S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిడుగుపాటుకు నలుగురికి గాయలు

ఆదిలాబాద్, మే 3: జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రం వాతావరణం చల్లబడి పెనుగాలులతో ఉరుములు మెరుపులకు తోడు పిడుగులు పడడంతో నలుగురు మృతిచెందారు. మంగళవారం 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా వడదెబ్బకు గురై ముగ్గురు మృతి చెందారు. లక్సెటిపేట మండలం వెంకట్రావ్‌పేట్ గ్రామానికి చెందిన వేమూరి రమేష్(40) వడదెబ్బ సోకి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందగా ఇదే మండలంలో వెల్కపల్లి గ్రామానికి చెందిన పోటు మల్లేష్ (38) మృతి చెందాడు. దండేపల్లి మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ఆడె సోముబాయి (55) అనే మహిళ వడదెబ్బసోకి మృతి చెందింది.

తెలంగాణ సస్యశ్యామలమే ప్రభుత్వ ధ్యేయం

దిలవార్‌పూర్, మే 3 : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ అన్నారు, మండలంలోని మాటేగాంలో ప్రతిష్టాత్మకంగా చేపడ్తున్న వాటర్‌గిడ్ పనులను ఆమె మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమే వాటర్‌గిడ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా తాగునీరు, సాగునీరుకు అత్యంత ప్రాదాన్యతను కల్పిస్తుందన్నారు.పల్లె పల్లెకు తాగునీరందించడం కోసమే మిషన్ భగీరధ చేపట్టిందన్నారు. మాటేగాం వాగర్‌గిడ్‌తో ఈ నియోజిక వర్గ అన్ని గ్రామాలకు తాగునీరందుతుందన్నారు.

వాటర్‌గ్రిడ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి

కడెం,మే 3: ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు మండలాలకు సాగునీరందించే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు వద్ద దాదాపు 400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పనుల వద్దకు మంగళవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసి ఆర్ అదనపు ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ సందర్శించారు. ప్రాజెక్టు సమీపంలో నిర్మాణం అవుతున్న వాటర్‌గ్రిడ్ ఇంటెక్‌వెల్ పనులను ఆమె స్వయంగా పరిశీలించారు. వాటర్‌గ్రిడ్ పనులు ఎలా కొనసాగుతున్న విషయాన్ని స్థానిక పథకం సి ఈ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎదైన భూ సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని ఆమె ఆరా తీశారు.

విద్యుత్ ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తప్పనిసరి

వికారాబాద్, మే 3: విద్యుత్ ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ సిబ్బంది, కార్మికులు, ప్రైవేటు ఎలక్ట్రిషియన్లు జాగ్రత్తలు తప్పక పాటించాలని వికారాబాద్ విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ దుర్గారావు సూచించారు. మంగళవారం కార్యాలయం ఆవరణలో విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాపై సిబ్బంది నిర్లక్ష్యం చూపరాదని స్పష్టం చేశారు. ఎవరికి పడితే వారికి లైన్‌క్లియర్ ఇవ్వరాదని, మద్యం సేవించి విధులకు రావద్దని చెప్పారు.

ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల పెంపు

జీడిమెట్ల, మే 3: ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ జగన్ అన్నారు. మంగళవారం డివిజన్‌లోని మగ్దూమ్‌నగర్, పొలాలబస్తీ, శ్రీనివాస్‌నగర్‌లలో ఇంకుడు గుంతల నిర్మాణపు పనులను ప్రారంభించారు. జగన్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని పొదుపుగా నీటిని వాడుకోవాలని అన్నారు. నీటిని పొదుపుగా వాడడంతో పాటు భూగర్భ జలాలను పెంచడానికి ప్రతిఒక్కరు కంకణ బద్దులై ముందుకు రావాలని సూచించారు. భూగర్భ జలాలను పెంచి భావితరాలకు నీటిని అందించాలని చెప్పారు. ప్రతి పౌరుడు బాధ్యతతో ఇంకుడు గుంతలను నిర్మించాలని తెలిపారు.

