S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వట్టిపోయన జూరాల

గద్వాల, మే 3: జూరాల ప్రాజెక్టు నిర్మాణమై మూడు దశాబ్దాలు పూర్తయినా ఇంతటి దుర్బిక్ష పరిస్థితులు ఎప్పుడు దాపురించలేదు. ఈ ఏడాది ఆయకట్టు రైతులకు సాగునీరు అందించకపోగా ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న ప్రజల దాహార్థిని కూడ తీర్చలేక పోయింది. దాదాపు సగం జిల్లాకు తాగునీరు అందించే జూరాల ప్రాజెక్టు నుంచి కాలువల్లోకి నీటిని తోడేందుకు రంగం సిద్దమైంది. చరిత్రలో ఎన్నడులేని రీతిలో జూరాల ప్రాజెక్టులో నీటి మట్టాలు పడిపోయాయి. ప్రాజెక్టు అధారిత బ్యాలెన్స్ రిజర్వాయర్లను రామన్‌పాడు, గోపన్‌పాడు, జములమ్మ రిజర్వాయర్లలోనూ నీరు అడుగంటింది. ఈ రిజర్వాయర్ల ఆధారంగా జిల్లాలో సగం ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్నారు.

ఉపాధి కరువైంది.. బతుకు భారమైంది

మహబూబ్‌నగర్, మే 3: తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో ప్రజలకు ఉపాధి కరువైంది. పనులు లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బతుకుబారమై సోంత ఊర్లను విడిచి పాలమూరు పల్లెజనం పట్టణాల వైపు బతుకుదేరువు కోసం పరుగులు తీస్తున్నారు. సోంత గ్రామాలను వదులుతున్న జనం గత పరిస్థితులను గుర్తు చేసుకుంటూ కరువు దెబ్బకు తమ బ్రతుకులు చిద్రమైయ్యాయంటూ గొల్లుమంటున్నారు. పాలమూరులో కరువు రక్కసి ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. తాగడానికి కూడా మంచినీటి ఇబ్బందులు నెలకొన్నాయి. రెండు జీవనదులు ఉన్నప్పటికిని గత సంవత్సరం వరణుడు కరునించకపోవడంతో దుర్భిక్షమైన పరిస్థితి నెలకొంది.

‘పేట’ రోడ్డు విస్తరణకు మోక్షం

నారాయణపేటటౌన్, మే 3: దశాబ్దాల కాలం పాటు ప్రజలు ఎదురుచూస్తున్న నారాయణపేట రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లబించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రోడ్డు విస్తరణ చేపట్టేందుకు 28.50కోట్లు నిధులు విడుదల చేస్తూ జిఓఆర్‌టి నెం.206 తేది 2.5.2016న ఉత్తర్వులు జారీ చేసింది. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ స్కీం పథకం క్రింద నారాయణపేట పట్టణంలోని ప్రధాన రహదారిని విస్తరించేందకు సిఎం కెసిఆర్ సర్కార్ ఆమోద ముద్ర వేయడంతో పట్టణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణాన్ని అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా

గద్వాలటౌన్, మే 3: నేనుచేపట్టిన నిర్మాణాన్ని అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని గద్వాల ఆర్డీఓ, ఇన్‌చార్జి కమీషనర్ అబ్దుల్‌హమీద్‌తో భవన యజమాని వాగ్వివాదానికి దిగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన సంఘటన మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి కార్యాలయ సిబ్బంది కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయంలో ఇన్‌చార్జి కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న అబ్దుల్‌హమీద్ పట్టణంలోని సుంకులమ్మమెట్టు సమీపంలో అక్రమ కట్టడం చేపడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో స్పందించిన నిర్మాణాన్ని నిలిపివేయాలని యజమానికి నోటీసులు జారీ చేశారు.

