S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/05/2017 - 01:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ టి-20 టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందే ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చికెన్ పాక్స్ (మసూచి) వ్యాధితో బాధపడుతున్న యువ స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ కనీసం వారం రోజుల పాటు డేర్‌డెవిల్స్ జట్టుకు దూరం కానున్నాడు.

04/05/2017 - 01:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: టీమిండియా సీనియర్ స్పీడ్‌స్టర్ ఇశాంత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తరఫున ఆడనున్నాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు 77 మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించిన ఇశాంత్‌పై ఫిబ్రవరిలో నిర్వహించిన ఐపిల్-10 ఆటగాళ్ల వేలంలో అన్ని జట్ల యాజమాన్యాలు శీతకన్ను వేసిన విషయం విదితమే.

04/05/2017 - 01:17

1. గుజరాత్ లయన్స్, 2. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, 3. సన్‌రైజర్స్ హైదరాబాద్, 4. ముంబయి ఇండియన్స్, 5. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 6. కోల్‌కతా నైట్ రైడర్స్, 7. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, 8. ఢిల్లీ డేర్ డెవిల్స్.
* కొచ్చి టస్కర్స్, పుణే వారియర్స్, డక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీలు వివిధ కారణాల వల్ల రద్దయ్యాయి.

04/05/2017 - 01:17

తేదీ, టైమ్ మ్యాచ్ వేదిక
ఏప్రిల్ 5, రా.8 హైదరాబాద్-బెంగళూరు హైదరాబాద్
ఏప్రిల్ 6, రా.8 పుణె-ముంబయి పుణె
ఏప్రిల్ 7, రా.8 గుజరాత్-కోల్‌కతా రాజ్‌కోట్
ఏప్రిల్ 8, సా.4 పంజాబ్-పుణె ఇండోర్
ఏప్రిల్ 8, రా.8 బెంగళూరు-్ఢల్లీ బెంగళూరు
ఏప్రిల్ 9, సా.4 హైరదాబాద్-గుజరాత్ హైదరాబాద్
ఏప్రిల్ 9, రా.8 ముంబయి-కోల్‌కతా ముంబయి

04/05/2017 - 01:16

బెంగళూరు, ఏప్రిల్ 4: డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా/ఓషియానియా జోన్ గ్రూప్-1లో భారత్‌తో తలపడబోతున్న ఉజ్బెకిస్తాన్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మడమ గాయంతో బాధపడుతున్న టాప్ ఆటగాడు డెనిస్ ఇస్టోమిన్ మంగళవారం ఆ జట్టు నుంచి వైదొలిగాడు.

04/05/2017 - 01:14

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: థాయిలాండ్‌లో వచ్చే నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా చాంపియన్‌షిప్స్ మీట్ నుంచి భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ (23) వైదొలిగింది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆమె శస్త్ర చికిత్స చేయించుకునేందుకు వెళ్లడమే ఇందుకు కారణం.

04/05/2017 - 01:14

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: అంతర్జాతీయంగా క్రీడల రంగంలో రాణించే విషయం ఎలా ఉన్నప్పటికీ డోపింగ్ ఉల్లంఘనల్లో మాత్రం మన దేశం ఇతర దేశాలకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంది. 2015 సంవత్సరానికి గాను ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజన్సీ అయిన ‘వాడా’ రూపొందించిన జాబితాలో మన దేశం వరసగా మూడో సంవత్సరం కూడా మూడో స్థానంలో నిలిచింది.

04/04/2017 - 00:14

కౌంట్ డౌన్ 1

04/04/2017 - 00:10

కీ బిస్కేన్, ఏప్రిల్ 3: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌ను ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ గెల్చుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాదిరిగానే ఈ టోర్నీ ఫైనల్‌లోనూ అతను ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌తో తలపడ్డాడు. గట్టిపోటీనిస్తాడనుకున్న నాదల్ పేలవమైన ఆటతో అభిమానులను నిరాశపరచగా, ఫెదర్ 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయభేరి మోగించాడు.

04/04/2017 - 00:09

* ఐపిఎల్‌లో ఎన్నో ఆకర్షణలున్నాయి. అందుకే, ఇది ఇంతగా విజయవంతమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న క్రిస్ గేల్ 2013లో పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 2010లో ముంబయి ఇండియన్స్‌పై యూసుఫ్ పఠాన్ (రాజస్థాన్ రాయల్స్) 37, 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై డేవిడ్ మిల్లర్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) 38 బంతుల్లోనే సెంచరీలు సాధించారు.

Pages