యుద్ధప్రాతిపదికన నాలాల పూడికతీత

బేగంపేట, మే 3: యుద్ధప్రాతిపదికన నాలాల పూడికతీత పనులను మొదలుపెట్టాలని బల్దియా అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మంగళవారం రాంగోపాల్‌పేట డివిజన్ కళాసిగూడ, నెక్లెస్‌రోడ్డు నాలాల ఆధునీకరణ పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వాలు, పాలకుల నిర్లక్ష్యంతో నాలాల ఆధునీకరణ నిలిచిపోయి కబ్జాలకు గురైందని ఆరోపించారు. నాలాల ఆధునీకరణకు గ్రేటర్ కమిషనర్‌కు లేఖ రాశామని అన్నారు. పనుల్లో కాంట్రక్టర్లు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తవ్వించుకోవాలి

మోమిన్‌పట, మే 3: మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఇంకుడు గుంతలు తవ్వించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం కార్యదర్శులపై వుందని జడ్‌పి సిఇఓ వి.వి.రమణారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాజాత ద్వారా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తవ్వించేలా చేయాలన్నారు. ఇంకుడు గుంతలతో ప్రతి వర్షపు బొట్టు వృధాగా పోకుండా వుంటుందని భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. మండలంలోని ఐదు గ్రామాల్లో ఈనెల 30 వరకు వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకునేలా ప్రజలను చైతన్యపరచాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించారు.

చెరువుల పునరుద్ధరణకు అత్యధిక నిధులు

కీసర, మే 3: చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించిందని మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి అన్నారు. మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా భోగారం గ్రామంలోని భోజరాజు చెరువులో రెండవ విడత మిషన్ కాకతీయ పనులను మంగళవారం ప్రారంభించారు. మిషన్ భగీరథ క్రింద మేడ్చల్, శామీర్‌పేట్, మండలాలకు తాగునీరు అందిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలోని 75 చెరువుల పునరుద్ధరణకు రూ.5కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. పూడికతీత పనులు పూర్తికాగానే సకాలంలో వర్షాలు పడి చెరువులు కళకళలాడుతాయని అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియొగం చేసుకోవాలని సూచించారు.

50 అధునాతన బస్ ‘బే’లు!

హైదరాబాద్, మే 3: మహానగర పాలక సంస్థ పరిధిలోని రోజురోజుకి ట్రాఫిక్ పెరుగుతుండటంతో, కనీసం ప్రయాణికులకు సౌకర్యంగా ఆర్టీసి బస్సులను కూడా ఆపే పరిస్థితి లేదన్న విషయాన్ని గుర్తించి, సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో 50 ఆధునిక బస్ బేలను ఏర్పాటు చేయనున్నట్లు గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జిహెచ్‌ఎంసి తరపున ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు మున్సిపల్ మంత్రి కెటిఆర్ రూపకల్పన చేసిన వంద రోజుల యాక్షన్ ప్లాన్ పనులను ఆయన మంగళవారం వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించి తనిఖీ చేశారు.

సాప్ అప్లికేషన్స్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులకు సమగ్ర శిక్షణ

మేడ్చల్, మే 3: సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాప్ (ఎస్‌ఎపి) సంస్థ మరియు తెలంగాణ విజ్ఞాన నైపుణ్యాభివృద్ధి సంస్థ (టిఎఎస్‌కె)ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సాప్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం రాష్ట్ర వ్యాప్తంగా పది ఇంజనీరింగ్ కళాశాలలోని ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సాప్ అప్లికేషన్స్‌లో సమగ్ర శిక్షణ ఇస్తుందని సంస్థ సిఇఓ సుజీర్ నాయర్, డైరెక్టర్ భాస్కర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఐటి విధాన ప్రకటనలో భాగంగా జరిగిన ఒప్పందంలో ఈ శిక్షణ కార్యక్రమానికి రూపకల్పన చేశామని వారు పేర్కొన్నారు.

Pages