S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిమ్స్‌లో దోపిడీకి గురౌతున్న ఆరోగ్యశ్రీ రోగులు

ఖైరతాబాద్, మే 3: ఇరు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే పేరెన్నిక గాంచిన నిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగులు దోపిడీకి గురౌతున్నారు. కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చుకే అందిస్తున్నట్టు నిత్యం చెప్పుకునే నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ రోగులు నరకాన్ని చవిచూస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించే సదుద్దేశంతో తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం అమలులో నిమ్స్ యాజమాన్యం అలసత్వం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నిమ్స్ ఆసుపత్రిలో ఓపి సేవలను ఉచితంగా అందించడంతో పాటు వైద్యపరీక్షలపై 25శాతం రాయితీ ఇచ్చేవారు.

త్వరలో అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే

హైదరాబాద్, మే 4: రోజురోజుకి నగరంలో పెరగుతున్న జనాభాకు అనుగుణంగా త్వరితగతిన సేవలందించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వీలైనంత త్వరగా ఫ్లైళను క్లియర్ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఈ ఆఫీసును ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులు ఇపుడు భవన నిర్మాణ అనుమతుల జారీ విషయంలో మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించారు.

మెట్రో పనులను తనిఖీ చేసిన ఉన్నతాధికారుల బృందం

హైదరాబాద్, మే 3: నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు పనులు వివిధ ప్రాంతాల్లో ఉన్నతాధికారుల బృందం తనిఖీ చేసింది. మెట్రోరైలు ఎండి డా.ఎన్వీఎస్‌రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) జితేందర్‌లతో కూడిన ఉన్నతాధికారుల బృందం నాంపల్లి, సికిందరాబాద్ వొఎంసి, లక్డీకాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో పనులను పరిశీలించారు. మెట్రోరైలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు చొటుచేసుకోకుండా ఉండేందుకు గాను మెట్రోరైలు, ఎల్ అండ్ టి, నగర ట్రాఫిక్ పోలీసులు సమష్టిగా భద్రతా ప్రమాణాలను చేపట్టాలని మెట్రో ఎండి అధికారులను ఆదేశించారు.

నిరుద్యోగ సమస్యను తీర్చడంలో ప్రభుత్వం విఫలం

ఇబ్రహీంపట్నం, మే 3: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహా, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కావలి నర్సింహా, ఎఐఎస్‌ఎఫ్ డివిజన్ కార్యదర్శి జనార్ధన్ విమర్శించారు. ఎఐఎస్‌ఎఫ్ 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానికంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. దానిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యిందని దుయ్యబట్టారు.

అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి

సికింద్రాబాద్, మే 3: తెలంగాణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్‌లో దాదాపు కోటి రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ ప్రజలు కోరుకున్న పాడి పంటలతో తులతూగే తెలంగాణ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను స్వయంగా ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి తెరాస ప్రభుత్వ పాలనకు బ్రహ్మరధం పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల తవ్వకాలు తప్పనిసరి

ఘట్‌కేసర్, మే 3: ఈనెల అయిదు నుండి ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల తవ్వకాలకు శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కరవు నివారణ చర్యలు చేపట్టండి

మహేశ్వరం, మే 3: మండలంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి తాగునీరు లేక ప్రజలు, పశుగ్రాసం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని వెంటనే చర్యలు చేపట్టాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు.
ఎంపిపి పి.స్నేహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపిటిసి టి.యాదేష్ పలువురు సభ్యులు మాట్లాడుతూ, గ్రామాల్లో తాగునీటి సమస్య అధికమైందని, ప్రభుత్వం ట్యాంకర్లద్వారా నీరు సరఫరా చేయాలని, రైతులకు పశుగ్రాసం సబ్సిడీపై అందజేయాలని కోరారు.

ఉద్యమ స్ఫూర్తితో ఇంకుడు గుంతల తవ్వకాలు

హైదరాబాద్, మే 3: నీటి సంరక్షణ కోసం చేపడుతున్న ఇంకుడు గుంతల తవ్వకాల కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం కలెక్టరేటు నుండి ఎంపిడిఓలు, తహసిల్దార్లు, ఓఎస్‌డిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 5న ప్రతి గ్రామ పంచాయతీ, అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీలలో ఇంకుడు గుంతలు ఉండేలా, వీలైతే బోరు పక్కనే ఏర్పాటుచేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఏజి కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్, మే 3: నగరంలోని లక్డికాపూల్‌లో గల అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో (ఏజి ఆఫీస్) భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన మంటలు మంగళవారం మధ్యాహ్నం వరకు ఎగసిపడ్డాయి.
సాంకేతిక లోపం కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. కార్యాలయంలోని డి బ్లాక్ మూడవ అంతస్తులో సోమవారం అర్ధరాత్రి చెలరేగిన మంటలను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రిన్సిపల్ డైరెక్టర్ సెంట్రల్ (ఆడిట్) విభాగంలో ఎగసిపడుతున్న మంటలను ఆపేందుకు శ్రమించారు.

కాలుష్య నివారణకు సమష్టి ఉద్యమం

హైదరాబాద్, బేగంపేట, మే 3: మహానగరాల్లో రోజురోజుకీ పెరుగుతున్న పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు నగరవాసులు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని వక్తలు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హిమాయత్‌నగర్‌లోని అశ్విని ఎలర్జీ సెంటర్, నగర ట్రాఫిక్ పోలీసు శాఖ సంయుక్త్ధ్వార్యంలో ఉదయం నెక్లెస్‌రోడ్డులో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.

Pages