S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/07/2017 - 07:30

హైదరాబాద్, ఏప్రిల్ 6: చివరి వరకూ పోరాడడమే తన విజయ రహస్యమని ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 62 పరుగులు సాధించిన అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.

04/07/2017 - 07:30

పుణే, ఏప్రిల్ 6: ఐపిఎల్‌లో భాగంగా గురువారం ముం బయ ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ని రైజింగ్ పుణే సూపర్ జెయంట్స్ ఏడు వికెట్ల తేడాతో గెల్చుకుంది. స్టీవెన్ స్మిత్ అజే యంగా 84 పరుగులు చేసి, మరో బంతి మిగిలి ఉండగానే పుణే జట్టును విజయపథంలో నడిపించాడు. సొంత రాష్ట్రం లో ముంబయకి ఎదురుదెబ్బ తగిలింది.

04/07/2017 - 07:29

డేవిస్ కప్ పోటీలకు
వెటరన్ ఆటగాడు దూరం
గత 27 ఏళ్లల్లో
ఇదే మొదటిసారి

04/06/2017 - 07:29

కచింగ్ (మలేసియా), ఏప్రిల్ 5: ఇటీవలే ఇండియన్ ఓపెన్ బాడ్మిం టన్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్, రియో ఒలింపిక్స్‌లో తనను ఓడిం చిన కరోలినా మారిన్‌ను ఓడించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పివి సింధు ఇక్కడ ప్రారంభమైన మలేసియా ఓపెన్ బాడ్మింటన్ తొలి రౌండ్ లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. చైనాకు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారి ణి చెన్ యుఫెయ్ 18021, 21-19, 21-17 తేడాతో సింధును ఓడించి, రెండో రౌండ్ చేరింది.

04/06/2017 - 07:27

హైదరాబాద్, ఏప్రిల్ 5: పదో ఐపిఎల్‌ను పలువురు క్రికెటర్ల గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. కొంత మంది ఆటగాళ్లు పూర్తిగా టోర్నీకి దూరంకాగా, మరి కొంత మంది కనీసం కొన్ని మ్యాచ్‌ల్లో ఆడలేని పరిస్థితుల్లో ఉన్నారు. స్టార్ అట్రాక్షన్‌గా నిలిచే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజం గాయంతో బాధపడుతున్నాడు.

04/06/2017 - 07:26

పుణే, ఏప్రిల్ 5: గతంలో రెండు పర్యాయాలు చాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్‌తో గురువారం పలపడుతున్న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌కు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఎంత వరకూ అండగా నిలుస్తాడో, జట్టు విజయానికి ఎంత వరకూ కృషి చేస్తాడోనన్న ఉత్కంఠ అభిమానుల్లో క్షణక్షణానికీ పెరుగుతున్నది. ఈసారి వేలంలో అందరి కంటే ఎక్కువ మొత్తాన్ని అతనే దక్కించుకోవడంతో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

04/06/2017 - 07:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ‘క్రికెట్ బైబిల్’ విజ్‌డెన్ 2016 సంవత్సరానికి లీడింగ్ క్రికెటర్‌గా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. నిరుడు అతను టెస్టుల్లో 75.93 సగటుతో 1,215 పరుగులు సాధించాడు. 10 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడి, 92.37 సగటుతో 641 పరుగులు చేశాడు. టి-10 ఫార్మాట్‌లోనూ అద్భుతంగా రాణించి, సగటున 106.83 పరుగులు నమోదు చేశాడు.

04/06/2017 - 07:25

హైదరాబాద్, ఏప్రిల్ 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రై జర్స్ హైదరాబాద్ బోణీ చేసింది. నిరుటి రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 40 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. బుధవా రం రాజీవ్ గాంధీ స్టేడియంలో పదో ఐపిఎల్ ప్రా రంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగి న మ్యాచ్‌లో నిరుటి ఫైనలిస్టు జట్లు ఢీకొన్నాయ.

04/05/2017 - 01:23

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ పండుగ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది.

04/05/2017 - 01:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ టి-20 టోర్నమెంట్‌లో వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ లాంటి మహామహులతో కూడిన బృందంలో ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కూడా చేరబోతున్నాడు.

Pages