S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/29/2018 - 01:34

మా మధ్య పెద్ద వ్యత్యాసమేమీ లేదు. సరిగ్గా సన్నద్ధమైతే, ఆమెతో అపజయాన్ని అధిరోహించడం పెద్ద కష్టమేమీ కాదనే అనుకుంటున్నా. ఏదోకరోజున ఆమెపై విజయం సాధిస్తా. అయితే, చెబుతున్నంత సులువు కాకపోవచ్చు. అదే సమయంలో చిన్నిచిన్ని పొరబాట్లు సరిదిద్దుకుని సన్నద్ధమైతే కష్టమూ కాదు. వరల్డ్ నెంబర్ 1తో ఆడుతున్నానన్న సంకోచాలు నా మనసులో ఎక్కడా లేవు.

08/28/2018 - 13:57

జకర్తా: ఆసియా క్రీడల్లో తెలుగు తేజం పీవీ సింధు రజిత పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో సింధు ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్‌(చైనీస్‌ తైపీ) చేతిలో రెండు వరుస గేమ్‌ల్లో ఓడి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.

08/28/2018 - 13:38

జకర్తా: ఆసియా క్రీడల్లో భారత్ మరో రజిత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆర్చరీ కాంపౌండ్ మహిళల విభాగంలో ఫైనల్‌లో భారత్ జట్టు దక్షిణ కొరియా చేతిలో 228-231 తేడాతో ఓడిపోయ రజతంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధూ నిలిచింది. ఇప్పటి వరకూ ఆసియా క్రీడల్లో మహిళల, పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరినవారు లేరు.

08/28/2018 - 18:24

జకార్తా, ఆగస్టు 27: ఆసియా వేదికపై భారత ఆటగాళ్లు చరిత్రను తిరగరాస్తున్నారు. అంచనాలకు మించిన సత్తా ప్రదర్శిస్తూ ఉపఖండం వేదికపై మువ్వనె్నల జెండాను రెపరెపలాడిస్తున్నారు. పతకాల రాసిలో విఫలమైనా, వాసిలో అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ‘ఖేల్ ఇండియా’కు కొత్త నిర్వచనం లిఖిస్తున్నారు.

08/28/2018 - 00:39

జకార్తా: ఆసియా గేమ్స్‌లో భారత్ చరిత్ర సృష్టించనుందా? స్టార్ షట్లర్ పీవీ సింధు కసిని చూస్తుంటే, ఆ మాట నిజం కావొచ్చన్న నమ్మకాలూ బలపడుతున్నాయి. సోమవారం జరిగిన సెమీఫైనల్స్‌లో కోర్టులో చిరుతలా కదిలిన సింధు, ప్రత్యర్థిని ముప్పుతిప్పలుపెట్టి మ్యాచ్‌ను కైవసం చేసుకున్న తీరు పసిడి సంకేతాన్ని బలోపేతం చేసేదే.

08/28/2018 - 00:29

జకార్తా, ఆగస్టు 27: ఆసియా ఆరంభ వేడుకల్లో ఫ్లాగ్ బేరర్‌గా నిలిచిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణాన్ని సాధించి సత్తా చాటుకున్నాడు. ఆసియా గేమ్స్ జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణాన్ని సాధించిన తొలి అథ్లెట్‌గానూ చరిత్ర సృష్టించాడు. తన పేరిటే వున్న జాతీయ రికార్డును బద్దలుకొట్టి జావెలిన్‌ను 88.06 మీటర్ల దూరం విసిరిన నీరజ్, వచ్చే ఒలింపిక్‌లో భారత్‌కు ఖాయంగా పతకం సాధించగలిగే సత్తా ప్రదర్శించాడు.

08/28/2018 - 00:32

తై జు వేగం అనూహ్యం. ఆమె ఆటను కనీసం అంచనా వేయలేకపోయాను. ఆమెతో ఆడాలంటే వేగం, సున్నితమైన కదలికల్లో మరింత రాటుదేలాలి. ఆమె సంపూర్ణమైన ప్లేయర్. ఆమె కొట్టిన షాట్స్, విసిరే ర్యాలీలు.. అన్నీ వైవిధ్యం అనిపించాయి. ఏ ప్లేయర్‌కైనా ఓ స్టయిలుంటుంది. కానీ, తై జు ఆట తీరే వేరు. ఆమెను అంచనా వేసేసరికే మ్యాచ్ ముగించింది. వైవిధ్యమైన ఆ నైపుణ్యమే తై జు విజయానికి కారణమై ఉండొచ్చు. నిజానికి నేను బాగా ఆడాను.

08/27/2018 - 17:44

జకర్తా: ఆసియా క్రీడల్లో తెలుగు తేజం పీవీ సింధూ చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధూ నిలిచింది. ఇప్పటి వరకూ ఆసియా క్రీడల్లో మహిళల, పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరినవారు లేరు.

08/27/2018 - 13:30

ఇండోనేషియా: ఆసియా క్రీడల్లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా జరిగిన తొలి సెమీఫైనల్లో సైనా... ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి తైజు యింగ్‌(చైనీస్‌ తైపీ)తో తలపడింది.

08/26/2018 - 23:30

ఎన్నాళ్లో వేచిన విజయం భారత్‌కు అందింది. 1982లో ఈక్వెస్ట్రియన్‌లో సాధించిన పతకం తప్ప, భారత్ ఈ క్రీడలో వెనుకబడే ఉంది. 36 ఏళ్ల తరువాత 18వ ఆసియా వేదికపై మరోసారి భారత జాకీలు తమ సత్తా చూపించారు. వ్యక్తిగత, టీం ఈవెంట్‌లో రజతాలు అందుకున్నారు.
*

Pages