S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/26/2018 - 23:28

జకార్తా/ పాలెంబాగ్, ఆగస్టు 26: ఆసియా బాడ్మింటన్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి పసిడి అందించేందుకు స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఉవ్విళ్లూరుతున్నారు. ఆదివారం హోరాహోరీ సాగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో ప్రత్యర్థులను మట్టికరిపించి ఇద్దరు స్టార్ షట్లర్లు సెమీస్‌కు దూసుకెళ్లారు. దీంతో ఇద్దరిలో ఎవరో ఒకరు భారత్‌కు స్వర్ణం సాధించడం ఖాయమన్న నమ్మకాలు బలపడుతున్నాయి.

08/26/2018 - 23:25

డిఫెండింగ్ చాంపియన్స్ భారత హాకీ జట్టు తన విజయపరంపర కొనసాగిస్తోంది. ఆదివారంనాటి లీగ్ మ్యాచ్‌లో ద.కొరియాను 5-3 స్కోరుతో మట్టి కరిపించి సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. రూపిందర్‌పాల్ సింగ్, చింగ్లెన్సన సింగ్, లలిత ఉపాధ్యాయ్, మన్‌ప్రీత్‌సింగ్, ఆకాష్‌దీప్ సింగ్‌లు సాధించిన వరుస గోల్స్‌తో ద.కొరియా జట్టు ఓటమిని అంగీకరించక తప్పలేదు. పూల్ -ఎలో భారత్ చివరి లీగ్ మ్యాచ్‌ను సోమవారం శ్రీలంకతో ఆడనుంది.

08/26/2018 - 23:23

జకార్తా, ఆగస్టు 26: ఆసియా వేదికలపై చెలరేగిన అథ్లెట్లు పతకాల వేటలో భారత్ వేగం తగ్గలేదని నిరూపించారు. స్ప్రింట్ ట్రాక్‌లపై సత్తాచాటుకుని మూడు రజతాలను భారత్ ఖాతాలో వేశారు. స్టార్ స్ప్రింటర్ ధుతి చంద్ 100 మీటర్ల పరుగులో అత్యుత్తమ ప్రదర్శనతో 20ఏళ్ల భారత కలను సాకారం చేసింది. కేవలం 2 మిల్లీ సెకండ్ల దూరంలో స్వర్ణాన్ని చేజార్చుకున్న ధుతి, 11.32 సెకండ్లలో రేస్‌ని పూర్తిచేసి రజతాన్ని సాధించింది.

08/26/2018 - 00:36

భారత్‌కు శనివారం మరో పసిడి దక్కింది. పురుషుల షాట్‌పుట్‌లో మహాబలుడు తిజేందర్‌పాల్ సింగ్ తూర్ ఆసియా గేమ్స్ వేదికపై భారత సత్తాను ప్రదర్శించాడు. 20.75 మీటర్ల షాట్ పుట్ రికార్డుతో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఆరేళ్ల క్రితం భారత షాట్‌పుటర్ ఓంప్రకాష్ కర్హానా నమోదు చేసిన 20.69 మీటర్ల దూరాన్ని అధిగమించడంతో తూర్ సరికొత్త రికార్డు నెలకొల్పినట్టయ్యింది. తాజా స్వర్ణంతో భారత్ సాధించిన

7=7
08/26/2018 - 03:19

భారత సత్తాను రెపరెపలాడిస్తారనుకున్న అథ్లెట్లు క్రీడాభిమానులను నిరాశపరుస్తున్నారు. ఒలింపిక్ హెవీవెయిట్ చైనా సాధించిన పసిడి పతకాల్లో సగానికంటే తక్కువే భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య ఉండటం బాధాకరం. వచ్చే టోక్యో-2020 ఒలింపిక్‌కు ఆసియా గేమ్స్‌ను రిహార్సల్స్ చేసుకుంటామంటూ గొప్పలు చెప్పి వెళ్లిన అథ్లెట్లు, జకార్తా, పాలెంబాగ్ మైదానాల్లో ప్రత్యర్థుల ముందు బోర్లా పడుతున్నారు.

08/25/2018 - 23:29

నా దృష్టి పసిడిమీద కాదు, 21మీటర్ల అవతలవున్న లక్ష్యం మీదే. రికార్డు దూరం షాట్‌పుట్ విసరాలన్న బలం ఈసారి సరిపోలేదు. జాతీయ రికార్డు తిరగరాసినందుకు సంతృప్తిగా ఉంది. ఎన్నో త్యాగాల ప్రతిఫలమిది. గత రెండేళ్లుగా నాన్న క్యాన్సర్‌తో బాధ పడుతున్నా, ఆ బాధ నావరకూ కుటుంబం రానివ్వలేదు. స్నేహితులే సొంత కొడుకుల్లా బాధ్యత నిర్వర్తించారు.

08/26/2018 - 03:24

జకార్తా: మారథాన్ ఫైనల్స్‌లో జపాన్ అథ్లెట్ హిరోటో ఇనోయు తనను తోసేసి పసిడి సాధించుకున్నాడంటూ బెహ్రెయిన్ అథ్లెట్ ఎల్హస్సన్ ఎలబ్బాసి ఆసియా నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. రేస్‌లో చివరి వంద మీటర్లు అధిగమించే సమయంలో ఓవర్‌టేక్ చేస్తున్న తనను హిరోటో గెంటివేశాడని, ట్రాప్‌పై నిలదొక్కుకుని రేస్ పూర్తి చేయగలిగానని ఫిర్యాదు చేశాడు. ‘హిరోటో నన్ను గెంటివేశాడు.

08/25/2018 - 00:49

పాలెంబాగ్, ఆగస్టు 24: 18వ ఆసియా గేమ్స్‌లో భారత రోవర్లు చారిత్రక విజయాలు నమోదు చేశారు. రోయింగ్ రేస్ చివరి రోజు పురుషుల క్వాడ్రుపుల్ స్కల్స్‌లో స్వర్ణం సాధిస్తే, లైట్‌వెయిట్ స్కల్స్ పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో కాంస్యాలను సొంతం చేసుకుని భారత ఆర్మీ పట్టు ఎంత బలమైనదో ప్రపంచానికి చాటిచెప్పారు. ‘రేపన్నది లేదు.

08/25/2018 - 00:46

6 రోజుల్లో భారత్ సాధించిన పతకాలు
*
స్వర్ణం 06
రజతం 05
కాంస్యం 14
మొత్తం 25
*
చిత్రం..హీనా సిధు

08/25/2018 - 00:44

పాలెంబాగ్, ఆగస్టు 24: టెన్నిస్ టాప్‌సీడ్స్ రోహన్ బొపన్న, దివిజ్ శరణ్‌లు శుక్రవారం అద్వితీయ విజయంతో పసిడి సాధించారు. 52 నిమిషాల అలుపెరగని ఆటతో కజకిస్తాన్ ఆటగాళ్లు అలెగ్జాండర్ బబ్లిక్, డెనిస్ యెవ్సెయేవ్‌లను 6-3, 6-4 సెట్లతో మట్టికరిపించారు. భారత ఆటగాడు బోపన్న అటాకింగ్ సర్వీసుల ముందు కజకిస్తాన్ ఆటగాళ్లు నిలవలేకపోయారు. రెండో గేమ్‌లోనూ కజక్ ఆటగాళ్ల ప్రయత్నాలు భారత ద్వయం ముందు సాగలేదు.

Pages