లు రూరల్ ఎస్పీ నవీన్‌కుమార్ అన్నారు. శుక్రవారం మోమిన్‌పేట పోలీసుస్టేషన్‌ను సందర్శించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ప్రజలతో పోలీసులు వ్యవహరించే తీరు, రికార్డులు ఎలా ఉన్నాయి.. స్టేషన్‌కు వచ్చేవారితో పోలీసులు మర్యాదగా మాట్లాడుతున్నారా.. స్టేషన్‌కు వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజలకు కలిగేలా చూస్తారా లేదా.. కేసులు ఎలా వున్నాయి పరిశీలించానని అన్నారు.

నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో ఇండోర్ స్టేడియం

ఉప్పల్, మే 27: నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించడానికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా శుక్రవారం ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన శిక్షణ శిబిరం ముంగింపు వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. మానసిక ఉల్లాసం, శరీర దారుఢ్యంకోసం క్రీడలు ఎంతో దోహదపడుతాయని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమని పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నాయని తెలిపారు.

మోడల్ టాయిలెట్లకు సత్వర చర్యలు చేపట్టాలి

ఉప్పల్, మే 27: నగరంలో ఏర్పాటు చేసిన వంద మోడల్ టాయిలెట్లను తక్షణమే ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఈస్ట్‌జోన్ పరిధిలోని చిల్కానగర్ డివిజన్ ఉప్పల్ రింగ్‌రోడ్డులో మోడల్ టాయిలెట్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. టాయిలెట్ నిరుపయోగంగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన టాయిలెట్లకు నీటి సౌకర్యం కల్పించామని అన్నారు. వీటిని నిర్వహించడానికి స్థానిక సఫాయి కర్మచారి సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిర్వహణ బాధ్యతలు చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎస్‌ఆర్‌డిపికి స్థలమివ్వాలని డిఆర్‌డిఎల్ డైరెక్టర్‌కు వినతి

హైదరాబాద్, మే 27 : నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించి, ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం రూపకల్పన చేసిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ కింద చేపట్టనున్న పనులకు వీలైనంత త్వరగా స్థలాలు ఇవ్వాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి వివిధ శాఖల అదికారులను కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కంచన్‌బాగ్‌లోని డిఆర్‌డిఎల్ డైరెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌డిపి పనులకు ఆటంకాలను తొలగించేందుకు డిఆర్‌డిఎల్ డైరెక్టర్ డటా. కె. జయరామన్‌తో నేరుగా కలిసి చర్చించినట్లు తెలిపారు.

సామాజిక సేవా స్ఫూర్తి కలిగి ఉండాలి

ఘట్‌కేసర్, మే 27: సామాజిక సేవా స్ఫూర్తి కలిగిన ప్రతి వ్యక్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైకర్టర్ ఎన్.కృష్ణవేణి అన్నారు. మండల కేంద్రంలోని కేఎల్‌ఆర్ గార్డెన్‌లో జనచైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్, మగ్గం వర్క్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశాన్ని సాంకేతిక రంగంలో ప్రపంచానికి ధీటుగా నిర్మించాలని భారత ప్రభుత్వం చర్యలు చేపడుతున్న తరుణంలో గ్రామీణ స్థాయి నుంచి సాంకేతిక రంగంపై ప్రతి ఒక్కరిని నిష్ణాతులను చేసేందుకు ఉచితంగా శిక్షణను ఇవ్వటం గర్హనీయమని అన్నారు.

బాల్య వివాహాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి

వికారాబాద్, మే 27: బాల్య వివాహాలు జరగకుండా ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌లో బాల్య వివాహాలను వ్యతిరేకిద్దాం, బాల్యాన్ని రక్షిద్దాం అనే అంశంపై చైల్డ్‌లైన్, ఎంవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించారు.

మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నడుం బిగించాలి

ఖైరతాబాద్, మే 27: మహిళల అక్రమ రవాణను అడ్డుకునేందుకు అంతా నడుం బిగించాల్సి ఉందని ప్రజ్వలా సంస్థ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో యూఎస్ కాన్సొలేట్ ప్రతినిధి మైకేల్‌తో కలిసి ఆమె మాట్లాడారు. బాలికలు, స్ర్తిల అక్రమ రవాణ సరిహద్దులు దాటి అన్ని దేశాల్లో కొనసాగుతున్న అతి పెద్ద సమస్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లు పైబడ్డ చిన్నారులను పాఠశాలల వద్ద మాటువేసి ఇతర ప్రాంతాలకు తరలించే ముఠాలు ఉన్నాయని అన్నారు. ఈ తరహా ట్రాఫికింగ్‌కు గురౌతున్న వారిని రక్షించేందుకు ప్రజ్వల సంస్థ పనిచేస్తుందని చెప్పారు.

Pages