S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/16/2017 - 00:25

కోల్‌కతా: జట్టులోని సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ వెల్లడించాడు. టీమిండియాతో గురువారం నుంచి మొదటి టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో, బుధవారం అతను విలేఖరుల సమావేశంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ జట్టు అవసరాలను గుర్తించి, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు దిగేందుకు మాథ్యూస్ సంసిద్ధత వ్యక్తం చేశాడని చెప్పాడు.

11/16/2017 - 00:24

కోల్‌కతా, నవంబర్ 15: అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపిఎల్‌కు కూడా ఇటీవల గుడ్‌బై చెప్పిన ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా గురువారం టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఆటగాడిగా ఎప్పుడో టెస్టుల్లోకి అడుగుపెట్టిన అతను కామెంటేటర్‌గా కొత్త అవతారంలో కనిపిస్తాడు. భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే మొదటి టెస్టులో కామెంట్రీ చెప్పనున్నడు.

11/16/2017 - 00:24

ఫుజో, నవంబర్ 15: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత జాతీయ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్ వన్ సైనా నెహ్వాల్ రెండో రౌండ్ చేరింది. మొదటి రౌండ్‌లో ఆమె బీవన్ జాంగ్‌ను 21-12, 21-13 తేడాతో ఓడించింది. ఈ రౌండ్‌ను సునాయాసంగానే ముగించినప్పటికీ, రెండో రౌండ్‌లో ఆమెకు జపాన్ క్రీడాకారిణి అకానే యమాగూచీ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది.

11/16/2017 - 00:23

కోల్‌కతాలో మంగళవారం రాత్రి వర్షం కురవడంతో, ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని బుధవారం కవర్లతో కప్పి ఉంచిన దృష్యం. భారత్, శ్రీలంక జట్ల మధ్య గురువారం నుంచి మొదటి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో, ఆటకు అంతరాయం కలగవచ్చన్న భయం అభిమానులను వెంటాడుతున్నది. ఇలావుంటే, బుధవారం టీమిండియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. వర్షం వల్ల నెట్స్‌ను రద్దు చేసినట్టు జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది.

11/16/2017 - 00:17

డబ్లిన్ (ఐర్లాండ్)లో జరిగిన వరల్డ్ కప్ సాకర్ క్వాలిఫయర్స్‌లో హ్యాట్రిక్ సాధించిన డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియన్ ఎరిక్సెన్ ఆనందం. అతని ప్రతిభ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌పై డెన్మార్క్‌కు 5-1 తేడాతో
విజయాన్ని సాధించిపెట్టింది. అంతేగాక, ఈ విజయంతో డెన్మార్క్ వరల్డ్ కప్ సాకర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది

11/16/2017 - 00:15

లండన్‌లో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను 7-6, 5-7, 6-1 తేడాతో ఓడించి ఎటిపి వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో సెమీ ఫైనల్స్ చేరిన
స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్

11/16/2017 - 00:13

న్యూఢిల్లీ, నవంబర్ 15: లోధా సిఫార్సుల అమలుకు తీసుకోవాల్సిన చర్చలపై చర్చించి, తదనుగుణంగా తీర్మానాలను ఆమోదించేందుకు వార్షిక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)ను నిర్వహించాలని, అందుకు సంబంధించిన నోటీసును గురువారంలోగా విడుదల చేయాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)ని పాలకాధికారుల బృందం (సీఓఏ) ఆదేశించింది.

11/16/2017 - 00:12

దోహా, నవంబర్ 15: రెండు రోజుల క్రితం ఐబిఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత స్టార్ పంకజ్ అద్వానీ లాంగ్-అప్ ఫార్మాట్‌లో అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. కెరీర్‌లో 17 ప్రపంచ టైటిళ్లను గెల్చుకున్న చేసుకున్న అతను లాంగ్-అప్ ఫార్మాట్‌లో కాంస్య పతకంతో సరిపుచ్చుకున్నాడు.

11/16/2017 - 00:12

ఇండోర్, నవంబర్ 15: లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్, ఇటీవల కాలంలో సంచలన విజయాలతో దూసుకెళుతున్న భజరంగ్ పునియా తదితరులు బరిలో లేకపోవడంతో, గురువారం నుంచి మొదలయ్యే జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సుశీల్ కుమార్ స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. రెండు పర్యాయాలు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ సుమారు మూడు సంవత్సరాలుగా రెజ్లింగ్ పోటీలకు దూరంగా ఉంటున్నాడు.

11/15/2017 - 01:33

కోల్‌కతా, నవంబర్ 14: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జట్టు ప్రధాన కోచ్ రవిశాస్ర్తీ మరోసారి గట్టిగా మద్దతు తెలిపాడు. దేశానికి రెండుసార్లు ప్రపంచ కప్ క్రికెట్ టైటిళ్లను అందించి చరిత్ర సృష్టించిన ధోనీ భవిష్యత్తు గురించి మాట్లాడే వారంతా ముందు తమ భవిష్యత్తు ఏమిటో ఆలోచించుకోవాలని రవిశాస్ర్తీ స్పష్టం చేశాడు.

Pages