S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెగాం ప్రాజెక్టుపై చిగురిస్తున్న రైతుల ఆశలు

ఇచ్చోడ, మే 27: అడెగాంకె ప్రాజెక్టు కింద కాలువల నిర్మాణాని మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.2కోట్ల 8లక్షల నిధులు మంజూరు కావడంతో కాలువల పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు దశాబ్దకాలం కింద జిలయజ్ఞంలో రూ.2కోట్ల 83లక్షలు మంజూరు చేసి నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగినా కాలువల నిర్మాణానికి నిధులు లేకపోవడంతో రైతుల భూములకు చుక్కనీరుకూడా అందలేదు. ఈ ప్రాజెక్టులో 140 ఎకరాల భూమి ముంపునకు గురికాగా సుమారు 1100 ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో నిర్మాణం జరిగింది.

ప్రశాంతంగా ఎడ్‌సెట్

దివ్యనగర్, మే 27: పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఎడ్‌సెట్) ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని ఐదు కేంద్రాల్లో పరీక్షను ఉదయం 11గంటల నుండి ఒంటి గంట వరకు నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జుమ్మెరాత్‌పేట్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోషల్ స్టడీస్, పాలిటెక్నికల్ కళాశాలలో గణితం, ఇంగ్లీష్, ఈద్‌గాం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బయోసైన్స్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు.

పంట పొలాల్లో రైతులు బిజీ బిజీ

కుంటాల, మే 27: పుడమితల్లినే నమ్ముకున్న రైతులకు ప్రతీయేట పుట్టెడు కష్టాలు ఎదురవుతున్న ప్రతీ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఎంతో ఆశతో ముందుకెళ్లి పంట పొలాల్లో పనులతో బిజీ బిజీగా కనిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కుంటాల మండలంలోని అంబకంటి, ఓల, గొల్లమాడ, లింబా(కె), సూర్యాపూర్, దౌనెల్లి, కల్లూర్, అంబుగామ, లింబా(బి), మెదన్‌పూర్, పెంచికల్‌పాడ్, కుంటాల గ్రామాలతోపాటు తదితర గ్రామాల్లో గతేడాది సకాలంలో వర్షాలు లేక ఖరీఫ్, రబీ సాగులో ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

కామన్‌స్కూల్ విద్యావిధానాన్ని అమలుపర్చాలి

ఆదిలాబాద్ టౌన్, మే 27: ప్రభుత్వం విద్యాసంస్కరణల పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు తీసుకోడం సరైందికాదని, ప్రస్తుత విద్యారంగంలో కామన్ స్కూల్ విధానాన్ని అమలుపర్చి అందరికి సమాన విద్యను అందించాలని డిటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తిర్పెల్లి కాలనీలో డిటిఎఫ్ సంఘం రౌండ్‌టేబుల్ సమావేశం సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మడావి రమేష్, వృకోదర్‌లు మాట్లాడుతూ విద్యాసంస్కరణల పేరుతో రాష్టవ్య్రాప్తంగా 400పాఠశాలలు మూసివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇవ్వకూడదని, అక్రమంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేయాలన్నారు.

1న చలో ఢిల్లీని విజయవంతం చేయాలి

ఆదిలాబాద్ టౌన్, మే 27: బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న చేపట్టే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐజీఈటీవోఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అలోక్‌కుమార్, బి.బాబురావులు తెలిపారు. గత మూడు రోజుల నుండి బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరహార దీక్షలను శుక్రవారం విరమించుకున్నారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఖాళీగాఉన్న గ్రూప్, బి పోస్టులు భర్తీచేయాలన్నారు. మేనేజ్‌మెంట్ ట్రైనీ, డిజిఎంల నియామకాలు నేరుగా కాకుండా నిలిపివేయాలని, స్టాండర్డ్ ఈ2, ఈ3 పేస్కేల్‌ను జేటీవో, ఎస్‌డీ ఈలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

సవాళ్లను ఎదుర్కొని.. సమష్టిగా కృషి చేద్దాం

ఆదిలాబాద్, మే 27: పోలీసులు తమ బాధ్యతలను విస్మరించకుండా టీం వర్క్, అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు వీలుపడుతుందని, విధుల్లో తేడా వస్తేమాత్రం సహించేదిలేదని కొత్త ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్పీగా తరుణ్ జోషి నుండి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆ తర్వాత పోలీసు అధికారులతో సమావేశమై తన అభిప్రాయాలను ఎస్పీ నిర్మోహమాటంగా వెల్లడించారు. పోలీసు సంస్కరణలు ఖచ్చితంగా అమలుచేసేందుకు, సేవలను గ్రామస్థాయికి విస్తరించేందుకు మరింత పాటుపడాలని ఎస్పీ హితవు పలికారు.

ఇంటికో ఇంకుడుగుంత, మరుగుదొడ్డి

ఆదిలాబాద్, మే 27: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరు బావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటిలో ఓ మరుగుదొడ్డి, ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలని, వాతావరణ సమతుల్యత కోసం తప్పనిసరిగా ప్రజలు మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ మండలం అనుకుంట గ్రామంలో రూ. 13లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, రూ.5లక్షల వ్యయంతో నిర్మించనున్న దోబిఘాట్ నిర్మాణాలకు మంత్రి భూమిపూజ చేశారు.

నాణ్యమైన బోధనతో మెరుగైన ఫలితాలు

నిజామాబాద్, మే 27: నాణ్యమైన విద్యను బోధిస్తూ సరైన ప్రోత్సాహం అందిస్తే ఏ విద్యార్థి అయినా మెరుగైన ఫలితాన్ని సాధించగల్గుతాడని, ఈ దిశగా ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ యోగితారాణా ఉద్బోధించారు. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను, వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేసిన 111పాఠశాలల ప్రధానోపాధ్యాయులను శుక్రవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఘనంగా సన్మానించారు.

మోదీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన

ఆర్మూర్, మే 27: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందని, అందువల్లే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్మూర్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎన్‌డిఓ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అన్నారు. గతంలో పదేళ్లు పాలించిన యుపిఎ సర్కార్ పాలనలో అవినీతి పెరిగిందని, కుంభకోణాలు జరిగాయని చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు సంపూర్ణ మెజార్టీని అందించి నరేంద్ర మోడికి అవకాశం ఇచ్చారని అన్నారు.

రిజర్వేషన్లతోనే యువతకు వెలుగు

కామారెడ్డి, మే 27: కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే నాల్గు శాతం రిజర్వేషన్‌లతో మైనార్టీ యువతలో వెలుగునింపడం జరిగిందని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. శుక్రవారం రాత్రి కామారెడ్డి పట్టణంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో జరిగిన మైనార్టీ సదస్సులో నిర్వహించిన పవర్ ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడుతూ, దాదాపు 10లక్షల మంది మైనార్టీ యువకులు కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో లబ్దిపొందారని అన్నారు. అన్ని రంగాల్లో ఈరిజరేవషన్‌తో మైనార్టీ యువతకు న్యాయం జరిగిందన్నారు. కామారెడ్డి ప్రాంతం నుండి ప్రజలను తనను గెలిపించడంతో తనపై బాధ్యత పెరిగి మైనార్టీలకు న్యాయం చేయడం జరిగిందన్నారు.

Pages