S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/07/2017 - 00:40

టౌన్టన్, జూలై 6: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌ను ఢీకొన్న న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 43 ఓవర్లలో 150 పరుగులకే అలౌటైంది. కిషోనా నైట్ (41), అఫి ప్లెచర్ (23 నాటౌట్), మెరిసా ఎగిలెరా (20), స్ట్ఫానీ టేలర్ (20) కొంత సేపు కివీస్ బౌలింగ్‌ను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు.

07/06/2017 - 00:47

కింగ్‌స్టన్ (జమైకా), జూలై 5: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వనే్డ గురువారం జరగనుండగా, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దుకాగా, ఆతర్వాత వరుసగా రెండు విజయాలు సాధించిన భారత్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే, నాలుగో వనే్డను అనూహ్యంగా 11 పరుగుల తేడాతో చేజార్చుకుంది.

07/06/2017 - 00:45

కింగ్‌స్టన్ (జమైకా), జూలై 5: హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ ఈ ఆదివారం భారత్‌తో జరిగే ఏకైక టి-20 మ్యాచ్‌లో ఆడే విండీస్ జట్టుకు ఎంపికయ్యాడు. తన హోం గ్రౌండ్ సబీనా పార్క్‌లో మొదటిసారి టి-20 మ్యాచ్ ఆడే అవకాశం గేల్‌కు లభించనుంది. లెండల్ సిమన్స్ ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన టి-20 సిరీస్‌లో దారుణంగా విఫలం కావడంతో, అతని స్థానాన్ని గేల్ దక్కించుకున్నాడు.

07/06/2017 - 00:45

డెర్బీ, జూలై 5: మహిళల ప్రపంచ కప్‌లో భారత జట్టు సత్తా చాటుతూ, వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దీప్తి శర్మ, కెప్టెన్ మిథాలీ రాజ్ అర్థ శతకాలతో రాణించగా, 8 వికెట్లకు 232 పరుగులు సాధించిన భారత్ ఆతర్వాత ప్రత్యర్థిని ఏడు వికెట్లకు 216 పరుగులకే కట్టడి చేసింది.

07/06/2017 - 00:45

బ్రిస్టల్: దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. టామీ బ్యూవౌట్, సారా టేలర్ శతకాలతో రాణించారు. విజయానికి 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా, చివరి వరకూ పోరాడిన దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 305 పరుగులు చేయగలిగింది.

07/06/2017 - 00:44

లండన్, జూలై 5: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో విక్టోరియా అజరెన్కా మూడో రౌండ్ చేరింది. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆమె ప్రపంచ 15వ ర్యాంక్ క్రీడాకారిణి ఎలెనా వెస్నినాను 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో సులభంగా గెలిచి, ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఈ టోర్నీలోకి అడుగుపెట్టిన హీతర్ వాట్సన్ మొదటి అడ్డంకి సమర్థంగా పూర్తి చేసింది.

07/05/2017 - 01:18

లండన్, జూలై 4: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రౌండ్‌లోనే ప్రపంచ మాజీ నంబర్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ అయిన స్టాన్ వావ్రిన్కా పరాజయం పాలయ్యాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో రష్యాకు చెందిన డేనియల్ మెద్వదెవ్ 6-4, 3-6, 6-4, 6-1 స్కోరుతో వావ్రిన్కాను ఓడించాడు. 21 ఏళ్ల మెద్వదెవ్ వింబుల్డన్‌లో ఆడడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

07/05/2017 - 01:15

న్యూఢిల్లీ, జూలై 4: టీమిండియా ప్రధాన కోచ్ పదవి రవిశాస్ర్తీని వరించనుందా?. ఈ వ్యవహారంపై మాజీ కెప్టెన్ గవాస్కర్ వ్యక్తం చేసిన ‘అభిప్రాయాలు’, ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ చుట్టూ షికారు చేస్తున్న పుకార్లను చూస్తుంటే ఈ ప్రశ్నకు అవునన్న సమాధానమే వస్తోంది.

07/05/2017 - 01:14

బ్యాంకాక్, జూలై 4: ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో వరల్డ్ యూత్ చాంపియన్ సచిన్ సివాచ్‌తో పాటు మరో ఇద్దరు భారతీయులు సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. దీంతో మంగళవారం భారత్‌కు ఈ పోటీల్లో మంచి ఫలితాలు లభించాయి. 49 కిలోల విభాగం క్వార్టర్ ఫైనల్ పోరులో సచిన్ ఫిలిప్పీన్స్‌కు చెందిన జేమ్స్ ఇయాన్ సోలిస్‌ను మట్టికరిపించి సత్తా చాటుకున్నాడు.

07/05/2017 - 01:13

న్యూఢిల్లీ, జూలై 4: అమెరికా, కెనడాల్లో త్వరలోజరగనున్న టోర్నమెంట్‌లో ఆడడం కోసం గురువారం బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమైన బ్యాడ్మింటన్ టాప్ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ తదితరులు పాస్‌పోర్టుల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. కామనె్వల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్, అపణయ్, డబుల్స్ స్పెషలిస్టు ఎన్ సిక్కి రెడ్డిలు వారం రోజుల క్రితమే న్యూజిలాండ్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Pages