S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/06/2017 - 03:54

హైదరాబాద్, డిసెంబర్ 5: ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, పిజి, డిగ్రీ, ఇంటర్ కోర్సులు చదివే విద్యార్థుల పూర్తి ఫీజులు చెల్లించాలని, గత ఏడాది రూ.1400 కోట్ల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం రంగారెడ్డి జిల్లా, చంపాపేటలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన బిసి విద్యార్థుల మహాగర్జన జరిగింది. ఈ సమావేశానికి టి.జెఎసి చైర్మన్ ఎం.

12/06/2017 - 03:54

హైదరాబాద్, డిసెంబర్ 5: రసాయన ఎరువులు, రసాయన పురుగు మందుల వల్ల భూములు సారంలేకుండా పోతున్నాయని జాతీయ వ్యవసాయ పరిశోధనా యాజమాన్య సంస్థ (మేనేజ్) సంచాలకుడు డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ హైదరాబాద్ చాప్టర్ నేతృత్వంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం డాక్టర్ ఎంవి శాంతారం ఐదో స్మారకోపన్యాసం చేశారు.

12/06/2017 - 03:53

హైదరాబాద్, డిసెంబర్ 5: చేనేత రంగానికి విశిష్ట సేవలు అందించిన పద్మశ్రీ అవార్డు గ్రహిత చింతకింది మల్లేశంకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం అందించారు. ఈ ఆర్థిక సహాయంతో చేనేత రంగానికి అవసరమైన ఇతర ఆవిష్కరణలు చేయడానికి వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రూరల్ ఇన్నోవేషన్ రంగానికి ప్రభుత్వం చేయూతనిస్తుందని అన్నారు.

12/06/2017 - 03:51

హైదరాబాద్, డిసెంబర్ 5: బిసి అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జిటి) పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని టిఎస్ బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, హైదరాబాద్ (సైదాబాద్-సంతోష్‌నగర్) లోని బిసి స్టడీ సర్కిల్‌లో స్వయంగా అభ్యర్థులు దరఖాస్తులు ఇవ్వాలని ఆయన సూచించారు.

12/06/2017 - 03:50

హైదరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణ జైళ్లశాఖలో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు నాలుగవ స్పోర్ట్స్ మీట్ జరుగుతుందని జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ తెలిపారు. నగరంలోని చంచల్‌గూడ సికా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే స్పోర్ట్స్ మీట్‌ను బుధవారం ఉదయం గం. 10:00లకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ప్రారంభిస్తారని డీజీ పేర్కొన్నారు.

12/06/2017 - 03:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: బయ్యారంలో ఇంటిగ్రేటేట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై త్వరలో ఒక స్పష్టత రానుందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర మంత్రి చౌదరి బీరేందర్ సింగ్‌తో సమావేశమయ్యారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం సానుకులంగా ఉందని వెల్లడించారు.

12/06/2017 - 03:49

హైదరాబాద్, డిసెంబర్ 5: విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వేదుల వెంకటరమణ జపాన్ ఆసియన్ ప్రోడక్టివిటీ ఆర్గనైజేషన్‌కు జాతీయ నిపుణుడిగా ఎన్నికయ్యారు. ఏడాది పాటు భారత్‌లో మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి విధాన నిర్ణయానికి ముసాయిదా రూపొందిస్తారు.

12/06/2017 - 03:49

హైదరాబాద్, డిసెంబర్ 5: కోదండరామ్ ముఠాను నిరుద్యోగులు నమ్మడం లేదని టిఆర్‌ఎస్ పార్టీ విమర్శించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రజల నుంచి లభిస్తున్న మద్దతును చూసి తట్టుకోలేని అక్కసుతోనే కొలువుల కొట్లాట పేరిట విపక్షాలు కోదండరామ్‌ను అడ్డుపెట్టుకుని విపక్షాలు విషం కక్కుతున్నాయని టిఆర్‌ఎస్ మండిపడింది.

12/06/2017 - 03:48

హైదరాబాద్, డిసెంబర్ 5: భవిష్యత్తులో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఖాజాగూడలో స్కై-వే నిర్మించినున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఖాజాగూడ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు సుమారు 2 కిలో మీటర్ల వరకు 3 కోట్ల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.

12/06/2017 - 03:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికను మొఘల్ వారసత్వంతో ప్రధాని నరేంద్ర మోదీ పోల్చడాన్ని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. ఢిల్లీలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ దేశంకోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం నుంచి వస్తున్న రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

Pages