S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/15/2018 - 01:07

న్యూఢిల్లీ, మే 14: రిషబ్ పంత్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇంతవరకు ఆడిన మ్యాచ్‌లలో ఏ క్రికెటర్ సాధించనని పరుగులు సాధించి, తన అద్భుత ప్రదర్శనతో ‘ఆరెంజ్ క్యాప్’ను దక్కించుకున్నాడు.

05/15/2018 - 01:05

న్యూఢిల్లీ, మే 14: ఆసియా క్యాడెట్, జూనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు చక్కటి ప్రతిభను కనపరిచి సత్తాచాటారు. 12వ ఆసియా క్యాడెట్, 19వ ఆసియా జూనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 9 పతకాలు సాధించింది. వీటిలో మూడు స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలను భారత్ సొంత చేసుకుంది.

05/15/2018 - 01:04

ముంబయి, మే 14: రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానెపై ఐపీఎల్ నిర్వాహకులు 12 లక్షల భారీ జరిమానా విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం ముంబయి వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాళ్లు నెమ్మదిగా ఓవర్లు వేశారు. అనుకున్న సమయంలో వారు ఇన్నింగ్స్‌ను పూర్తిచేయలేకపోయారు.

05/15/2018 - 01:04

హేన్‌నోవర్ (జర్మనీ), మే 14: ఇక్కడ జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ కాంపిటీషన్‌లో భాగంగా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ హీనా సిద్ధు గోల్డ్ మెడల్ సాధించింది. మరో భారత షూటర్ శ్రీ వినేత రజతతో సరిపెట్టుకుంది. వచ్చే వారం మ్యూనిచ్ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌లో నిర్వహించే వరల్డ్ కప్ పోటీలో వీరు మరింత ఉత్సాహంగా పాల్గొంటారు.

05/15/2018 - 01:02

వెల్లింగ్టన్, మే 14: న్యూజిలాండ్ బాక్సర్ సాధించిన గోల్డ్ మెడల్ చోరీకి గురైంది. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో హెవీవెయిట్ విభాగంలో 22 ఏళ్ల న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ నరుూకా గోల్డ్ మెడల్ సాధించాడు. ఆక్లాండ్‌లో ఈ గోల్డ్ మెడల్ చోరీకి గురైనట్టు గుర్తించానని ఆయన పేర్కొన్నాడు.

05/15/2018 - 01:01

ముంబయి, మే 14: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన రికార్డును రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న జోస్ బట్లర్ సమం చేశాడు. 2012 ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున పాల్గొని ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేసి రికార్డును నెలకొల్పాడు.

05/15/2018 - 01:00

కోల్‌కతా, మే 14: ఐపీఎల్ సీజన్ ముగింపులో దాదాపు ప్లే ఆఫ్ దశకు వివిధ జట్లు చేరుకుంటున్న తరుణంలో ఇపుడిపుడే దూకుడును ప్రదర్శిస్తున్న రాజస్తాన్ రాయల్స్‌కు మంగళవారం తమ స్వంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ముకుతాడు వేయగలదా? అని పలువురు క్రీడాభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఎనిమిది జట్లలో కోల్‌కతా నాలుగో స్థానంలో ఉండగా, రాజస్తాన్ ఐదో స్థానంలో నిలిచింది.

05/15/2018 - 00:59

ముంబయి, మే 14: గడిచిన మూడు మ్యాచ్‌లలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న తమ జట్టు మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచేందుకు అపార అవకాశాలు ఉన్నాయని రాజస్తాన్ రాయల్స్ టీమ్ క్రికెటర్ ధవల్ కులకర్ణి అన్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిపై గెలుపు ద్వారా ప్లే ఆఫ్‌లో బెర్త్ కోసం అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని ఆయన పేర్కొన్నాడు.

05/15/2018 - 00:57

పారిస్, మే 14: క్రెచ్ టెన్నిస్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా డబ్ల్యూటీఏ సోమవారం తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ జాబితాలో రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించుకుంది. గతవారం జరిగిన మాడ్రిడ్ ఓపెన్‌లో తన ప్రత్యర్థి కికీ బెర్టెన్స్‌ను ఓడించడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించింది.

05/15/2018 - 00:56

పారిస్, మే 14: పురుషుల టెన్నిస్ విభాగంలో ఏటీపీ తాజాగా ప్రకటించిన జాబితాలో మళ్లీ రోజర్ ఫెదరర్ నెంబర్‌వన్‌గా నిలిచాడు. మాడ్రిడ్ మాస్టర్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ నుండి నాదల్ వైదొలగడంతో ఇంతవరకు తొలి స్థానంలో ఉన్న అతనిని తోసిరాజని ఫెదరర్ ఆ స్థానాన్ని ఆక్రమించాడు. ప్రపంచ మాజీ నెంబర్ వన్ నవోక్ జొకోవిచ్ ఆరు స్థానాలు దిగజారి 18వ ర్యాంక్‌లో నిలిచాడు.

Pages