తెరాసలో పదవుల పందేరం

మహబూబ్‌నగర్, మే 3: టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు పదవులు పందెరం షురూ అయ్యింది. వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తికి కసరత్తు మొదలైనట్లు తెలుస్తుంది. వివిధ నియోజకవర్గాలకు సంబందించిన సినియర్ నాయకులు పార్టీ అవిర్భావం నుండి గులాబీ జెండా పట్టుకుని ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నాయకుల జాబితా రెండు దఫాలుగా సిద్దం చేసినట్లు సమాచారం. దింతో టిఆర్‌ఎస్‌లో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. పలువురు ఆశావాహులు పదవుల కోసం లాబియింగ్ షురూ చేశారు.

పాలమూరు ఎత్తిపోతల అడ్డుకుంటే పుట్టగతులుండవు

మహబూబ్‌నగర్ టౌన్, మే 3: మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల చిరకాల వాంచ అయిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని టిడిపి, వై ఎస్ ఆర్ సిపి నాయకులు అడ్డుకుంటే వారికి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంతో ప్రతిపక్ష పార్టీలకు తమ ఉనికి ఎక్కడ కొల్పోతామనే భయం పట్టుకుందని అందువల్లే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎలాగైన అడ్డుకుని తమ ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారని ఆయన విమర్శించారు.

కరవు సహాయక చర్యల్లో తాత్సారం

నిజామాబాద్, మే 3: తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు తాండవిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు ఉదారంగా కరవు సహాయక నిధులు కేటాయిస్తాయని ఆశించిన స్థానిక ప్రజానీకానికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఇప్పటివరకు జిల్లాలో కరవు నివారణ పనుల కోసం ప్రత్యేకంగా నిధులను ఖర్చు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితి కాస్త ప్రతిపక్షాల ఆందోళనలకు ఊతమందిస్తోంది. కాంగ్రెస్, బిజెపి సహా వామపక్షాలు నిరసన కార్యక్రమాలతో కదం తొక్కుతున్నాయి. వారం రోజుల క్రితం ఖమ్మంలో టిఆర్‌ఎస్ నాయకత్వం ప్లీనరీని నిర్వహించిన సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వ వైఖరిని తూర్పారబడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది.

ప్రత్యామ్నాయం వైపు... సుగర్స్ కార్మికుల చూపు...!

బోధన్, మే 3:బోధన్ నిజాండెక్కన్ సుగర్స్ కర్మాగారంలో పనిచేసే కార్మికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడంలో నిమగ్నమయ్యారు. నాలుగు మాసాలుగా కర్మాగారం మూతపడి ఉండటం, చేయడానికి పనులు లేకపోవడంతో కార్మికులు ప్రైవేటు ఉద్యోగాల కోసం వెతకటం మొదలు పెట్టారు. ఈ కర్మాగారంలో దాదాపు 130 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. వీరంతా కర్మాగారంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రైవేటు యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించడంతో చేసేదేమి లేక నెలల తరబడి స్తబ్దంగా ఉన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి

ఎల్లారెడ్డి, మే 3: గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు చేయించుకునేలా వారికి అవగాహన కల్పించాలని డిఎంహెచ్‌ఓ వెంకట్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో మార్పు పథకంలో బాగంగా గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆశావర్కర్‌లతో సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీలు గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు అయ్యేంత వరకు వారికి నెల నెల వైద్య పరీక్షలు చేయించడం, ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పుచేయించుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.

కామారెడ్డిలో గాలి వానతో కూడిన వర్షం

కామారెడ్డి, మే 3: అల్పపీడన ద్రోణి వల్ల మంగళవారం సాయంత్రం 5.30గంటల నుండి 6గంటల వరకు కామారెడ్డి పట్టణంలోని భారీ వర్షం పడింది. ఉదయం నుండి మండుటెండలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. మండుతున్న ఎండల్లో నుండి నల్లని మబ్బులతో ఆకాశం అంతా కమ్ముకుని, ఉరుములు, మేరుపులతో కూడిన భారీ వర్షం అరగంటపాటు పడటంతో పట్టణంలో వేడి వాతావరణం చల్లబడింది. భారీ వర్షంతో పట్టణంలోనీ రైల్వేస్టేషన్ రోడ్డులో వర్షపునీరు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్డుపైనే నిలిచి పోవడంతో పాదాచారులు, వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.

Pages