S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యమంలా మరుగుదొడ్లను పూర్తి చేయాలి

గంగాధర, మే 3: గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంలా తీసుకొని పూర్తి చేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు. మంగళవారం గంగాధర శివారులోని శుభమస్తు ఫంక్షన్ హాలులో జరిగిన చొప్పదండి నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ అందరం సమష్టిగా కష్టపడితేనే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 50 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు.

కరవు జిల్లాగా ప్రకటించాలి

పెద్దపల్లి రూరల్, మే 3: ఈ యేడాది నెలకొని ఉన్న వర్షాబావ పరస్థితుల కారణంగా వేసిన పంటలు పండక రైతులు తీవ్ర నష్టాల పాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరీంనగర్ జిల్లాను వెంటనే కరవుజిల్లాగా ప్రకటించి సహాయ చర్యలు చేపట్టాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు.

జమ్మికుంటను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

జమ్మికుంట, మే 3: జమ్మికుంట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం 36 కోట్లతో నిర్మించనున్న హుజూరాబాద్-జమ్మికుంట ఫోర్‌లైన్ రోడ్‌తో పాటు మార్కెట్ నిధులు నాలుగు కోట్ల 18 లక్షల వ్యయంతో చేపడుతున్న సిసి, బిటి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 నాటికి నియోజకవర్గంలో మట్టి రోడ్డు అనేది లేకుండా చేస్తామని, అన్ని గ్రామాలతో పాటు పట్టణంలో వాడ వాడనా మురికి కాలువలు నిర్మిస్తామని అన్నారు.

గాలి దుమారంతో బీభత్సం

కరీంనగర్, మే 3: కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన రాళ్ల వాన పడి బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి నలుగురు మృతి చెందారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌తోపాటు మంథని, మహదేవ్‌పూర్, కాటారం, రామగుండం, మహముత్తారం, గోదావరిఖని, కమాన్‌పూర్, వీణవంక, సుల్తానాబాద్, సారంగపూర్, ధర్మారం, వెల్గటూర్, కోనరావుపేట, వేములవాడ, భీమదేవరపల్లి తదితర మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో చిరు నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. అయితే గాలి దుమారం బాగా వీచడంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంబాలు పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ప్రాజెక్టులను అడ్డుకుంటే రక్తపాతమే...

కరీంనగర్, మే 3: ప్రజల ఆకాంక్షతోపాటు క్షేత్రస్థాయి అవగాహన ఉన్న సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సముద్రం పాలవుతున్న గోదావరి నది జలాలను కేటాయింపుల మేరకు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూడటం సరికాదని, ఒకవేళ అలా చేస్తే మాత్రం ప్రభుత్వం రక్తపాతం సృష్టించైనా ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరందిస్తుందని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అన్నారు.

ప్రమాద ఘంటికలు...!?

కరీంనగర్, మే 3: హమ్మయ్య...ఏలాగోలా ఏప్రిల్ గండం గట్టెక్కింది..ఇక మే గండం ముందుంది. ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరోవైపు దంచికొడుతున్న ఎండలు..వెరసి జిల్లా చరిత్రలో ఎన్నడూలేని విధంగా భూగర్భ జలాలు అడుగంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో నీటి వనరులు వట్టిపోగా, అక్కడక్కడ ఉన్న వ్యవసాయ బావులపైనే భారం వేసి ఆ బావుల వద్దకు జనం పరుగులు తీస్తోంది. పల్లెలు, పట్టణాలకు తాగునీరందించే రిజర్వాయర్లు సైతం నీళ్లు లేక ఏడారులుగా మారాయి. ఫలితంగా పట్టణ జనం బిందెలు, బకెట్లతో ట్యాంకర్ల వెంట పడుతుండగా, పల్లె జనం బావుల వద్ద బారులు తీరుతున్నారు.

ఓసిల రద్దు పోరాటానికి కార్యాచరణ సిద్ధం

మందమర్రి రూరల్, మే3: ఓసి ల రద్దుకు కార్యాచరణ జె ఎసి ల ఆద్వర్యంలో నిర్ణయం తీసుకున్నట్లుగా జె ఎ సి చైర్మన్ కోదండరాం తెలిపా. మందమర్రి మండలంలోని ఎర్రగుంట పల్లి లో ఓసి వ్యతిరేక పోరాటం జరుగుతుండటంతో ఆ గ్రామ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి వచ్చిన జె ఎ సి బృందం మంగళవారం ఎర్రగుంటపల్లికి చేరుకొని గ్రామ పరిస్థితులపై అద్యయనం చేసింది. ఆ గ్రామంలో ఉన్న వనరుల వివరాలు, గ్రామంలో ఎన్నిసంవత్సరాలు గా ప్రజలు జీవనం చేస్తున్నారు, ఓసి ఏర్పాటు వల్ల ఆ గ్రామానికి గ్రామ ప్రజలకు జరిగే కష్ట నష్టాలపై జె ఎ సి కమిటి విచారణ చేసింది.

రైతులకు వరం.. మిషన్ కాకతీయ

కాసిపేట, మే 3: మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువుల పూడికతీత వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని మండల ఎంపిపి ముదం శంకరమ్మ, జడ్పీటిసి రౌతు సత్తయ్య, ప్రాథమిక సహాకార సంఘం చైర్మెన్ పుస్కూరి వంశీధర్‌రావులు పేర్కొన్నారు. మంగళవారం కాసిపేట మండలంలోని సోనాపూర్ పంచాయితీలో గల గట్రావుపల్లి చెరువు, దేవాపూర్ చెరువు, వెంకటాపూర్ చెరువు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండవ విడుత చెరువుల పూడికతీత కార్యక్రమంలో భాగంగా పనులను ప్రారంభించడం జరిగిందని, మండలానికి రెండవ విడుతలో 8 చెరువులకు మంజూరు అయినట్లు వారు పేర్కొన్నారు.

మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం

కడెం, మే3: రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న తెలంగాన ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ ద్వారా గ్రామాల్లో ఉన్న చెరువులకు పునరుద్దరణ పనులు చేపట్టడంతో పూర్వ వైభవం రానుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంగళవారం కడెం మండలంలోని దస్తురాబాద్ గ్రామపంచాయతీ పరిధిలో గల ఆకొండపేట్ గ్రామంలో మిషన్ కాకతీయ ద్వారా మంజూరైన 57 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్న భీమన్న చెరువు పనులకుఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, కడెం మండల పరిషత్ అధ్యక్షురాలు బుక్య అమ్మిబాపురావు, సర్పంచ్ గాజర్ల గంగామణి రాజేశం ప్రారంభించారు.

కోర్టుకు హాజరైన మంత్రి రామన్న

ఆదిలాబాద్, మే3: 2014 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతూ డబ్బులు పంపిణీ చేశారన్న అభియోగాలపై అప్పటి టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి జోగురామన్న మంగళవారం కోర్టు విచారణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సెషన్‌కోర్టుకు హాజరయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సంధర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని తన నివాస గృహం ఎదుట అనుచరులు రూ.3లక్షల డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది.

Pages